Swiss banks easing secrecy norms

Swiss Banks,Internal Revenue Service,india tax,HSBC,Anna Hazare

How can black money be brought back to India? Developments in Switzerland and its impending agreement with Germany shed light on ways and means

Swiss banks easing secrecy norms.gif

Posted: 06/09/2012 04:41 PM IST
Swiss banks easing secrecy norms

విదేశాల్లో దాచిన నల్ల డబ్బును తిరిగి భారత్‌కు తీసుకు రావాల్సిందే. నల్ల కుబేరుల పేర్లను వెల్లడించాల్సిందే' - వివిధ రాజకీయ పార్టీలతోపాటు అన్నా హజారే, బాబా రాందేవ్ వంటి ఉద్యమకారుల డిమాండ్ ఇది. 'విదేశాల్లో నల్ల డబ్బు దాచిన వారి పేర్లను వెల్లడించడం సాధ్యం కాదు. ఆ డబ్బును తిరిగి భారత్‌కు తీసుకొచ్చేందుకు మార్గాలు అన్వేషిస్తున్నాం'- ఇది కేంద్ర ప్రభుత్వం చెబుతున్న జవాబు. అయితే, ఆ అతి రహస్యం ఇక బట్టబయలు కానుంది. జర్మనీతో ఇటీవల స్విట్జర్లాండ్ కుదుర్చుకున్న ఒప్పందమే దీనికి నిదర్శనం.

జర్మనీతో టాక్స్ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి స్విట్జర్లాండ్ పార్లమెంటు ఇటీవల గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీని ప్రకారం లెక్కల్లోకి రాని డబ్బునకు సంబంధించి జర్మనీ ఆదాయ పన్ను అధికారులకు స్విస్ బ్యాంకులు గుర్తు తెలియని ఖాతాల ద్వారా అడ్వాన్స్ చెల్లింపులు చేస్తాయి. జర్మనీతోపాటు ఆస్ట్రియాలతోనూ స్విట్జర్లాండ్ ఇదే విధమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇటలీతో ఒప్పందం చర్చల్లో ఉంది. వాస్తవానికి, జర్మన్లకు సంబంధించిన 291.8 బిలియన్ డాలర్లు మన రూపాయల్లో సుమారు 15 లక్షల కోట్లు స్విస్ బ్యాంకుల్లో మూలుగుతోంది. ఇందులో 60 శాతం పన్ను ఎగ్గొట్టినదే. ఈ నేపథ్యంలో, స్విట్జర్లాండ్‌లో వారు డబ్బు దాచిన రోజు నుంచి 21 నుంచి 41 శాతం పన్ను విధించాలని జర్మనీ చట్టసభ ప్రతినిధులు ప్రతిపాదిస్తున్నారు.

ఈ ఒప్పందానికి జర్మనీ పార్లమెంటు కూడా ఆమోద ముద్ర వేస్తే ఆ దేశానికి పెద్దఎత్తున పన్ను ఆదాయం సమకూరనుంది. విచిత్రం ఏమిటంటే.. ఈ ఒప్పందానికి ఇటు జర్మనీలోనూ అటు స్విట్జర్లాండ్‌లోనూ కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో దాచిన డబ్బు 7 ట్రిలియన్ డాలర్లు మన రూపాయల్లో చెప్పాలంటే సుమారు 3.5 కోట్ల కోట్లు! ఇందులో మూడో వంతు ఒక్క స్విట్జర్లాండ్‌లోనే ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anti corruption bureau registers more cases in ap liquor scam
Talent management  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles