remedies to get eternal youth look | beauty tips | healthy foods for skin | remedies for skin

Remedies to get eternal youth look beauty tips healthy foods for skin

eternal youth remedies, eternal youth tips, beauty tips for skin, skin remedies, skin beauty tips, skincare remedies, skin healthy foods, healthy foods for skin

remedies to get eternal youth look beauty tips healthy foods for skin : experts suggesting to take healthy foods to get eternal youth and follow beauty tips

ఈ చిట్కాలు పాటించండి.. నిత్యం యవ్వనంగా వుండండి!

Posted: 11/05/2015 01:44 PM IST
Remedies to get eternal youth look beauty tips healthy foods for skin

వయస్సు పెరిగేకొద్ది సౌందర్యానికి సంబంధించిన సమస్యలు పెరుగుతుంటాయి. చర్మం ముడతలు పడటం, పొడిబారిపోవడం, మొటిమల మచ్చలు అలాగే వుండిపోవడం, జుట్టు రాలిపోవడం.. ఇలా రకరకాల ఇబ్బందులు ఏర్పడుతాయి. దీంతో.. చర్మసౌందర్యం క్షీణిస్తుంది. అలాకాకుండా ఈ సమస్యల్ని అధిగమించి, నిత్యం యవ్వనంలా కనిపించాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందని బ్యూటీషియన్స్ అంటున్నారు.

ముఖం నిత్య యవ్వనంగా ఉండాలంటే.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాల్సిందేనని అంటున్నారు. మోనోశాచురేటెడ్ ఆయిల్, విటమిన్ ఇ, బి కాంప్లెక్స్ విటమిన్లను తీసుకోవాలి. చేపలు తింటే ఇవన్నీ లభిస్తాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ముఖ వర్చస్సు ఎంతో మేలు చేస్తాయి. ముఖానికి సక్రమంగా రక్త ప్రసరణ జరగాలంటే ఎక్సర్‌సైజ్ తప్పకుండా చేయాలి. కళ్లు బాగా అలసిపోయినప్పుడు చల్లటి దోసకాయ ముక్కల్ని రెండు మూడు నిమిషాలు మూసుకున్న కనురెప్పల మీద ఉంచండి. కళ్లకు ఉపశమనం లభించడమే కాకుండా, ఇవి కళ్ల కింద నలుపును తగ్గిస్తుంది. వారానికి ఒకసారి లేదా రెండుసార్లు ఇలా చేస్తే కంటి కింద నల్లటి వలయాలను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

మరికొన్ని చిట్కాలు :

* కాలుష్యం కారణంగా చర్మం నిగారింపు కోల్పోతుంది. అప్పుడు నిగారింపు తిరిగి పొందాలంటే.. ఈ చిట్కా పాటిస్తే సరిపోతుంది. ఒక గిన్నెలో కమలాఫలం రసం తీసుకుని అందులో చెంచా తేనె, పచ్చిపాలూ, కోడిగుడ్డులోని తెల్లసొన వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని ఒంటికి రాసి పది నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత సబ్బులేకుండా స్నానం చేస్తే చర్మం తాజాగా ఉంటుంది.

* ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల గులాబీరేకుల పొడి తీసుకుని అందులో చెంచా బాదం నూనె, చెంచా కమలా ఫలం రసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని, ఆరేంతవరకు వుంచుకోవాలి. అనంతరం గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే.. చరమంపై వుండే మృతకణాలు, బ్లాక్ హెడ్స్ వంటివి తొలగించబడతాయి.

* ఒక పాత్రలో కమలాఫలం రసం తీసుకుని అందులో కొద్దిగా ఆలివ్ నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసుకుని కాసేపు అలాగే వుంచుకోవాలి. అనంతరం గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా.. పొడిబారిన చర్మం తాజాగా మారుతుంది. సౌందర్యం కూడా మెరుగవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : eternal youth remedies  skincare beauty tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more