experts suggesting to use beauty home remedies to get shiny skin within few days without any side effects | skin home remedies

Beauty home remedies to get shiny skin within few days without any side effects

shiny skin remedies, shiny skin tips, shiny skin home tips, shiny skin beauty tips, beauty tips for skin, skincare remedies, skincare tips, skin side effects, facials

beauty home remedies to get shiny skin within few days without any side effects : experts suggesting to use beauty home remedies to get shiny skin within few days without any side effects.

చర్మాన్ని కాంతివంతంగా మార్చే బ్యూటీ టిప్స్

Posted: 11/03/2015 03:00 PM IST
Beauty home remedies to get shiny skin within few days without any side effects

కాంతివంతమైన చర్మం పొందడం కోసం మహిళలు రకరకాల బ్యూటీ ప్రోడక్ట్స్ తోపాటు మరిన్ని విధానాలను అనుసరిస్తుంటారు. వేలరూపాయల ఖర్చు పెట్టి బ్యూటీపార్లర్లకు వెళుతుంటారు. అయితే.. అలా చేయాల్సిన అవసరం లేదని బ్యూటీషియన్స్ అంటున్నారు. చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు.

* అందంగా ఉండాలంటే పోషకాహారం తీసుకోవాలని న్యూట్రీషన్లు అంటున్నారు. ఇంకా అనారోగ్య సమస్యలుంటే కూడా అందాన్ని కోల్పోతారు. మన శరీరంలో వాతం, పిత్తం, కఫం అనే మూడు దోషాలుంటాయి. ఈ మూడు సమానంగా ఉంటేనే ఆరోగ్య సమస్యలు ఉండవు. ఇంకా అందంగా కనిపిస్తారు. అందుచేత పోషకాహార లోపంతోనూ అంద విహీనంగా ఉంటారని.. న్యూట్రీషన్లు అంటున్నారు.

* ఒక పాత్రలో బొప్పాయి గుజ్జు ఒక టేబుల్ స్పూన్, తేనె ఒక స్పూన్, నిమ్మరసం రెండు స్పూన్లు తదితరాలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పేస్టులా తయారు చేసుకున్న అనంతరం దాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాలపాటు అలాగే వుంచుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే.. చర్మం కాంతివంతం అవుతుంది. చర్మం పొడిబారకుండా ఉంటుంది.

* ఒక పాత్రలో కొత్తిమీర, పుదీనా ఆకులను సముపాళ్లలో తీసుకోవాలి. అలా తీసుకున్న ఆకులను బాగా దంచి, పేస్టులా తయారుచేసుకోవాలి. ఆ పేస్టులో కొద్దిగా నిమ్మరసం మళ్లీ బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే.. 30 నిముషాలపాటు అలాగే వుంచుకోవాలి. అనంతరం కడిగేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల ముఖంపై వుండే జిడ్డు తొలగిపోతుంది.

* ఒక గాజు పాత్ర తీసుకుని అందులో బాదం, ఓట్స్ తదితరాలను సరిపాళ్ళలో తీసుకోవాలి. ఆ రెండింటిని బాగా కలియబెట్టి పేస్టులా తయారుచేసుకోవాలి. ఈ పేస్టును ముఖానికి పట్టించి.. అర్ధగంటసేపు అలాగే వుంచుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే.. ముఖం కాంతివంతంగా తయారవుతుంది. సెన్సెటివ్ చర్మం కలిగినవారు దీనిని ఉపయోగించకూడదు.

* పాల మీగడ లేదా పెరుగుతో తేనె కలిపి కంటికి మర్దన చేసుకుంటే.. కంటి కిందటి వలయాలకు చెక్ పెడతాయి. జుట్టు నెరసిన వారు అప్పుడప్పుడు ఆయిల్ మసాజ్ తీసుకుంటూ వుండాలి. బాదం ఆయిల్ ఉపయోగించడం మంచిది. డ్రై హెయిర్ కలిగిన వారు హెన్నాతో పాటు ఆమ్లా, మందార ఆకుల్నికలిపిన హెన్నా రాసుకోవడం ఉత్తమం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shiny skin home remedies  best facials for glow skin  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more