అందంగా వుండటం ప్రతిఒక్కరు ఇష్టపడతారు. ఆ అందమే నలుగురిలో మన గౌరవాన్ని నిలబెడుతుంది. అందరిని తమవైపు ఆకర్షితులు చేయడానికి దోహదపడుతుంది.
ప్రస్తుతకాలంలో ప్రతిఒక్కరికి అందానికి సంబంధించి అనేక మార్పులు వస్తూ వుంటాయి. వాతావరణ పరిస్థితులవల్లగాని, మనం తీసుకునే ఆహార పదార్థాలలో పోషకాల లోటు వుండటం వల్ల అందం తగ్గిపోతుంది. ముఖంపై ముడతలు రావడం, చర్మం వదులుగా వుండటం జరుగుతుంది. ఇటువంటి సమస్యలు ప్రతిఒక్కరిలోనూ వుంటాయి.
అయితే టీనేజ్ లో వున్నవారికంటే 30 సంవత్సరాలు పైబడిన వారిలో ఇటువంటి సమస్యలు అధికంగానే వుంటాయి. వారు తమ అందాన్ని కాపాడుకోవడానికి ఎక్కువ డబ్బులను వెచ్చించి క్రీములను ఖరీదు చేయడం లేదా బ్యూటీపార్లర్లకు వెళ్తుంటారు.
30 సంవత్సరాలు పైబడినవారు అందంగా కనిపించడానికి చిట్కాలు :
1. చర్మసంరక్షణ... అందం విషయంలో ముఖ్యమైంది చర్మం. ఇది మన ఆరోగ్యంతోపాటు, మన వయస్సును కూడా తెలుపుతుంది. నిత్యం చర్మానికి మాయిశ్చరైజింగ్ చేస్తూ.. శుభ్రం చేసుకుంటూ ఎంతో అందంగా, యవ్వనంగా కనిపించేందుకు ఆస్కారం వుంటుంది.
2. ఫ్రూట్ డైట్... సాధారణంగా మనం తీసుకునే ఆహార పదార్థాలలో పోషకాలు, రసాయనాలు, విటమిన్లు సరియైన పరిమాణంలో వుంటే నిత్యం ఆరోగ్యంగా, అందంగా, యవ్వనంగా కనిపించవచ్చు. శాస్త్రీయపరంగా ఇది నిరూపితమైంది కూడా. కాబట్టి మాంసాహారపదార్థాలను ఎక్కువగా సేవించకుండా... తాజాగా వున్న పండ్లను తీసుకుంటేనే చాలా మంచిది. ఇందులో వుండే పోషక పదార్థాలు మన శరీరంలో వుండే కణాలను ఉత్తేజపరుస్తాయి. అదేవిధంగా చర్మం కూడా ముడతలు పడకుండా నిత్యం యవ్వనంగా, ప్రకాశవంతంగా కనిపించడానికి సహాయపడుతాయి.
3. యాంటీ ఆక్సిడెంట్ పదార్థాలు... టొమాటో క్యాష్, క్యారెట్ వంటి పదార్థాలను యాంటీ ఆక్సిడెంట్ గా పేర్కొంటారు. ఎందుకంటే.. ఇందులో వుండే విటమిన్ సీ, ఈ, బీటాకెరోటీన్ అధిక స్థాయిలో వుండి చర్మం ముడతలు పడకుండా చూస్తుంది.
4. వ్యాయామం... క్రమం తప్పకుండా నిత్యం వ్యాయామం చేయడం వల్ల ఉత్సాహంగా, ఆరోగ్యవంతంగా వుండొచ్చు. వ్యాయామంతో శరీరంల వుండే ఎముకలు ఆరోగ్యంతోపాటు బలంగా వుంటాయి. అలాగే కండరాలు కూడా పటుత్వంగా వుంటాయి. ఫలితంగా శరీరంలో వుండే కణాలు కూడా నిత్యం ఉత్తేజితం అవడంతో యవ్వనంగా కనిపిస్తారు.
5. జుట్టు సంరక్షణ... వయసు పైబడేకొద్దీ జుట్టు తెల్లబడటం లేదా రాలిపోవడం జరుగుతుంది. అటువంటి సమయాల్లో జుట్టును వారానికొకసారి మసాజ్ చేసుకుంటే చాలా మంచిది. అలాగే కండిషనర్ అప్లై చేసుకోవడం తప్పనిసరి.
6. నీళ్లు... నీరు ఒక నేచురల్ పదార్థం. నీటిని నిత్యం తీసుకోవడం ద్వారా శరీరంలో వుండే మలినాలను శుభ్రం చేస్తుంది. శరీరాన్ని ఎల్లప్పుడూ తేమగా వుంచడంలో ఇదే ప్రధానపాత్ర వహిస్తుంది. కాబట్టి నిత్యం నీళ్లు తీసుకోవడం ద్వారా మీరు యవ్వనాన్ని తిరిగి పొందవచ్చు.
మరికొన్ని జాగ్రత్తలు :
1. సాధారణంగా ప్రతిఒక్కరికి ఉదయాన్నే లేవగానే టీ లేదా కాఫీ తాగడం అలవాటు వుంటుంది. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదు. వీటికి బదులు ప్రతిరోజూ గ్రీన్ టీని తీసుకుంటే చాలా మంచిది.
2. పరిస్థితులకు అనుగుణంగా ఫ్యాషన్ టిప్స్ ని మెయింటేన్ చేస్తే చాలా మంచిది. ప్రస్తుతకాలంలో రకరకాలుగా ఫ్యాషన్ కు సంబంధించిన వస్తువులు, ట్రెండ్స్ చాలానే మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఇవి ఎంతో ఆకర్షణీయంగా వుంటాయి. 30 ఏళ్లు పైబడిన వారు ఇటువంటి ఫ్యాషన్ టిప్స్ ని పాటిస్తే.. యవ్వనంగా కనిపిస్తారు.
3. మీకు స్కోకింగ్ చేయడం, టుబాకో సేవించడం వంటి అలవాట్లు వుంటే.. వెంటనే వాటిని మానుకోవడానికి ప్రయత్నించండి. అవి శరీరానికి ఎంతో హాని కలిగిస్తాయి. శరీరంలో వున్న కణాలను బలహీనం చేసి, చర్మ సౌందర్యాన్ని తగ్గించేందుకు దోహదం చేస్తాయి.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more