The Historical Story Of Kotappakonda Trikoteswara Temple | Lord Shiva Temples | Mythological Stories

Kotappakonda trikoteswara temple historical story lord shiva mythological stories

Kotappakonda temples, Kotappakonda temple history, Trikoteswara Temple history, lord shiva temples, lord shiva mythological stories

Kotappakonda Trikoteswara Temple Historical Story Lord Shiva Mythological Stories : The Historical Story Of Kotappakonda Trikoteswara Temple Which Is Belongs To Lord Shiva

త్రికోటేశ్వరస్వామి ఆలయం విశేషాలు

Posted: 08/22/2015 04:35 PM IST
Kotappakonda trikoteswara temple historical story lord shiva mythological stories

‘త్రికోటేశ్వరస్వామి దేవాలయం’.. గుంటూరుజిల్లా నరసరావుపేట కోటప్పకొండలో వుండే ఈ దేవాలయంలో స్వామి యల్లమంద కోటయ్యగా ప్రజల పూజలందుకుంటాడు. ఈ ఆలయం ఎల్లప్పుడూ నిర్జనంగా వుంటుంది కానీ.. మహాశివరాత్రి సమయంలో మాత్రం భక్తజనంతో నిండిపోతుంది.

స్థలపురాణం

పూర్వం.. యెల్లమండ గ్రామానికి చెందిన సాలంకయ్య అనే శివభక్తుడు జీవనభృతి కోసం కట్టెలు కొట్టి జీవిస్తూ ఉండేవాడు. ఇతడు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ జీవితం కొనసాగిస్తాడు. కానీ.. శివభక్తి ఫలితంగా సాలంకయ్యా ఒకానొక దశలో ధనవంతుడు అవుతాడు. ఎంత ధనవంతుడు అయినప్పటికీ విలాస జీవితాన్ని కాకుండా సాధారణంగా జీవితం కొనసాగిస్తూ.. శివుడిని పూజిస్తూ వుండేవాడు. ఒకరోజు సాలంకయ్య పూజచేస్తున్న తరుణంలో ఒక జంగమదేవరను చూసాడు. సాలంకయ్య భక్తికి మెచ్చి జంగమదేవర ప్రతిరోజు అతడి ఇంటికి వచ్చి పాలను త్రాగివెళ్ళేవాడు. కొన్ని రోజుల తరువాత జంగమదేవర కనిపించలేదు. సాలంకయ్య అతడి కోసం ఎంతగా గాలించినప్పటికీ జంగమదేవరను చూడలేక పోయాడు. దీంతో తీవ్ర నిరాశ చెందిన సాలంకయ్య.. నిద్రహారాలు మానేశాడు.

సాలంకయ్యా నివసిస్తున్న ప్రదేశానికి కొంత దూరంలో సుందుడు, అతడి భార్య కుంద్రి నివసిస్తూ ఉండేవారు. వారికి ఆనందవల్లి అనే కూతురు ఉండేది. ఆనందవల్లి పుట్టిన తరువాత వారు ధనవంతులు అయ్యారు. గాఢమైన దైవభక్తి సంపన్నురాలైన ఆనందవల్లికి సాధారణ ప్రపంచ జీవితం మీద విరక్తి కలిగి... ఆమె సదాశివుని భక్తిగితాలు ఆలపించేది. అలా కొంచంకొంచంగా ఏకాంతవాసానికి అలవాటుపడి తపోజీవనం ఆరంభించింది. ఆమె భక్తికి మెచ్చి జంగమదేవర ఆమె ముందు ప్రత్యక్షం అయ్యాడు. తరువాత ఆనందవల్లి రోజూ రుద్రాచలానికి వచ్చి శివునికి ఆభిషేకాదులు నిర్వహించి పాలు కానుకగా సమర్పించేది. ఈ విషయాన్ని సాలంకయ్యా తెలుసుకుంటాడు. అతడె ఆనందవల్లిని కలుసుకుని జంగమదేవర దర్శనం, ఆశీర్వాదం ఇప్పించనని కోరాడు. ఆమె అతని కోరికను మన్నించక తపసును కొనసాగించింది.

కొన్నిరోజుల తరువాత ఆనందవల్లి వేసవి కాలంలో కూడా శివుని ఆరాధించడానికి రుద్రాచలానికి వెళ్ళసాగింది. ఒకరోజు ఆమె అభిషేకం కోసం బిందె నిండా నీళ్లు తీసుకుపోతూ.. మార్గమద్యంలో దానిని ఒక రాతిమీద పెట్టి, మారేడుదళాలతో దానిని మూసి ఉంచింది. అప్పుడు ఓ కాకి నీళ్లు తాగడం కోసం ఆ బిందె మీద వాలింది. కాకి బరువుకు బిందె పక్కకు ఒరిగి బిందెలోని జలం మొత్తం కిందికి పడిపోతుంది. దీంతో ఆగ్రహించిన ఆనందవల్లి ఈ ప్రాంతానికి కాకులు రాకూడదని శపించింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ప్రాంతంలోకాకులు కనిపించడం లేదని ప్రాంతీయ వాసుకు విశ్వసిస్తున్నారు. తరువాత ఆనందవల్లి తపసుకు మెచ్చి జంగదేవర ప్రత్యక్షమై ఆమెకు జ్ఞానం ప్రసాదించాడు. తరువాత ఆనందవల్లి ఏకాగ్రతతో శివునిగురించి తపసు కొనసాగించింది. ఆనందవల్లి తపసుకు మెచ్చిన జంగమదేవర.. ఆమెకు ప్రత్యక్షమై ఆమెను తిరిగి కుటుంబ జీవితం కొనసాగించమని చెప్పి బ్రహ్మచారిణి అయిన ఆమెను గర్భవతిగా మార్చాడు.

అయితే.. ఆనందవల్లి మాత్రం తన గర్భాన్ని లక్ష్యపెట్టక శివారాధన కొనసాగిస్తూ వచ్చింది. జంగమదేవర తిరిగి ఆనందవల్లికి ప్రత్యక్షమై ఇక ఆమె శ్రమపడి రుద్రాచలం రావలసిన అవసరం లేదని తాను ఆమెను వెన్నంటి వచ్చి ఆమె పూజలు స్వీకరిస్తానని చెప్పి ఆమెను తిరిగి చూడకుండా నివాసానికి వెళ్ళమని ఆదేశిస్తాడు. ఒకవేళ తిరిగి చూస్తే తాను అక్కడే నిలిచిపోతానని చెప్పాడు. ఆనందవల్లి రుద్రాచలం నుండి కిందకు దిగుతూ కుతూహలం కారణంగా బ్రహ్మాచలం వద్ద తిరిగి చూసింది. దాంతో పరమశివుడు వెంటనే  అక్కడే నిలిచి పక్కన ఉన్న గుహలో లింగరూపం ధరించాడు. ఆ పవిత్ర ప్రదేశమే ప్రస్థుతం కొత్తకోటేశ్వరాలయంగా పిలువబడుతూ ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Trikoteswara Temple  Kotappakonda temple  Lord Shiva Mythological stories  

Other Articles