The History Of Sree Veeranjaneya Swamy Temple In Gandi Kshetram | Ramayan | Ravan Vadha

Gandi kshetram history veeranjaneya swamy temple mythological story

Gandi Kshetram, Gandi Kshetram history, Gandi Kshetram mythological story, veeranjaneya swamy temple, anjaneya swamy temples, anjaneya temples, gandi kshetram temple history

Gandi Kshetram History Veeranjaneya Swamy Temple Mythological Story : The History Of Sree Veeranjaneya Swamy Temple In Gandi Kshetram. This Is An Ancient Andhra Place Which Is Now Developing Very Fast.

వీరాంజనేయ స్వామి కొలువైవున్న ‘గండిక్షేత్రం’ విశేషాలు

Posted: 07/28/2015 04:13 PM IST
Gandi kshetram history veeranjaneya swamy temple mythological story

దేశంలో శ్రీ వీరాంజనేయస్వామి కొలువై వున్న పుణ్యక్షేత్రాల్లో గండిక్షేత్రం ఒకటి. కడప జిల్లాలోని రాయచోటి-వేంపల్లి మార్గమధ్యంలో వున్న పాపఘ్ని నదీతీరంలో ఈ క్షేత్రం వెలిసింది. పాపఘ్ని నది ఇక్కడి శేషాచలం కొండను చీలుస్తుంది కాబట్టి.. ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. ఈ క్షేత్రంలో శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందింది. పూర్వం.. సీత జాడను కనుగొనడంతోపాటు రావణాసురినిపై విజయానికి కారణమైన ఆంజనేయుని విగ్రహాన్ని రాముడు తన బాణపు కొసతో కొండశిల మీద చిత్రీకరించాడు. ఆ చిత్రరూపమే విరాంజనేయుని విగ్రహంగా విరాజిల్లుతోంది.

స్థలపురాణం :

త్రేతాయుగంలో శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో సీతాదేవిని రావణుడు అపహరిస్తాడు. అప్పుడు రామలక్ష్మణులు సీతాన్వేషణలో దండకారణ్యం నుండి గండిక్షేత్రం మీదుగా రావడం జరిగింది. అప్పటికే వాయుక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన గండిక్షేత్రంలో.. వాయుదేవుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడట. అక్కడికి విచ్చే రామలక్ష్మణులను ఈ వాయుదేవుడు చూసి.. వారికి ఆహ్వానం పలికాడు. తన ఆతిథ్యం స్వీకరించమని వారిని వేడుకున్నాడు. అయితే.. రావణవధ అనంతరం తిరుగుప్రయాణంలో నీ కోరిక తీరుస్తానని వాయుదేవుడికి శ్రీరాముడు వాగ్దానం చేసి.. అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

ఇక రావణుని చంపిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వస్తున్న సమయంలో.. ఆంజనేయుని తండ్రి వాయుదేవుడు గండిలోని రెండుకొండలకు బంగారు తోరణం నిర్మించి శ్రీరామునికి ఘనస్వాగతం పలికాడు. వాయుదేవునికి ఇచ్చిన మాట ప్రకారం.. శ్రీరాముడు ఆ రాత్రికి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. అక్కడి ప్రకృతి సౌందర్యానికి ముగ్ధుడైన శ్రీరాముడు... సీతాన్వేషణం మొదలుగా రావణాసురునిపై తన విజయానికి మూలకారణమైన వీరాంజనేయుని విగ్రహాన్ని అక్కడున్న కొండశిల మీద తన బాణపు కొసతో చిత్రించాడు. ఆ చిత్రం చివరిదశలో వుండగా.. అప్పుడే లక్ష్మణుడు అక్కడికి చేరుకుని, కాలహరణం సంగతి గుర్తుచేస్తాడు. ఆ తొందరలో శ్రీరాముడు ఆంజనేయుని చిత్రం ఎడమచేతి చిటికెనవ్రేలు విడదీయకుండా వెళ్ళిపోయాడు. ఆ చిత్రరూపమే శ్రీ వీరాంజనేయుని విగ్రముగా ప్రస్తుతం విరాజిల్లుతోంది.

మరిన్ని విశేషాలు :

* ‘త్రేతాయుగం’ తర్వాత వసంతాచార్యులు అనే భక్తుడు గండిక్షేత్రంలో ఓ చిన్నగుడి నిర్మించి.. ఆ రేఖాచిత్రానికి పూజలు చేయడం ప్రారంభించాడు. మరికొంతకాలానికి వ్యాసరాయలనే శిల్పాచార్యుడు.. ఆ రేఖా చిత్రాన్ని విగ్రహంగా మార్చాలని నిశ్చయించుకుని తన దగ్గరున్న ఉలితో చెక్కుతుండగా.. వీరాంజనేయస్వామివారి ఎడామచేతి చిటికెనవ్రేలు విడదీసే సందర్భంలో రక్తం ధారలుగా స్రవించిందట. అది గమనించిన శిల్పాచార్యుడు.. తన ప్రయత్నాన్ని విరమించుకుని.. పునఃప్రతిష్ట చేయడం జరిగింది.

* 2007 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు గండిక్షేత్రాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేశారు. వీరాంజనేయ స్వామివారి ఆలయానికి ప్రహారీ నిర్మించి, ఉత్తరంవైపు గాలిగోపురం, కల్యాణ మండపం, అన్నదాన సత్రం మొదలైన భవనాలు నిర్మించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gandi Kshetram  Sri Veeranjaneya Swamy Temple  Temples In India  

Other Articles