Thiruvidandai nithya kalyana perumal temple history

Thiruvidandai temple history, Thiruvidandai temple story, Thiruvidandai temple photos, Thiruvidandai temple biography, Thiruvidandai temple wikipedia, nithya kalyana perumal temple story, nithya kalyana perumal temple history, lord vishnu temples

Thiruvidandai nithya kalyana perumal temple history : The Historical story of thiruvidandai means nithya kalyan perumal temple. According to the mythological stories vishnu got married with 360 women.

‘నిత్య కల్యాణ పెరుమాళ్’ దేవాలయానికి ఆ పేరెలా వచ్చింది?

Posted: 03/16/2015 05:47 PM IST
Thiruvidandai nithya kalyana perumal temple history

నిత్య కల్యాణ పెరుమాళ్ దేవాలయం (తిరువిడందై).. భారతదేశంలో వున్న 108 వైష్ణవ క్షేత్రాలలో 62వ వరాహ క్షేత్రం ఇది! ఇది చెన్నపట్నంలోని తిరువాన్మియూరుకి దక్షిణంగా 19 కి. మి. దూరంలో, చెన్నపట్నం నుండి పుదుచ్చేరి వెళ్ళు తూర్పు తీర మార్గంపై కోవళం బస్సు స్టేషను నుండి 3 కి. మి దూరములో కలదు. ఈ ఆలయానికి ‘నిత్యకల్యాణ్ పెరుమాళ్’ అని పేరు ఎలా ఏర్పడిందన్న విషయంపై ఓ పురాణగాధ అమలులో వుంది. అదేమిటంటే..

స్థలపురాణం :

పూర్వం గవళ మహర్షికి 360 మంది కుమార్తెలు వుండేవారు. ఒకేసారి అంతమంది కుమార్తెలు ఆయన పుట్టడంతో.. వారి వివాహము ఎలా చేయాలోనన్న ఆందోళనలో మునిగిపోయారు. అయితే.. ఎలాగోలా వారి వివాహం చేయాలని ఆయన నిశ్చయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఆ మహర్షి  వారి వివాహం నిశ్చయించడం కోసం విష్ణుమూర్తిని వేడుకున్నాడు. అప్పుడు విష్ణువు ఆ మహర్షి ముందు ప్రత్యక్షమై.. ఏమీ చింతించవద్దని భరోసా ఇస్తారు. తానే ఆ 360 మంది కన్యలను వివాహం చేసుకుంటానని శ్రీ మహావిష్ణువు ఆ మహర్షికి వరం ప్రసాదిస్తాడు. దీంతో అతడు సంతోషించి అందుకు వెంటనే సరేనని అంటాడు.

అప్పుడు విష్ణువు ఆ కన్యలను రోజుకొకరిని చొప్పున సంవత్సరకాలం వరకు వారిని వివాహం చేసుకుంటాడు. అలా ఏడాదిపాటు 360 కన్యలను విష్ణువు వివాహం చేసుకున్నాడు కాబట్టే.. ఆయనకు ‘నిత్య కల్యాణ పెరమాళ్’ అను పేరు వచ్చెను. ఆ 360 మంది కన్యలను వివాహం చేసుకున్న తర్వాత విష్ణువు వారందరిని ఒక్కరిగా మార్చేస్తాడు. అలా మార్చడం వల్లే అమ్మవారికి ‘అఖిలవల్లి’ అను పేరు వచ్చింది. ఆ అమ్మవారిని శ్రీ విష్ణువు తన ఎడమ తొడపై కూర్చోబెట్టుకున్నాడు కాబట్టి.. ఆ ప్రదేశానికి ‘తిరువిడందై’ అను పేరు వచ్చింది.

ఆలయ విశేషాలు

1. 108 వైష్ణవ క్షేత్రాలలో 62వ వరాహ క్షేత్రమైన ఈ దేవాలయంలో.. వివాహం చేసుకునేవాళ్లు ఇక్కడున్న స్వామి వారిని కొలిస్తే.. వారికి వెంటనే పెళ్లి కుదురుతుందని భక్తులు నమ్ముతారు.

1. ఈ దేవాలయం పల్లవ రాజుల ద్వారా నిర్మించబడింది. సముద్ర తీరానికి అతి చేరువలో వున్న ఈ ఆలయానికి ముందు భాగంలో ఓ పెద్ద పుష్కరిణి వుంది. దాని పేరు కల్యాణ తీర్థము. ఇక్కడ మూలవిరాట్టు శ్రీ నిత్యకల్యాణ పెరుమాళ్, అఖిలవల్లి అమ్మవారు.

3. గర్భగుడికి కుడిప్రక్కన కోమళవల్లి అమ్మవారి సన్నిధి, ఎడమప్రక్కన ఆండాళ్ళమ్మవారి సన్నిధి కలదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles