Yadagirigutta lakshmi narasimha swamy temple history

yadagirigutta temple, lakshmi narasimha swamy temple, yadagirigutta temple history, lakshmi narasimha swamy temple history, lord narasimha swamy temples, lakshmi narasimha swamy history, yadagirigutta temple festival

yadagirigutta lakshmi narasimha swamy temple history : The Historical story of yadagirigutta lakshmi narasimha swamy temple. There are many stories are available about this temple in mythological books.

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ విశేషాలు...

Posted: 02/25/2015 06:49 PM IST
Yadagirigutta lakshmi narasimha swamy temple history

తెలంగాణ రాష్ట్రంలో వెలిసిన పుణ్యక్షేత్రాల్లో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఒకటి! ఇది నల్లగొండ జిల్లాలోని యాదగిరిగుట్ట మండలానికి సమీపంలో ఎత్తైన గుట్టపై వుంది. ఈ యాదగిరిగుట్ట ఆలయం ఆవిర్భావం వెనుక వాల్మీకి రామాయణంలో వుంది. అలాగే.. ఇంకా ఎన్నోరకాల కథనాలు పురాణాల్లో ప్రచురించబడి వున్నాయి.

స్థలపురాణం :

యాదమహర్షి కథ : స్వామి హరికి పరమభక్తుడైన యాదమహర్షి.. చిన్నతనం నుంచే ఆయన్ను ఎంతో ఆరాధ్యంగా పూజించేవాడు. ఈయన స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని వుందన్న కోరికను వెల్లడించగా.. ఆంజనేయస్వామి ఓ సలహా ఇచ్చారు. ఆ సలహామేరకు యాదమహిర్షి ‘యాదగిరి’గా పిలవబడుతున్న ప్రదేశంలో చాలాకాలం తపస్సు చేశాడు. ఒకానొక సమయంలో ఆహార అన్వేషణలో వున్న ఓ రాక్షసుడు.. అటుగా వచ్చి తపస్సు చేస్తున్న రుషిని చూసి అతనిని తినబోయాడు. అయితే తపస్సులో వున్న రుషి ఆ రాక్షసుడిని చూడలేకపోయాడు కానీ.. అతను ఎవరిగురించైతే తపస్సు చేస్తున్నాడో ఆ హరికి తెలిసింది. అప్పుడు వెంటనే ఆయన తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుడ్ని సంహరించాడు.

ఈ విషయం తెలుసుకున్న రుషి.. ఆ సుదర్శన చక్రాన్ని పలు విధాల ప్రార్ధించి, భక్తులకు ఏవిధమైన బాధలూ కలుగకుండా దుష్టసంహారం చేస్తూ అక్కడే వుండిపొమ్మని కోరాడు. దాంతో ఆ చక్రం అక్కడ వెలయబోవుచున్న లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ శిఖరాన షట్కోణాకారాన వెలసింది. అనంతరం యాదమహర్షి తన తపస్సుని కొనసాగించాడు. అతని తపస్సుకి మెచ్చి నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు. ‘ఏం కావాలో కోరుకో’మని స్వామి అడగగా..  కొండమీద వుండిపోమ్మని యాదమహర్షి కోరాడు. దాంతో లక్ష్మీ నరసింహస్వామి అక్కడే వెలిశాడు. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా అతని పేరుమీద ప్రసిధ్ధికెక్కింది.

హాదర్షి కథ : ఈయన నరసింహస్వామికి పరమభక్తుడు. అతనికి ఓసారి స్వామివారిని చూడాలని కోరిక పుట్టింది. ఈ విషయాన్ని ఆంజనేయస్వామికి తెలియజేయగా.. ఆయన సలహామేరకు హాదర్షి తపస్సు చేయడం కొనసాగించాడు. అతని తపస్సుకు మెచ్చిన స్వామి ప్రత్యక్షమవుతాడు. అయితే.. ఆ ఉగ్ర నరసింహ మూర్తిని చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని హాదర్షి కోరాడు. ఆయన కోరిక మేరకు స్వామి కరుణించి లక్ష్మి సమేతుడై దర్శనమిచ్చారు. అప్పుడు తనకు ‘ఏం కావాలో కోరుకో’మని స్వామి అడగగా.. శాంత మూర్తి రూపంలో కొలువై కొండపై ఉండమని కోరాడు. ఆ విధంగా స్వామి కొండపై అలా కొలువై ఉండిపోయాడు.

ఇలా కొన్నాళ్లు గడిచిన అనంతరం స్వామివారిని వేర్వేరు రూపాల్లో చూడాలనిపించి హాదర్షి మళ్లీ తపస్సు చేయడం కొనసాగించాడు. అప్పుడు స్వామి అతని తపస్సుకు మెచ్చి మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలని కోరుకోమని అడగ్గా.. వివిధ రూపాల్లో దర్శనమివ్వాల్సిందిగా హాదర్షి కోరాడు. అతని కోరిక మేరకు స్వామి వారు జ్వాలా, యోగా, నంద, గండబేరుండ, నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచ నారసింహ క్షేత్రం అంటారు.

ఇలా ఈ విధంగా ఇద్దరు రుషులు మీద ఈ ఆలయానికి సంబంధించి స్థలపురాణాలు పురాణాలలో ప్రచురించబడి వున్నాయి. ఈ కోవలోనే మరెన్నో కథనాలు కూడా అందుబాటులో వున్నాయి. ఈ ఆలయంలో ప్రతిఏటా స్వామివారు కళ్యాణోత్సవ వేడకలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ వేడుకలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఎన్నో లక్షలమంది తరలివస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(4 votes)
Tags : yadagirigutta temple history  lakshmi narasimha swamy temple story  

Other Articles