Komaravelli sri mallikharjuna swamy temlpe komaravelli temple special story

komaravelli temple, how to reach komaravelli, where is komaravelli temple, warangal district temples, telangana main temples, doddi komaraiah bhavan, kcr visited komaravelli, komaravelli incident, komaravelli temple corruption

komaravelli temple special story, komaravelli mallikharjuna swamy temple in warangal district

ఆలయ విశేషాలు

Posted: 12/26/2014 05:11 PM IST
Komaravelli sri mallikharjuna swamy temlpe komaravelli temple special story

కొమురవెల్లి మల్లన్న స్వామిని బన్ద సొరికల వెలసిన దేవునిగా కీర్తిస్తారు. సుతిమాను గుండం మీద త్రిశూలం ఉంటుంది. దాని ప్రక్కనే రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఉంటుంది. ఈ దేవుని కురుమలు, గొల్లలు, కాపువారు ఎక్కువగా పూజిస్తారు. గుడి ఎదురుగా గంగరేగి వృక్షము కలదు. గుట్టల్లో శ్రీ మల్లన్న స్వామి కొలువుతీరటం ఈ ఆలయ ప్రత్యేకత...

కొమరవెల్లి వరంగల్ జిల్లా చేర్యాల మండలానికి చెందిన ఒక గ్రామము. ఇక్కడ జాతర జనవరి నెలలో మకర సంక్రాంతి రోజున ప్రారంభమై ఉగాది వరకు ప్రతి ఆది-బుధ వారాలలో జరుగుతుంది. సంక్రాంతి పండుగకు ముందు కళ్యాణోత్సవం జరుగుతుంది పండుగ తరువాత వచ్చే మొదటి ఆదివారం రోజున జంటనగరాల నుండి లక్షల సంఖ్యలో యాత్రికులు వచ్చి మొక్కుబడులు చెల్లిస్తారు. వీటిని లష్కర్ బోనాలు గా పిలుస్తారు. ఎక్కువగా యాదవ భక్తులు సందర్శించే ఈ జాతరలో బోనం, పట్నం అనే విశేషమైన మొక్కుబడులుంటాయి. బోనం అంటే, అలంకరించిన కొత్త కుండలో నైవేద్యం (అన్నం) వండి స్వామివారికి నివేదిస్తారు.

ఆ పక్కనే రంగు రంగుల ముగ్గులతో అలంకరించిన ప్రదేశం లో బోనాన్ని ఉంచి స్వామివారిని కీర్తిస్తూ ఆ నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఒక విధంగా ఇది స్వామి కళ్యాణమే. ఢమరుకం(జగ్గు) వాయిస్తూ, జానపద శైలిలో వారి సంప్రదాయబద్ధమైన పాటలు పాడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించే వారిని ఒగ్గు పూజారులుగా పిలుస్తారు. వీరు పసుపుపచ్చని అంగీలు ధరించి, చేతిలో ముగ్గుపలక, ఢమరుకం (జగ్గు) జాతర ప్రాంగణంలో కనువిందు చేస్తారు. జాతర చివరలో కామదహనం(హోళీ) పండుగకు ముందు పెద్ద పట్నం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
వందల సంఖ్యలో ఒగ్గు పూజారులు, విశాలమైన ముగ్గులను వేసి వాటి మధ్యన స్వామిని ఆవాహన చేసి సామూహికంగా జగ్గులు వాయిస్తూ దేవుణ్ణి కీర్తిస్తారు. వీర శైవ(బలిజ) పూజారులు, వీరభద్రుణ్ణి, భద్రకాళిని పూజించి, సంప్రదాయబద్ధమైన పూజలు జరిపి, రాత్రివేళ చతురస్రంగా ఏర్పరిచిన స్థలం లో టన్నులకొద్దీ కర్రలను పేర్చి, మంత్రబద్ధంగా అగ్ని ప్రతిష్ట చేస్తారు. తెల్లవారు జాములో ఆ కర్రలన్నీ చండ్రనిప్పులుగా మారుతాయి. వాటిని విశాలంగా పేర్పి, కణ కణ మండే నిప్పుల మధ్యనుండి మూడు సార్లు స్వామివారి ఉత్సవ విగ్రహాలతో దాటి వెళ్ళుతారు. వందల సంఖ్యలో భక్తులు కూడా దాటుతారు. దీనిని అగ్నిగుండాలు అని పిలుస్తారు.

ఈ మధ్య ఇది తెలంగాణా లో ప్రముఖమైన పుణ్య క్షేత్రంగా వెలుగొందుతుంది. కొమరా వెళ్లి మల్లన్న ను దర్శించుకొని అక్కడ గుండం చేస్తే సకల కోరికలు నేరవేరుస్తాదని భక్తుల విశ్వాసం.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : komaravelli temple  warangal district  special story  

Other Articles