Pambanda ramalingeswara temple history built by sri ram after killed ravan

pambanda temple, ramalingeswara temple, ramalingeswara temple history, pambanda ramaligeswara temple history, pambanda ramalingeswara temple wikipedia

pambanda ramalingeswara temple history built by sri ram after killed ravan

శ్రీరాముడు స్వయంగా లింగాన్ని స్థాపించి పూజించిన పుణ్యక్షేత్రం

Posted: 11/13/2014 03:33 PM IST
Pambanda ramalingeswara temple history built by sri ram after killed ravan

భారతదేశంలో వెలిసిన ఎన్నో దేవాలయాల్లో కొన్ని ప్రాచీన సంస్కృతీ-సంప్రదాయాలకు ప్రతీకగా వున్న విషయం తెలిసిందే! అయితే అందులో కొన్ని టెంపుల్స్ మాత్రం విశేష చరిత్రను కలిగి వుంటాయి. అటువంటి దేవాలయాల్లో పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఒకటి. తెలంగాణలోని రంగారెడ్డిజిల్లా కుల్కచర్ల సమీపంలో వున్న హిందూ దేవాలయాన్ని సాక్షాత్తూ శ్రీరాముడే లింగాన్ని ప్రతిష్టించి, పూజలు నిర్వహించాడు. అందుకే ఇక్కడ శివుడిని రామలింగేశ్వరుడని పిలుస్తారు.

ఆలయ విశేషాలు :

1. చరిత్ర : త్రేతాయుగంలో రావణ సంహారం అనంతరం తిరిగి వస్తున్న నేపథ్యంలో బ్రహ్మ హత్యాపాపం నుంచి విముక్తి కోసం కోటి లింగాలను స్థాపించాలని శ్రీరాముడికి మహర్షులు సూచిస్తారు. అందులో భాగంగానే ఆయన స్వయంగా లింగాన్ని స్థాపించి పూజలు నిర్వహించాడు. అలా ఆ విధంగా ఏర్పడిన ఈ దేవాలయం ప్రస్తుతం రామలింగేశ్వరుడిగా పిలవబడుతోంది. ఈ ఆలయానికి పక్కనే రామలక్ష్మణుల దేవాలయం కూడా వుంది.

2. పాంబండ దేవాలయం సుమారు కిలోమీటర్ విస్తీర్ణంలో వెలసిన ఏకశిల పాము ఆకారంలో మెలితిరిగి వుంటుంది. ఈ బండరాయి పాము ఆకారంలో వుండటం వల్లే దీనికి పాంబండ అనే పేరొచ్చింది. మొదట్లో ఇది పెద్ద ఏకశిలగానే వుండేది కానీ కాలక్రమంలో రెండుగా చీలిపోయింది. ఒక పెద్దపాము బండ మధ్యలో నుంచి వెళ్లడంతో అది చీలిపోయిందని అక్కడి భక్తులు చెబుతుంటారు.

3. ఈ పాంబండ వెనుకభాగంలో ఒక పుట్టులింగం వుంది. ఇది ప్రతీ సంవత్సరం కొద్దికొద్దిగా పెరుగుతుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయానికి పక్కనే భ్రమరాంబదేవీ ఆలయం, ముందుభాగంలో ఆంజనేయస్వామి విగ్రహం వుంటుంది.

గుండం విశిష్టత :

పాంబండపై ఉన్న గుండంలో నీటికి చాలా విశిష్ఠత ఉందని భక్తులు విశ్వశిస్తారు. అంతపెద్ద బండ మధ్యలో వెలసిన ఈ కోనేరులో ఎల్లప్పుడూ నీరుంటుంది. శ్రీరాముడు లింగాన్ని స్థాపించిన సమయంలో పూజ చేయడానికి పుణ్య జలాల కోసం శ్రీరాముడు బాణాన్ని సందించి బండ మధ్యలో కోనేరును సృష్టించాడనీ, ఆ నీటితోనే అభిషేకం చేశాడని భక్తులు పేర్కొంటారు. అందుకే ఈ గుండం ఎప్పుడూ ఎండిపోదు. ఈ గుండంలో స్నానం చేస్తే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని... పొలాల్లో, పశువులపై, ఇళ్లపై ఈ నీటిని చల్లితే ఎలాంటి అరిష్టాలైనా తొలగిపోతాయని ప్రజల నమ్మకం!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles