మన అందాల భారతదేశంలో ఎన్నోరకాల పర్యాటక ప్రదేశాలు వున్నాయి. ఎంతో అందంగా, ఆకర్షవంతంగా కనువిందు చేయడంతోపాటు లక్షలాది పర్యాటకులతో కనువిందు చేస్తుంటాయి. అందులో కొన్ని తమతమ ప్రాంతాలవారీగా నిర్వహించుకునే కొన్ని ఆటలకు, పండుగలకు, ఇతర కార్యక్రమాలకు ప్రసిద్ధి చెంది వుంటాయి. అటువంటి ప్రదేశాల్లో ‘‘ఔలి’’ ప్రదేశం స్కయింగ్ క్రీడకు ప్రసిద్ధి చెందింది.
ఎంతో అనూహ్యమైన సుందరదృశ్యాలను కలిగి వున్న ఈ అందమైన ప్రదేశం... సముద్ర మట్టానికి సుమారు 3వేల మీటర్ల ఎత్తులో వుంటుంది. ఏటవాలు ప్రాంతాల్లో ఓక్, ఇతర వృక్షాలు కల అటవీ ప్రదేశాలు పచ్చని వాతావరణంతో ఎంతో ఆకర్షణీయంగా వుంటాయి. ఈ ప్రదేశాన్ని స్ఠానిక భాషలో ‘‘బుగ్యాల్’’ అని అంటారు. అంటే పచ్చిక మైదాన ప్రాంతం అని అర్థం. ఎన్నో అద్భుత ఆకర్షన ప్రదేశాలను కలిగి వున్న ఈ ప్రాంతానికి 15 కి.మీ.దూరంలో శైలదార్ తపోవన్ అనే చిన్న గ్రామం వుంది. ఈ ప్రదేశంలో సహజ నీటి బుగ్గ, ఒక దేవాలయం వుంది. అలాగే మరో 3 కి.మీ.దూరంలో ఇంకొక వేడి నీటి బుగ్గ వుంది. ఈ రెండు ప్రదేశాలు చూడదగిన ప్రదేశాలు.
ఔలిలో చూడదగిన మరికొన్ని అందమైన ప్రదేశాలు :
1. కృత్రిమ సరస్సు :
ఇది సముద్ర మట్టానికి అధిక ఎత్తులో వుంటుంది. ప్రభుత్వం ఈ సరస్సును కృత్రిమ మంచు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. స్కయింగ్ క్రీడలను నిర్వహించే ప్రదేశాలలో మంచు తక్కువగా కురిసే సమయంలో దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. మంచుతో నిండిన ఏటవాలు ప్రదేశాల్లో పర్యాటకుడు నడిచేటప్పుడు నందా దేవి, మానస పర్వత, కామత్ పర్వత శ్రేణులు వంటి అద్భుతమైన ప్రదేశాలను సందర్శించుకోవచ్చు.
2. నంద ప్రయాగ్ :
ఇది కూడా ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం. ఇది అలకనంద, నందాకిని నదులు కలిసే ప్రదేశంలో వుంది. ఇది హిందువుల పవిత్రమైన ప్రదేశం కూడా! యాత్రికులు తమ పాపాలను తుడుచుకోవడం కోసం ఈ నదుల్లో పవిత్ర స్నానాలను చేస్తారు. పురాణాల ప్రకారం... ఈ ప్రాంతం కులవంశరాజుల రాజధాని. బదిరీనాథ్, కేదార్ నాథ్ వెళ్లే ప్రవేశ ద్వారంగా వుంటుంది.
3. త్రిశూల్ శిఖరం :
ఇది సముద్ర మట్టానికి సుమారు 23,490 అడుగుల ఎత్తులో వుంది. శివభగవానుడి కారణంగా ఈ శిఖరానికి త్రిశూల్ శిఖరం అనే పేరు వచ్చింది. ఈ ప్రదేశంలో కూడా స్కయింగ్ ప్రదేశాలు చాలా వున్నాయి. ఈ శిఖర కింద భాగంలో రూప్ కుండ్ సరస్సు ఎంతో అందంగా కనువిందు చేస్తుంది. ఇండి-టిబెట్ బోర్డర్ పోలీసులకు ఇది ఒక ట్రైనింగ్ గ్రౌండ్.
4. గుర్సో బుగ్యాల్ :
ఇది ఔలీలో తప్పకుండా చూడాల్సిన ప్రదేశం. ఇది సముద్ర మట్టానికి దాదాపు 3వేల కిలోమీటర్ల ఎత్తులో వుంటుంది. ఈ ప్రదేశం మొత్తం దట్టమైన వృక్షాలతో కప్పబడి వుంటుంది. ఈ ప్రదేశానికి చేరుకోవాలంటే జోషి మట్ నుంచి రోప్ వే మార్గంలో చేరాల్సి వుంటుంది. ఈ ప్రాంతం నుంచి ఒక కిలోమీటర్ దూరంలోనే చట్టార్ కుండ్ అనే మరో పర్యాటక ఆకర్షణ ప్రదేశం వుంది. ఇక్కడున్న సరస్సులో నీరు ఎంతో స్వచ్ఛంగా తాగడానికి తియ్యగా వుంటాయి.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more