Vastu shastra house plan

vastu shastra, vastu shastra house plan, vastu design for home, vastu shastra for house structure, vastu design,vastu design indian homes

vastu shastra house plan

వాస్తు ద్వారా పురోగతి సొంతమవుతుందా ?

Posted: 05/20/2013 04:46 PM IST
Vastu shastra house plan

వాస్తుని నమ్మడం మూర్ఖత్వం అంటారు కొందరు ... కాని వాస్తు , సంఖ్యా శాస్త్రం , జోతిష్య శాస్త్రం , పురాణాల్లోనే కాక , ఈ మధ్య సైంటిఫిక్ గా కూడా ఎన్నో కొత్త మార్పులు చేర్పులు చేసుకుంటున్నాయి . వీటిపై అధైయనం చెయ్యదలచిన వారికి , ఇవి ప్రత్యెక కోర్సులు గా అందిస్తున్న , కళాశాలలూ లేకపోలేదు . ఒకవేళ వాస్తుని సరిగా అర్ధం చేసుకుని , మీ చుట్టూ , ఇంటి ఆవరణలో తగినన్ని మార్పులు చేసుకుని , జీవితం లో పురోగతి పొందాలని మీరు అన్వేషిస్తూ ఉంటే , మీకు 'అన్వేషణ' కు ఉపయోగపడే కొన్ని వాస్తు సంబంధీత చిట్కాలు మీ కోసం ;

మీ ఇంటి ఆవరణలో మర్రి, చింతచెట్లు ఉన్నాయా.. అయితే వాటిని వెంటనే తొలగించాలని వాస్తు నిపుణులు అంటున్నారు. ముండ్ల చెట్లు, తుమ్మ, చింత, మర్రి, రాగి చెట్లు గృహావరణంలో పెంచకూడదని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహావృక్షాలైన ఈ చెట్లను ఇంటి ఆవరణలో పెంచడం వాస్తు రీత్యా మంచిది కాదని, అలాగే వాటి వేర్లు ఇంటి పునాదులను పెళ్ళగించే అవకాశం ఉందని వాస్తు నిపుణులు అంటున్నారు.

గృహములో అటకలను పశ్చిమ, నైరుతి, దక్షిణ గదులలో తూర్పు, ఉత్తర భాగములు వదిలి ఏర్పాటు చేసుకోవచ్చు. వీటికి కప్‌బోర్డ్స్‌ను కూడా బిగించుకోవచ్చు. ఒకవేళ నైరతి గదిలో తూర్పుకు అటకలు వేసుకోవాల్సి వస్తే ఈశాన్య భాగమును వదిలియాలి. తూర్పు లేదా ఉత్తరమందు అటకలు వేసుకున్నచో తప్పనిసరిగా పశ్చిమ, నైరుతి, దక్షిణములందు అటకలు ఉండి తీరాలి.

ఇంటెడు చాకిరి చేసి అలసిపోయిన గృహిణి, ఆఫీసు పనులతో డస్సిపోయి ఇంటికి వచ్చిన భర్త సాయంత్రం వేళ పడకపై అడ్డదిడ్డంగా పడుకుని అలానే నిద్ర లాగించేస్తారు. ఆ మాటకొస్తే పగటి పూట చాలామంది మహిళలు ఏ టీవీ చూస్తూనో.. లేదంటే ఏదో పత్రిక చదువుతూనో మంచంపై అడ్డదిడ్డంగా పడుకుని నిద్రపోతుంటారు. కానీ ఇలా నిద్రించేటపుడు దిక్కులు సరి చూసుకుని నిద్రించాలంటున్నారు వాస్తు శాస్త్రజ్ఞులు.ఇష్టం వచ్చిన దిక్కుల్లో తల పెట్టుకుని నిద్రిస్తే లేనిపోని ఫలితాలు చవిచూడాల్సి వస్తుందంటున్నారు. ఇంతకీ ఎటువైపు తల పెట్టుకుని పడుకోవాలి.. ఎలా పడుకుంటే ఏంటి నష్టం అని అంటారా..? అయితే ఇది చదవండి.

మీ భాగస్వామి మిమ్మల్ని బాధ పెడుతున్నారా ? ఈ బాధ అలాగే కొన్ని దినాల కొద్ది, నెలలకొద్ది సాగుతుంటే మీరు వాస్తు ప్రకారం కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఉత్తర భాగం, తూర్పు ఆగ్నేయ భాగం, దక్షిణ భాగం దోషాలు కలవేమో గమనించండి. ఈ దోషాలను సరి చేసుకుంటే మీ సమస్యలు పరిష్కారమైనట్లే. ఒకవేళ మీ ఇంటికి ఉత్తర వాయువ్యం, తూర్పు ఆగ్నేయం, దక్షిణ నైరుతి వీధిపోట్లు ఏమైనా ఉన్నాయేమో గమనించుకోండి.

దేవుళ్ళను పూజిస్తాం, ఇది మన సంప్రదాయం. దేవుళ్ళ మధ్య ఒక రాక్షసుడు ఉన్నాడు. అతడినీ జాగ్రత్తగా చూసుకుంటాం. అది వాస్తు సంప్రదాయం. అష్టదిక్కుల్లో ఏడుదిక్కులకు దేవతలు, మహనీయులు అధిపతులు. ఒక దిక్కుకు మాత్రం రాక్షసుడు అధిపతి. అతడి పేరు "నిర్ఋతి". దుష్టులకు దూరంగా ఉండాలని పెద్దలు చెబుతారు. వాస్తు శాస్త్రం ఇందుకు భిన్నంగా చెబుతుంది. దుష్టుడి దగ్గరే ఉండమని చెబుతుంది. నైరుతి యజమాని స్థానమని వాస్తు శాస్త్రవేత్తలు ఏకగ్రీవంగా చెబుతారు.

బాల్కనీలో గ్రిల్ డోర్ పెట్టుకోవడంలో తప్పులేదని వాస్తునిపుణులు చెబుతున్నారు. భద్రత కోసం అనేక రకాలైన గ్రిల్ గేట్స్‌ను ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి ఇంటికి రక్షణ కోసం మనం గ్రిల్ డోర్లను ఏర్పాటు చేసుకోవడంలో ఎలాంటి తప్పులేదు. సాధారణంగా కొంతమంది మెట్లు ఉన్నచోట ఇలాంటి గ్రిల్ ద్వారాలను పెట్టుకుంటుంటారు. వాటిని సింహద్వారాలుగా భావించరాదు. పోతే ఇనుముతో పెట్టుకునేటటువంటి ఈ గ్రిల్ ద్వారాలను, కొలాప్స్‌డ్ గేట్లను మనం ‘ద్వారాలు’గా భావించకూడదు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles