విజయం కోసం , అనుకున్న పనులు అవ్వడానికి , జీవితం లో ముందడుగు వెయ్యడానికి ఎవరు అన్వేషించరు చెప్పండి ... మీ అన్వేషణ విజయం కోసమే అయితే , మాడర్న్ వాస్తు , ఫెంగ్ షుయి ప్రకారం చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే సరి ... అవి ఎన్నో అయినా , కనీసం కొన్ని ముఖ్యమైనవి తెలుసుకుందాం ;
ప్రతి వ్యక్తికి తమ తమ రంగాల్లో నెంబర్వన్ అవ్వాలనే కోరిక ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫెంగ్షుయ్ సూత్రాలను కాస్త పాటించినట్లైతే మీరు మీ ఆఫీసుల్లో లేదా బిజినెస్లో నెంబర్వన్ స్థానాన్ని సంపాదిస్తారని ఫెంగ్ షుయ్ తెలుపుతోంది.
మీరు టాపర్గా ఉండాలనుకుంటే మీ ఆఫీసు డెస్క్ కుడిచేతివైపు డ్రాగన్ బొమ్మని ఉంచాలని ఫెంగ్ షుయ్ పేర్కొంటోంది. మీ ఆఫీసులో డెస్క్ కిటికీకి లేదా ప్రధమ ద్వారానికి ఎదురుగా ఉండాలి.
డ్రాగన్ బొమ్మ కిటికీ లేదా ప్రధమ ద్వారం వైపు చూస్తున్నట్లుగా ఉండినట్లైతే మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుందని ఫెంగ్షుయ్ చెబుతోంది. డ్రాగన్ బొమ్మ ఫౌంటెన్ వైపు చూస్తున్నా మంచిఫలితాన్నిస్తుందని ఫెంగ్ షుయ్ వెల్లడిస్తోంది. రకరకాల ఫోటోలను రకరకాల దిక్కుల్లో ఉంచడం వల్ల అనేక ప్రయోజనాలను పొందచ్చునని ఫెంగ్ షుయ్ తెలుపుతోంది. మీ గృహంలోని పడమర ప్రాంతం ఎప్పుడూ సృజనాత్మకత అంశానికి సంబంధించిందని, ఆ దిక్కు గోడపై పిల్లల ఫోటోలు ఉంచినట్లైతే వారి అదృష్టాన్ని, శక్తిని పెంపొందించినట్లవుతుందని ఫెంగ్షుయ్ వెల్లడిస్తోంది.
ఇంటి యజమాని ఫోటో ఎప్పుడూ రెడ్ఫ్రేమ్లో ఉంచి దక్షిణ దిక్కు వైపు ఉంచినట్లైయితే ఆ ఇంటి యజమాని పేరు ప్రతిష్టలు పెరుగుతాయని ఫెంగ్ షుయ్ పేర్కొంటోంది. నైరుతిదిశలో మీ ఆఫీస్ బాస్ లేదా మీకు సహయం చేసే వారి ఫోటోలు ఉంచినట్లైతే వారి సహాయ సహకారాలు మీకు ఎప్పుడూ అందుతునే ఉంటాయని ఫెంగ్షుయ్ తెలుపుతోంది.
దక్షిణ దిశలో ఎరుపురంగు ఫోటోలను ఉంచినట్లైతే మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయని, నీలం రంగు ఫోటోలను మాత్రం పొరపాటునకూడా ఉంచకూడదని ఫెంగ్ షుయ్ పేర్కొంటోంది. ఆగ్నేయదిశ.. ఎప్పుడూ సంపదకి ప్రతీక కాబట్టి పచ్చిక బయళ్ళతో ఉన్నచిత్రాలను ఉంచినట్లైతే సంపద పెరుగుతుందని ఫెంగ్ షుయ్ పేర్కొంటోంది.
సాధారణంగా ఇంట్లోనో, ఆఫీసులోనో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సభ్యులు హాజరవుతుంటారు. అలా మీటింగ్ ఏర్పాటు చేసేముందు ఏ వ్యక్తికి ఏ స్థానంలో సీటును ఏర్పాటుచేయాలో సూచిస్తే ఆ మీటింగ్ విజయవంతం అయ్యే అవకాశాలు ఉంటాయి. సాధారణంగా మీటింగ్లో గుండ్రని టేబుళ్ళను వినియోగించినట్లైతే మీటింగ్ ఫలితాలు మంచిదిగా ఉంటాయని ఫెంగ్షుయ్ తెలుపుతోంది.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more