The history of nalanda university

History of Nalanda University, Cambridge University, Oxford University, South Asia

The History of Nalanda University. A renowned institution that flourished for several centuries in South Asia..long before Oxford and Cambridge, Harvard and Yale.. Nalanda University was one of the world first great universities

The History of Nalanda University.png

Posted: 03/18/2013 02:42 PM IST
The history of nalanda university

nalanda

ప్రపంచంలోనే అత్యంత పురాతన విశ్వవిద్యాలయాల్లో నలంద విశ్వవిద్యాలయం ఒకటి. నాగరికత పురుడుపోసుకుంటున్న ప్రాచీన కాలంలోనే ఈ విశ్వ విద్యాల యంలో.. గణిత, విజ్ఞాన, వైద్య, తర్క శాస్ర్తాలు ఎనలేని ఆదరణ చూరగొన్నారుు. వివిధ దేశాల నుండి ఎందరో విద్యార్థులు 11వ శతాబ్దంలోనే ఇక్కడ విద్యనభ్యసించారు. నేడు ప్రపంచం లోనే పేరిన్నికగన్న.. ఆక్స్‌ఫర్డ్‌, ేకంబ్రిడ్గ్జ విశ్వవిద్యాలయాలకంటే ముందే భారతదేశంలో.. ‘నలంద’ విజ్ఞానఖనిగా నిలిచింది. క్రీస్తుశకం 427 నుండే నలంద బౌద్ధ విజ్ఞాన కేంద్రంగా వెలుగొందింది. బిహార్‌ రాష్ట్రంలో ఉన్న ఈ విశ్వవిద్యాలయ శిథిలాలు.. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన పర్యాటక కేంద్రంగా వెలుగొందుతోంది. నేటి ఆధునిక గణిత, వైద్యశాస్త్ర పరిశోధనాలయాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆనాడే.. నలంద విశ్వవిద్యాలయం శస్త్ర విద్యలో ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ కంటి పొరలు, గర్భకోశం నుంచి మృత పిండాన్ని తీయడం వంటి శస్త్ర చికిత్సలు చేసేవారంటే అతిశయోక్తి కాదు. మానవుల తోపాటు ఇక్కడ జంతువులకు కూడా పరిపూర్ణమైన వైద్య సౌకర్యం ఉండేది. ఇక్కడ పొరుగు దేశాలైన చైనా, టిబెట్‌, జావా, సమత్రా, కొరియా, గ్రీసు, ఇరాన్‌, అరేబియాల నుంచి విద్య నేర్చుకోవడానికి విద్యార్ధులు నలందకు వచ్చేవారు. 10 సంవత్సరాలకు పైగా ఉండి తర్క, వైద్య, ఖగోళ శాస్త్ర సంబంధమైన విషయాలు నేర్చుకునేవారు.

బిహార్‌ రాజధానికి పాట్నాకు ఆగ్నేయంగా 55 మైళ్ళ దూరంలో ఉన్న నలంద విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యంత ప్రాచీన విశ్వవిద్యాలయం. నలంద అంటే సంస్కృతంలో జ్ఞానాన్ని ఇచ్చేది అని అర్ధం. నలంద అనే సంస్కృత పదం ‘నలం ’ అనగా కమలం అని అర్ధం (కమలం జ్ఞానికి చిహ్నం). ‘ద’ అంటే ఇవ్వడం అనే రెండు పదాల కలయిక ద్వారా పుట్టిందే ‘నలంద’. అనగా జ్ఞానప్రదాయిని అని అర్థం.

nalanda-1గౌతమ బుద్ధుని కాలంలో...

నలంద విశ్వవిద్యాలయం క్రీశ.427 నుంచి క్రీ.శ.1197 వరకూ బౌద్ధ విజ్ఞాన కేంద్రంగా ఉండేది. పాక్షికంగా పాల వంశ పాలనలో ఉన్నది. ఇది లిఖిత చరిత్రలో ప్రపంచంలోని తొలి విశ్వ విద్యాలయాలలో ఒకటి. అలెగ్జాండర్‌ కన్నింగ్‌హాం నలందను బారాగావ్‌ గ్రామంగా గుర్తించాడు. బుద్ధుడు చాలాసార్లు నలంద చుట్టు పక్కల ప్రాంతంలో తిరిగాడని, అక్కడ కొన్ని రోజులు ఉన్నాడని అంటారు. బుద్ధుడు అనేక పర్యాయములు నలందలో ఉన్నాడని చరిత్ర చెబుతోంది. ఆయన నలందను సందర్శించినప్పుడు అక్కడ ఉన్న మామిడితోపులో బస చేసేవాడట.

అక్కడ ఉండగా ఉపాళీ-గహపతి, దీఘాతపస్సీలతో చర్చలు జరిపేవాడు. కేవత్త, అసిబంధకపుత్తతో కూడా అనేక చర్చలు జరిపినట్టు తెలుస్తున్నది. బుద్ధుడు మగధ గుండా తన చివరి యాత్రలో నలందను సందర్శించాడు. సారిపుత్త, తను చనిపోయే కొద్దికాలం ముందు ఇక్కడే బుద్ధుని యెడల తన విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తూ సింహగర్జన చేశాడు. చరిత్రకారుల ప్రకారం ఈ విశ్వవిద్యాలయం క్రీశ 1193 వరకు ఉన్నతస్థాయిలో వర్థిల్లింది. దీనికి ప్రధానకారణం బౌద్ధచక్రవర్తులైన హర్షవర్ధనుడు వంటివారు. పాలివంశానికి చెందిన రాజుల ఆదరణే కారణం.

బౌద్ధమతంపై నలంద ప్రభావం...

9 - 12 వ శతాబ్దం మధ్యకాలంలో ప్రజ్వరిల్లిన టిబెటన్‌ బౌద్ధత్వం (వజ్రాయన) నలంద బోధకుల నుండి, సంప్రదాయాల నుండే ఉద్భవించింది. వియత్నాం, చైనా, కొరియా, మరియు జపాన్‌లలో అనుసరించే మహాయాన బౌద్ధం పుట్టుక కూడా ఈ విశ్వ విద్యలయ ప్రాంగణంలోనే జరిగిందంటే అతిశయోక్తి కాదు. థెరవాడ బౌద్ధం కూడా నలందలో బోధించబడినది. కానీ థెరవాడ బౌద్ధానికి నలంద గట్టి కేంద్రం కాకపొవడం వల్ల, తరవాతి అభివృద్ధి ఇక్కడ జరగలేదు.

nalanda-2పతనావస్థ...

1193లో నలంద విశ్వవిద్యాలయ సముదాయాన్ని, భక్తియార్‌ ఖిల్జీ నాయకత్వంలో తురుష్క సేనలు దండెత్తి కొల్లగొట్టాయి. ఈ సంఘటన భారతదేశంలో బౌద్ధమత క్షీణతకు మైలురాయిగా భావిస్తారు. నలందను కొల్లగొట్టే ముందు ఖిల్జీ అక్కడ ఖురాన్‌ ప్రతి ఉందా అని వాకబు చేశాడని చెబుతారు. 1235లో టిబెట్‌ అనువాదకుడు ఛాగ్‌ లోట్స్‌వా నలందను సందర్శించినపుడు కొల్లగొట్టబడి జీర్ణవస్థలో ఉన్నప్పటికీ కొద్దిమంది బౌద్ధ భిక్షువులతో పనిచేస్తూ ఉన్నది. గణితం, ఖగోళశాస్త్రం, రసాయన శాస్త్రం, స్వరూపశాస్త్రం మొదలగు శాస్త్రాలలో ప్రాచీన భారతీయ విజ్ఞానం అకస్మాత్తుగా అంతరించిపోవడానికి నలంద విశ్వవిద్యాలయ నాశనం, ఉత్తర భారతదేశమంతటా ఇతర దేవాలయాలు, ఆశ్రమాల నాశనమే కారణమని అనేకమంది చరిత్రకారులు భావిస్తారు. దండయాత్రల ప్రధాన మార్గంలో ఉన్న ఇక్కడి సన్యాసాశ్రమాలన్నీ కూలగొట్టబడినవి. ప్రధాన మార్గంలో లేకపోవడం నలంద, బుద్ధగయ మిగిలాయని చెబుతారు. ప్రధాన మార్గంలో లేని, ఉత్తర బెంగాల్‌ లోని జగద్దలా ఆశ్రమం వంటి అనేక ఆశ్రమాలు ఏ మాత్రం హానిలేకుండా ఉండి వృద్ధి చెందినవి.

పునరుద్ధరణ...

డిసెంబర్‌ 9, 2006న న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక 1 బిలయన్‌ డాలర్లు ఖర్చుచేసి ప్రాచీన విశ్వవిద్యాలయమున్న చోటను పునరుద్ధరించటానికి ఓ ప్రణాళికను వివరించింది. సింగపూర్‌ నేతృత్వంలో భారత్‌, జపాన్‌, ఇతర దేశాలతో కలసి ఒక కన్షార్షియంగా ఏర్పడి 500 మిలియన్‌ డాలర్లతో కొత్త విశ్వవిద్యాలయం నిర్మించటానికి, మరో 500 మిలియన్‌ డాలర్లు దానికి అవసరమయ్యే సదుపాలను అభివృద్ధి చేయటానికి నిధులు సేకరించడానికి ప్రయత్నిస్తున్నది.

nalanda-3విశ్వవిద్యాలయ చరిత్ర...

చారిత్రక ఆధారాల ప్రకారం నలంద విశ్వ విద్యాలయము గుప్తరాజుల, ముఖ్యంగా కుమార గుప్త, సహాయంతో క్రీస్తుశకం 450లో నిర్మించబడినది. నలంద ప్రపంచంలోనే మొట్ట మొదటి ఆవాస విశ్వవిద్యాలయం. అంటే ఈ విద్యాలయంలో విద్యార్థుల కొరకు వసతి గృహాలు ఉండేవి. ఇందులో షుమారుగా పదివేల మంది విద్యర్థులు, రెండువేల మంది బోధకులు ఉండేవారు. పెను గోడ ద్వారాలతో ఈ విశ్వ విద్యాలయము ‘అతి ఘనమైన కట్టడం’ గా గుర్తించబడినది. నలందలో ఎనిమిది ప్రత్యేక ఆవరణలు, పది గుళ్లు, లెక్కకు మించిన ధ్యాన మందిరాలు, తరగతి గదులు ఉండేవి. ఆవరణలో కొలనులు, ఉద్యానవనాలు ఉండేవి. గ్రంధాలయం ఒక తొమ్మిది అంతస్తుల భవనంలో ఉండేది. ఇందులో ఎన్నో గ్రంధాల ములాలు ఉన్నవి. నలంద విశ్వ విద్యాలయంలో బోధింపబడే విషయాలు ప్రతి విజ్ఞాన శాఖనూ స్పర్శించాయు. నలంద విద్యార్ధులను, బొధకులను కొరియా, జపాన్‌, చైనా, టిబెట్‌, ఇండోనేషియా, పర్షియా, టర్కి వంటి దేశాల నుండి ఆకర్షించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Papikondalu tour information
The magnificence of the mughal gardens  
Rate This Article
(2 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles