Saudi arabia tourism information

Saudi Arabia, Saudi Arabia vacations, Saudi Arabia tourism, Saudi Arabia packages, Saudi Arabia vacation packages, articles, guidebooks, review, travel, reviews, hotels, attractions, advice, deals, offers, vacation rental, vacation rentals, Saudi Arabia vacation packages, Saudi Arabia Overview

Saudi Arabia, Saudi Arabia vacations, Saudi Arabia tourism, Saudi Arabia packages, Saudi Arabia vacation packages, articles, guidebooks, review, travel, reviews, hotels, attractions, advice, deals, offers, vacation rental, vacation rentals, Saudi Arabia vacation packages, Saudi Arabia Overview

Saudi Arabia Tourism Information.png

Posted: 09/10/2012 01:22 PM IST
Saudi arabia tourism information

Saudi_Arabia_Tourism_Information

Red_seeఅరబిక్ దేశం అంటే... ఖర్జూరం చెట్లు గుర్తొస్తాయి... ఇసుక ఎడారులు... ఒంటెల సవారీ గుర్తొస్తాయి... భానుని ప్రచండ కిరణాలు చెమటపట్టిస్తాయి... నీటి జాడ లేదేమో అన్నంత భయంతో వెన్నులోంచి చలి పుట్టుకొస్తుంది. కానీ... ఇక్కడ చమురు బావులే కాదు... చక్కటి జలపాతాలున్నాయి... అందమైన హిల్‌స్టేషన్లూ ఉన్నాయి. ప్రవక్త పుట్టిన ఈ నేలలో... శిలాయుగపు కళాకృతులు... ప్రాచీన యుద్ధాల ఆనవాళ్లూ ఉన్నాయి. గ్రేట్ కంట్రీ సౌదీ అరేబియా నగరం విశేషాలు.

సౌదీ అరేబియా... వాడుకలో సౌదీ అంటుంటాం. ఇక్కడ రాజు సర్వాధికారి. అధికారం వారసత్వంగా కొనసాగుతోంది. ఇప్పుడు ఉన్న రాజు పేరు అబ్దుల్లా బిన్ అబ్దులాజీజ్ అల్ సౌద్. అరబిక్ భాషలో అల్ అంటే పవిత్రమైన అని అర్థం. ఇక్కడ నివాసప్రదేశాల పేర్లకు ముందు కూడా అల్ అనే పదం ఉంటుంది. మనకు మధ్యాహ్నం 2:30 నిమిషాలకు సౌదీ అరేబియాలో మధ్యాహ్నం పన్నెండు గంటలు. మనకంటే రెండున్నర గంటల వెనుక ఉంటుంది. సౌదీ రాజధాని నగరం రియాద్. మక్కా, మదీనా నగరాలు ఇస్లామీయ ప్రాముఖ్యత సంతరించుకున్న ప్రముఖ నగరాలు. మహమ్మద్‌ప్రవక్త పుట్టిన ప్రదేశం మక్కా. తరవాత ప్రవక్త మదీనాకు వెళ్లాడని చెబుతారు. అందుకే ఈ రెండూ పరమ పవిత్ర స్థలాలు. వీటితోపాటు జద్దా, దమామ్, అభా దేశంలోని ప్రముఖ నగరాలు.

విస్తరించిన భారతీయత!

సౌదీ అరేబియాలో భారతీయులు చెప్పుకోదగిన సంఖ్యలోనే ఉన్నారు. మలయాళీలు, తమిళులు ఎక్కువ. ఆ తర్వాత స్థానం తెలుగు వాళ్లది. గుజరాతీలు తక్కువ. ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్‌లు, సూపర్ మార్కెట్ వ్యాపారాలు దాదాపుగా మలయాళీలు నిర్వహించేవే ఉంటాయి. ఇంగువతో సహా ప్రతిదీ దొరుకుతుంది. తోటకూర, కొత్తిమీర అయితే మన దగ్గర కూడా అంత తాజాగా దొరకవేమో అనిపిస్తుంది. దాదాపుగా ఇవన్నీ కేరళ నుంచి వచ్చినవే. తమిళులు అందరితో కలివిడిగా ఉంటారు కానీ మలయాళీలు కలవరు. ఇక్కడ మహిళలు ఎక్కువగా బ్యాంకింగ్, టీచింగ్, నర్సింగ్ రంగాల్లో పని చేస్తుంటారు. వీరిలో ఎక్కువశాతం కేరళీయులే. ఇక్కడ మనవాళ్లు అరేబియన్లతో టచ్ లేకుండానే సౌకర్యంగా జీవిస్తుంటారు. బయటకు వెళ్లినప్పుడు మాత్రం బురఖా ధరించాలి. ముఖాన్ని కప్పుకోవాలన్న నిబంధన లేదు. మక్కా, జద్దా, మదీనా వంటి చోట్ల నియమాలు కచ్చితంగా ఉంటాయి. ఈ నగరాల్లో పూర్తి ఇస్లాం సంప్రదాయాన్ని పాటిస్తారు. అరబిక్ ప్రజలు మన కట్టుబొట్టును గౌరవిస్తారు. భాష రాకపోయినా స్నేహపూర్వకంగా నవ్వుతారు.

మన పంటలూ పండుతాయి!

ఇక్కడ ఫార్మ్ హౌస్‌లలో టొమాటో, పాలకూర వంటి చాలా కూరగాయలు పండిస్తున్నారు. రెస్టారెంట్లలో ఇడ్లీ, దోసె, వడ, ఊతప్పం వంటి దక్షిణభారత వంటకాలన్నీ దొరుకుతాయి. నార్త్ హోటల్స్ ఉన్నాయి కానీ తక్కువ. పాకిస్తానీ రెస్టారెంట్లలో కడాయ్ చికెన్ ఫేమస్. రోటీలు చాలా బావుంటాయి. వాళ్లు రొట్టెని మనలాగ గోధుమపిండితో చేయరు. అన్ని రకాల చిరుధాన్యాలను కలిపి పిండి పట్టిస్తారు. రొట్టెని మట్టి పొయ్యి మీద కాలుస్తారు. కడాయ్ చికెన్‌తో ఈ రోటీల రుచిని మాటల్లో చెప్పలేం. సౌదీలో క్వాలిటీఫుడ్ దొరుకుతుంది. అల్‌మరై ఫుల్‌క్రీమ్ పెరుగు తిన్న వాళ్లు ఇక మన పెరుగును ఇష్టపడరు. సౌదీలో ప్రపంచంలో అతిపెద్ద కౌఫార్మ్ ఉంది. డైరీ ఉత్పత్తులకు కొదవ ఉండదు.ఇక్కడ వాతావరణం ఎండాకాలంలో 50 డిగ్రీలు ఉంటుంది. కానీ మిగిలిన ఏడాదంతా మామూలు ఉష్ణోగ్రతలే ఉంటాయి. ఇక్కడ ఏసీ కనీసావసరం. చిన్న బడ్డీకొట్టు లాంటి దుకాణంలో మన దగ్గర ఫ్యాన్ ఉన్నంత మామూలుగా ఇక్కడ ఏసీ ఉంటుంది. బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ వంటి ఫీల్డు వర్క్‌ల వాళ్లకు ఇబ్బందిగానే ఉంటుంది. డాక్టర్లు, టీచర్లు వంటి ఇన్‌డోర్ ఉద్యోగులకు ఇబ్బంది ఉండదు. పైగా ఇక్కడ పవర్ కట్ కాదు కదా లైన్ తెగిపోయి కరెంట్ పోయే సందర్భాలు కూడా ఉండవు. క్యాండిల్ దీపావళికి వెలిగించాల్సిందే. ఇక్కడ గురు శుక్రవారాలు వారాంతాలు. బహ్రెయిన్ సౌదీ అరేబియాకు పొరుగున ఉన్న చిన్న దేశం. కోబార్, బహ్రెయిన్‌లను కలుపుతూ సముద్రం మీద కాజ్‌వే నిర్మించారు. వీకెండ్స్‌కి ఎక్కువ మంది బహ్రెయిన్ వెళ్తుంటారు. ఇక్కడ మన సినిమాలు రిలీజవుతాయి, స్వాతి వీక్లీ వంటి మన మ్యాగజైన్లు దొరుకుతాయి.

makkah_gateపారిశ్రామిక రంగం!

దేశంలో తెలుగువాళ్లు నిర్వహించే పరిశ్రమలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు చైనా వాళ్లు పారిశ్రామిక రంగంలో మనవాళ్లకు మంచి పోటీ ఇస్తున్నారు. ఇక్కడ ఉద్యోగవకాశాలు కెమికల్, మెకానికల్ రంగాల్లో ఎక్కువ. ఇక్కడ అన్నీ పెట్రోకెమికల్ పరిశ్రమలు కాబట్టి ఈ ఉద్యోగాలే ఎక్కువ. ఐటీ ఉద్యోగాలు తక్కువ. సౌదీలో భారతీయుల పిల్లల కోసం ఇండియన్ ఎంబసీ స్కూల్ ఉంది. ఇందులో ఎల్‌కెజి నుంచి పన్నెండవ తరగతి వరకు ఉంటుంది. ఆ తర్వాత ఇండియాకు లేదా అమెరికా వంటి ఇతర దేశాలకు వెళ్లాల్సిందే. మనవాళ్లే కాదు అరబిక్ పిల్లలు కూడా ఉన్నత చదువులు లెబనాన్, ఈజిప్టు, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీల్లో చదువుకుంటారు. గతంలో ఇక్కడ చదువు ధ్యాస ఉండేది కాదు కానీ ఇటీవల పెరిగింది. అమ్మాయిలను కూడా ఇతర దేశాలకు పంపిస్తున్నారు.

తెలుగు లేదు !

ఇక్కడ ఎంబసీ స్కూల్‌లో బాధనిపించే అంశం తెలుగు లాంగ్వేజ్ లేకపోవడమే. ఇందుకు కారణం మన వాళ్లే తెలుగు అక్కర్లేదు అని చెప్పడం. మలయాళీలు, తమిళులు వాళ్ల భాషను చదువుతున్నారు. అరబిక్ పిల్లలు వాళ్ల మాతృభాషను చదువుతున్నారు. తెలుగు పిల్లలు మాత్రం తెలుగు లేకపోవడంతో అరబిక్ చదువుతున్నారు.
మారుతున్నారు!స్థానిక సౌదీ ప్రజల మీద ఈజిప్టు, సిరియా ప్రభావం ఎక్కువ. అరబ్బులలో గతంలో రెండు - మూడు పెళ్లిళ్లు, పది మంది పిల్లలతో పెద్ద కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు ఒక పెళ్లి, ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలతో చక్కటి కుటుంబాలు కనిపిస్తున్నాయి. చదువుకోవడంతో ఇప్పుడు తమ దేశంలోని ఉద్యోగాలను భారతీయులు తన్నుకుపోతున్నారన్న భావన ఎక్కువవుతోంది. ఇక్కడి వాళ్లలో పెద్దగా పనిచేసే తత్వం లేదు. బంగ్లాదేశ్ వాళ్లు ఇంటి పనులు, కారు శుభ్రం చేయడం వంటి పనులు చేస్తుంటారు. బంగ్లాదేశీయులు బాగా పనిచేస్తారని పేరు కూడ. తాము చదువుకోకపోవడం, పనిచేయకపోవడంతో తమ సంపద ఇతర దేశాలకు తరలిపోతోందన్న ఆలోచన స్థానిక అరబ్బుల్లో కలుగుతోంది.

జీవనవ్యయం తక్కువే!

ఇతర అరబిక్ దేశాలతో పోలిస్తే సౌదీలో జీవన వ్యయం తక్కువ. 1500 రియాల్‌లు సంపాదించేవాళ్లు కూడా జాగ్రత్తగా ఖర్చుచేసుకుని ఐదొందల రియాల్‌లతో బతుకుతూ వెయ్యి రియాల్‌లు ఇండియాకు పంపించేవాళ్లు ఉన్నారు. దేశంలో పెట్రోల్ చవక కావడంతో అందరూ కార్లు వాడతారు. అన్నీ టొయోటోలే. రైళ్లు, బస్‌లు ఉన్నాయి కానీ వాటి మీద ఆధారపడే వాళ్లు తక్కువ. దేశం చాలా పెద్దది, జన సాంద్రత తక్కువ కావడంతో ఇన్ని వాహనాలు నడుస్తున్నా వాతావరణం కలుషితం కావడం లేదు. అన్ని వాహనాలూ మంచికండిషన్‌లో ఉండడం కూడా కారణం కావచ్చు. రోడ్లయితే మన అవుటర్ రింగ్ రోడ్ ఉన్నంత నీట్‌గా క్వాలిటీతో ఉంటాయి.

Urban_Artకనిపించని ఆంక్షలు !

ఇక్కడి వాళ్లు తమ కల్చర్‌ను పోగొట్టుకోరు. సంస్కృతిని పోగొట్టుకోకూడదన్న ఆంక్షలు పైకి కనిపించవు కానీ ఉంటాయి. సినిమా హాల్, బార్‌లకు అనుమతి లేదు. టూరిజాన్ని డెవలప్ చేయకపోవడానికి కారణమూ అదే. మక్కా, మదీనా వంటి పవిత్ర ప్రదేశాలున్న దేశం కాబట్టి పవిత్రతను కాపాడాలన్న తాపత్రయం. సంప్రదాయాన్ని కాపాడుకోవడంలో భాగంగా ఇవేవీ లేకుండా కట్టడి చేయగలిగారు కానీ, ఇంటర్నెట్ కారణంగా సమాజం ఇప్పుడిప్పుడే అడ్డదారులు తొక్కుతోంది. బ్లూఫిల్ములను చూడడంలో సౌదీ మొదటి స్థానంలో ఉన్నట్లు సర్వేల్లో తేలింది. దేశంలో లైబ్రరీ కనిపించదు. ప్రజలు ఇటీవలి కాలంలో విద్యావంతులు కావడంతో బుక్ రీడింగ్ హ్యాబిట్ ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బంగారం కొనుగోలు గురించి. తరుగు, కూలి ఉండవు. ఎన్ని గ్రాముల ఆభరణం కొన్నా నికరమైన బంగారం ధరకే వస్తాయి. అరబిక్ దేశాల్లో ఆభరణాలు పెద్దవిగా ఉంటాయనుకుంటారు కానీ చాలా నాజూకైన ఆభరణాలు కూడా చేస్తారు. ఇక్కడి ఆహారం తిని, మౌలిక వసతులను అనుభవించి, ఆభరణాలు ధరించిన వాళ్లు మరో ప్రదేశాన్ని ఇష్టపడరు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Success story of satish dhawan space centre shar
Information about italy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles