Information for bangkok city

Thailand, Bangkok, city, people, skytrain, smiles, street, food, victory, monument, pantip, siam, square, canals, transportation, walking, markets, china, to

Bangkok Travel Information and Area Guide, Attractions, Restaurants & Dining, Sport & Activities, Shopping, Spa & Massage, Nightlife in Bangkok

Information for Bangkok.gif

Posted: 04/17/2012 12:27 PM IST
Information for bangkok city

Great_city_Bangkok

Babgkok_cityపొడవైన పేరుతో రికార్డుకెక్కిన నగరం…రాజు... సుదీర్ఘపాలనతో ప్రపంచ రికార్డు సాధించిన దేశానికి రాజధాని… మన పేర్లతో పొరుగూరిని తలపించే ప్రదేశం….ఇక్కడ సువర్ణభూమి స్వాగతం పలుకుతుంది….హాంగ్‌కాంగ్ డిస్నీల్యాండ్‌నీ... లండన్ మేడమ్ టస్సాడ్స్ మ్యూజియాన్నీ... ఇక్కడే చూడమంటున్న నగరమే....బ్యాంకాక్.బ్యాంకాక్ భారతీయ మూలాలు ఉన్న నగరం.

దాంతో ఇక్కడ చాలా పేర్లు మన దేశ భాషలకు దగ్గరగా ఉంటాయి. ప్రధానంగా మన ప్రాచీన భాషలు పాళి, సంస్కృత భాషల ఆధారంగా వచ్చిన పేర్లు చాలా ఉన్నాయి. ఇక్కడ ఎయిర్‌పోర్టు పేరు సువర్ణభూమి. ఇక్కడ స్థిరనివాసం ఏర్పరుచుకున్న భారతీయులు కూడా ఎక్కువే. బౌద్ధం మనదేశంలో పుట్టి విదేశాలకు విస్తరించింది అని చదువుకున్నాం చూడండి ఆ బౌద్ధం ఇక్కడే కేంద్రీకరించిందా అన్నట్లు ఉంటుంది నగరంలో పర్యటిస్తుంటే. టూరిజం ప్రధాన ఆదాయవనరు కావడంతో అందరికీ ఎంతో కొంత ఇంగ్లిష్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. నగరంలో ఇంగ్లిష్ నేర్పించే స్కూళ్లు పెరగడానికి కారణం కూడా పర్యాటకరంగమే.

పని చేసేది మహిళలే !

బ్యాంకాక్‌లో వర్క్ కల్చర్ ఎక్కువ. అయితే ఇక్కడ పనిచేసేది, డబ్బు సంపాదించేది మహిళలు మాత్రమే. మగవాళ్లు వ్యసనాలకు బానిసలై పబ్బుల్లోనూ, కసినోల్లోనూ గడుపుతుంటారు. ఉద్యోగం చేస్తున్న మగవాళ్లు కనిపించారంటే వాళ్లు విదేశీయులై ఉంటారు. ఇక్కడ మహిళల జనాభా కూడా ఎక్కువ. చాలామంది ఒంటరిగా జీవించడానికే మొగ్గుచూపుతారు. పెళ్లి చేసుకుందామన్నా బాధ్యతగా వ్యవహరించే మగవాళ్లు దొరక్క... ఉద్యోగాలు చేసుకుంటూ జీవించే మహిళలు ఎక్కువ. సహజీవనంతో పిల్లలు పుట్టినా వాళ్లను ఆడవాళ్లే పెంచుకుంటారు. ఇక్కడ అమ్మాయిలు చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం చూసుకుని విడిగా వెళ్లిపోతారు. మగపిల్లలు డిగ్రీ పూర్తయి కూడా అమ్మ పోషణలో కొనసాగుతూ ఏ ఉద్యోగం చూసుకోకుండా ఖర్చులకు అమ్మను డబ్బడుగుతుంటారు. మన విధానానికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది బ్యాంకాక్ జీవనశైలి. ఇక్కడ ఇంట్లో వంటలు ఉండవు. వంటగది కూడా ఉండదని మనవాళ్లు జోక్ చేస్తుంటారు. స్కూళ్లు, ఆఫీసులు ఉదయం ఎనిమిదికే మొదలవుతాయి. స్ట్రీట్‌ఫుడ్ తిని డ్యూటీలకు వెళ్లిపోతుంటారు. థాయ్ మహిళల పనిచేసే తత్వానికి ఎంతగా పేరు వచ్చిందంటే... నగరంలోని మల్టీనేషనల్ కంపెనీలు థాయ్ మహిళలకు ఏరికోరి ఉద్యోగం ఇస్తున్నాయి. ఇంగ్లిష్ సరిగా రాకపోయినా సరే ఉద్యోగం ఇచ్చి ఇంగ్లిష్ నేర్పించి పని చేయించుకుంటున్నాయి.

జీవనశైలిపై యుద్ధం ప్రభావం !

బ్యాంకాక్ సంప్రదాయ జీవనశైలిని వియత్నాం యుద్ధం పూర్తిగా మార్చివేసింది. అమెరికా సైనిక దళాలు ఏళ్లపాటు ఉండేవి. బ్యాంకాక్ మగవాళ్లు స్వతహాగా బద్ధకస్తులు కావడంతో డబ్బు కోసం భార్యను అమెరికా సైనికులకు అమ్మడానికి కూడా వెనుకాడేవారు కాదు. పైగా ఇక్కడ 16,17 శతాబ్దాల్లో మహిళను అమ్మడం, కొనుక్కోవడం రెండూ చట్టబద్ధమే. మగవాడు తనకు భార్య కావాలంటే ఒక మహిళను కొనుక్కోవచ్చు. ఈ విధానం శృతిమించిన తరుణంలో థాయ్‌లాండ్ రాజు దీనిని నిషేధించాడు. 20వ శతాబ్దంలో దేశంలో అడుగుపెట్టిన అమెరికా సైనికదళాలు స్థానిక మహిళలను వ్యభిచారులుగా మార్చేశాయి. ఇంతటి ఒడిదొడుకులను ఎదుర్కోవడంతోనో ఏమో ఇక్కడ మహిళలు చాలా త్వరగా స్వతంత్రంగా జీవించే స్థాయికి ఎదిగారు. ప్రస్తుత పరిస్థితిని ఉచ్చు నుంచి బయటపడిన స్వేచ్ఛావిహంగంలా, హాయిగా భావిస్తున్నారు. వివాహబంధంలోకి వెళ్లడానికి ఒకటికి నాలుగుసార్లు ఆలోచించే పరిస్థితి ఇప్పటి సగటు థాయ్ మహిళది. సంపన్న కుటుంబాల మహిళలు మామూలుగానే పెళ్లి చేసుకుంటారు. ఇక్కడ పెళ్లి చేసుకున్న వాళ్లు వివాహబంధాన్ని కొనసాగిస్తారు. బ్యాంకాక్‌లో పాశ్చాత్య సంస్కృతికి కారణం కూడా వియత్నాం యుద్ధమే. యుద్ధం తర్వాత చాలామంది అమెరికా సైనికులు తిరిగి వెళ్లలేదు. ఇక్కడి మహిళలను వివాహం చేసుకుని స్థిరపడ్డారు. దాంతో ఇక్కడ క్రాస్ జెండర్ పీపుల్ కూడా కనిపిస్తారు. థాయ్ సంప్రదాయ దుస్తులు కనిపించేది పర్యాటక ప్రదేశాల్లోనే.

వెస్టర్న్ స్టయిల్ మాల్స్...

నగరంలో షాపింగ్ మాల్స్, రోడ్లు కూడా అమెరికాలో ఉన్నట్లే ఉంటాయి. రోడ్డు మీద ప్రధానంగా కనిపించేవి బ్యూటీపార్లర్లు. వీటిలో నిజమైనBabgkok_city2 బ్యూటీపార్లర్లు చాలా తక్కువ. ఫుట్ మసాజ్ పేరుతో జరిగే అనైతికత ఎక్కువ. ప్రభుత్వం వ్యభిచారాన్ని నిషేధించింది. కానీ ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు పర్యాటక రంగం కావడంతో మసాజ్ పేరుతో జరిగే ఘోరాలను చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది అనే విమర్శ ఎక్కువగా ఉంది. ఇక్కడ ప్రధాన ఆహారం సీఫుడ్. ఇక్కడ ఆహారం, హోటల్ గది అద్దె ఇండియాతో పోలిస్తే బాగా చవక. ఐదువేల రూపాయలకు ఫైవ్‌స్టార్ అకామడేషన్ దొరుకుతుంది. నగరంలో పర్యటించడానికి టూవీలర్ ట్యాక్సీల నుంచి స్కైబస్‌ల వరకు ఉంటాయి. వీటిలో చార్జీలు పది బాత్‌ల నుంచి 40బాత్‌ల వరకు ఉంటుంది. సిటీలో పర్యటించడానికి వంద బాత్‌లకు అన్‌లిమిటెడ్ టికెట్ తీసుకుంటే ఆ రోజంతా టూ వీలర్ ట్యాక్సీ నుంచి స్కైబస్ వరకు అన్నింటిలో ప్రయాణించవచ్చు. పర్యాటకులు నగరంలో ఎక్కడ షాపింగ్ చేసినా బిల్లు వేసేటప్పుడు మన పాస్‌పోర్టు నంబరు నమోదు చేస్తారు. వాళ్లు వెళ్లేటప్పుడు ఎయిర్‌పోర్టులో వ్యాట్ ట్యాక్సు మొత్తం ఇచ్చేస్తారు. నగరంలో షాపులు తొమ్మిది - పదింటికి మూసేస్తారు. అప్పటి నుంచి నైట్ మార్కెట్ అమ్మకాలు మొదలవుతాయి. ఈ మార్కెట్లలో స్ట్రీట్‌ఫుడ్ 24 గంటలూ దొరుకుతుంది. చాలా పరిశుభ్రంగా ఉంటుంది కూడ. ఫుట్‌పాత్ మీదనే వండడం, వడ్డించడం, తినడం అన్నీ. ఫుట్‌పాత్‌లు చాలా విశాలంగా ఉండడంతో పాదచారులకు ఇబ్బంది కలగదు. అలాగే ఫ్లోటింగ్ మార్కెట్ కూడా ఇక్కడ చాలా ఫేమస్. పడవల్లో వస్తువులు పెట్టుకుని అమ్ముతుంటారు.

పారిశ్రామికరంగం మనవాళ్లదే!

థాయ్‌లో ఎలక్ట్రానిక్ వస్తువులు, బట్టల పరిశ్రమలు ఎక్కువ. వాటిలో ఎక్కువ భారతీయులవే. ఇక్కడ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి ప్రత్యేక రాయితీలు ఇస్తోంది. ఇక్కడ సినిమా తీయడం ఇండియాలోకంటే చవక. పైగా అనుమతులన్నీ సులభంగా వస్తాయి. మనవాళ్లు సినిమా తీయడానికి బ్యాంకాక్ బాట పట్టడానికి అందమైన లొకేషన్లు ఒక కారణం అయితే... బడ్జెట్ కూడా ముఖ్యమైన కారణమే. బ్యాంకాక్ సహజవనరులు పుష్కలంగా ఉన్న నగరం. పట్టాయా బీచ్‌లు, దట్టమైన అడవులతో నగరం అల్ట్రామోడరన్, అల్ట్రా కల్చర్‌కు వేదికగా కనిపిస్తుంది. ఇక్కడి వాళ్లు చాలా సౌమ్యులు. హెల్పింగ్ నేచర్ ఎక్కువ. కొత్తవాళ్లు ఏదైనా అడిగితే ఇంగ్లిష్ బాగా రాకపోయినా వచ్చిన కొద్దిపాటి ఇంగ్లిష్‌లో అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తారు.బ్యాంకాక్ పూర్తి పేరు... ‘క్రుంగ్ థెప్ మహానఖోన్ ఆమోన్ రత్తనకోసిన్ మాహింతరయుత్థయ మహాదిలోక్ ఫోప్ నోఫ్ఫారాత్ రాత్చ్‌నథాని బురిరోమ్ ఉడింరాత్‌చనివెత్ మహాసథన్ ఆమోన్ ఫిమాన్ అవాతన్ సాథిత్ సాక్కథత్తియ విట్సనుకమ్ ప్రాసిత్’. ఇది థాయ్ భాషతోపాటు మన ప్రాచీన భారతీయ భాషలైన పాళి, సంస్కృత భాషల సమ్మేళనం. ఇంత పెద్ద పేరుకు అర్థం... ‘దేవతల నగరం, గొప్ప నగరం, అనంతమైన ఆభరణాల నగరం, ఇంద్రుని దుర్భేద్యమైన నగరం, నవరత్నాల కేంద్ర స్థానం, సంతోషకరమైన నగరం, దేవతల అనుగ్రహంతో సమృద్ధమైన రాజప్రాసాదం ఉన్న నగరం, ఇంద్రుడు విష్ణుకర్మతో కట్టించి ఇచ్చిన నగరం’ అని. ఈ పేరు మొత్తం బ్యాంకాక్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ మీద రాసి ఉంటుంది. వాడుకలో ఎవరూ ఇంత పేరును పలకరు. స్కూలు పిల్లలు మాత్రం ఎక్కం అప్పచెప్పినట్లు చెబుతారు. ఇది ప్రపంచంలో పొడవైన పేరున్న నగరంగా గిన్నిస్ బుక్‌లో రికార్డుకెక్కింది.

పర్యాటక ఆకర్షణలు!

Babgkok_city1పర్యాటక ఆకర్షణల్లో ప్రధానమైనది వాటర్‌సిటీ. గ్రాండ్ ప్యాలెస్, చారిత్రక ఆలయం వాట్ అరుణ్, రీక్లైనింగ్ బుద్ధ, ఛో ప్రయా నది, వీకెండ్‌మార్కెట్‌లో షాపింగ్, సంప్రదాయ థాయ్ భవనాల సముదాయం జిమ్ థాంప్సన్ జోన్, చైనా టౌన్‌లను చూస్తే బ్యాంకాక్ విశేషాలు, ప్రకృతి సౌందర్యం, వర్తక వాణిజ్యాల నేపథ్యం, నిర్మాణకౌశలం తెలుస్తాయి. ఫ్లోటింగ్ మార్కెట్‌లో కొనుగోలు చేయడం పర్యాటకులకు చాలా సరదాగా ఉంటుంది.

బ్యాంగ్‌కాక్ టైమ్ మనకంటే ఒకటిన్నర గంట ముందు ఉంటుంది. మనకు మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో బ్యాంకాక్‌లో మూడు గంటలు.
థాయ్‌లాండ్ కరెన్సీ ’థాయ్‌బాత్’. ఒక థాయ్‌బాత్ దాదాపుగా రూపాయి డెబ్పై పైసలకు సమానం.

థాయ్‌లాండ్ జనాభా ఆరున్నర కోట్లు ఉంటుంది. బ్యాంకాక్ జనాభా పన్నెండు లక్షలు.

హైదరాబాద్‌నుంచి బ్యాంకాక్ వెళ్లి రావడానికి విమాన ఖర్చులు ఒక్కొక్కరికి పాతికవేల రూపాయలవుతాయి. ప్రయాణం ఎనిమిది నుంచి పది గంటలు ఉంటుంది. చాలా సర్వీసులకు ముంబయిలో విరామం ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  History of fatehpur sikri
Papamma is a model organic farmer  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles