World richest village huaxi

china, Huaxi, Republic of China, 2008 Summer Olympics, slideshow, taiwan, news, box, asia, shanghai, beat, beijing, tibet, japan, taipei, lama, singapore.

China's richest village Huaxi has a new landmark - a stunning 74-storey International Hotel. | Amazing view of China's richest village. Huaxi, also known as China's richest village, celebrates its 50th anniversary with the inauguration of a massive skyscraper.

Richest Village Huaxi.GIF

Posted: 03/15/2012 01:04 PM IST
World richest village huaxi

World_Richest_Village_Huaxi

Richest_Village_Huaxiహ్వాషి..... అంత పెద్ద చైనా దేశంలో ఓ చిన్న గ్రామం. కానీ ఈ పేరు వింటే చాలు... ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ఒక్కసారయినా సందర్శించాలనుకుంటారు. అందుకే ఆ గ్రామం నిత్యం సందర్శకులతో కిటకిట లాడుతుంది. దీనికి కారణం ఉంది.... అది చైనాలోనే కాదు.. ప్రపంచంలోనే ఖరీదైన గ్రామం. ప్రస్తుతం 328 మీటర్ల ఎత్తైన టవర్ ను నిర్మించుకోవడం ద్వారా ఇటీవల మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఒక్కసారి గ్రామ విశేషాలేంటో తెలుసుకుందాం.

కొత్తగా నిర్మించిన 74 అంతస్తుల ఓ టవర్ కోసం ఆ గ్రామస్తులు సుమారు 2,343 కోట్ల రూపాయలు ఖర్చుచేశారు. అందులో లాగ్సి అనే అంతర్జాతీయ హోటల్ ని ప్రారంభించారు. అంతేకాదు... తమ గ్రామ సిరిసంపదల్ని సూచిస్తూ సుమారు 232 కోట్ల రూపాయలు వెచ్చించి ఇందులో 24 క్యారెట్ల బంగారు ఎద్దు బొమ్మని షోకేసులో పెట్టారు.

ఆ గ్రామంలో అందరూ కోటీశ్వరులే....

హ్వాషి జనాభా... సుమారు రెండువేలు. మొత్తం మీద అక్కడ ఉన్న స్థానిక కుటుంబాల సంఖ్య 380. కానీ వీళ్ళంతా కోటీశ్వరులే. దీనంతటికీ కారణం ఆ గ్రామ మాజీ అధికారి వు రెన్ బావో. ఓ పేద వ్యవసాయాధారిత పల్లెటూరిని సకల ఆధునిక హంగులతో కూడిన ఖరీదైన సోషలిస్టు గ్రామంగా మార్చిన ఘనత ఆయనదే. 1961లో ఆయన గ్రామాధికారిగా బాధ్యతలు స్వీకరించి దీన్ని తీర్చిదిద్దడం ప్రారంభించాడు. గ్రామీణుల్ని వాళ్ళ ఆస్తుల్నీ సంఘటితం చేసి పారిశ్రామిక రంగల్లోనూ కష్టపడేలా చేశాడు. టెక్స్ టైల్స్ , స్టీలు పరిశ్రమలతో పాటు వ్యవసాయాన్ని పోత్సహించాడు. పెట్టుబడిదారి వ్యవస్థకి కమ్యూనిస్టు పరిపాలనని జోడించి గ్రామాన్ని అభివ్రుద్ధి పథంలో పయనించేలా చేశాడు.

ప్రస్తుతం ఆయనకు 85 ఏళ్ళు. గ్రామాన్ని ఎలా అభివ్రుద్ధి చేయాలి అన్నదే ఆయన నిరంత ఆలోచన. నన్ను ఎవరయినా తిట్టినా కుంగిపోను. పొగిడినా పొంగిపోను. క్లిష్ట సమయాల్లో ఆందోళన చెందను . నేను బతికి ఉన్నంత వరకూ పార్టీకి నా దేశానికి సేవ చేస్తూనే ఉంటానుఅంటారాయన.

‘1969... చైనాలో సాంస్ర్కుతిక విప్లవం ముమ్మరంగా ఉన్న రోజులవి. ఆ సమయంలోనే మా గ్రామంలో ప్రజలందరినీ భాగస్వాములుగా చేస్తూ Richest_Village_Huaxi_2నట్లు తయారు చేసే కంపెనీని స్థాపించాం. అది లాభాల దిశగా సాగింది. అందులో వచ్చిన లాభాలను పెట్టుబడిగా పెట్టి కొత్త కంపెనీలను నెలకొల్పాం. కొంత సొమ్మును స్టీలు, అల్యూమినియం వంటి ముడిసరుకుల మీద పెట్టుబడి పెట్టాం. అది రెట్టింపు, రెట్టింపు మీద రెట్టింపు... ఇలా పెరుగుతూ వందల లక్షల కోట్లకు చేరింది. మా గ్రామం తీరే మారిపోయింది. ప్రస్తుతం మా ఊళ్లో వివిధ ఉత్పత్తులకు సంబంధించిన కంపెనీలు 80కి పైగా ఉన్నాయి. గ్రామస్థులందరూ ఈ కంపెనీల్లో కార్మికులూ వాటాదారులూ కూడా. అలాగని వ్యవసాయాన్నీ వదిలిపెట్టలేదు. ఆధునిక పద్దతులనతో అధిక లాభాలు అర్జిస్తున్నాం. ఆర్థిక సంక్షోభం సమయంలో తక్కువ ధరకు వస్తుండంతో సెకండ్ హ్యాండ్ ఓడలు కొన్నాం. మరో ఎనిమిది కొనే ప్రయత్నంలో ఉన్నాం. గ్రామానికి సొంతంగా రెండు హెలీకాప్టర్లనీ కొనుగోలు చేశాం. అంటూ తన గ్రామం గురించి చెబతుతారు వు రెన్ బావో.

గ్రామీణ జీవనం...

చైనా రాజధాని నగరం షాంగైకి 100 మైళ్ల దూరంలో ఉందీ గ్రామం. ఈ గ్రామీణులందరికీ ఖరీధైన డూప్లెక్స్ ఇళ్లూ అందులో అంత్యంత విలాసవంతమైన ఫర్నీచర్. లగ్జరీ కార్లూ ఉన్నాయి. విద్య, వైద్యంతో పాటు గ్రామంలో సేంద్రీయ పద్దతులతో పండించిన కూరగాయలు, పండ్లు, బియ్యం, వంట నూనెతో సహా అన్నీ ఉచితమే. స్థానిక గ్రామీణులకే కాదు.... ఇక్కడ పనిచేయడానికి వచ్చిన వారందరికీ ఉచితంగానే ఆ గ్రామ కమిటీ అందిస్తుంది. గ్రామీణుల సంఖ్య రెండువేలకు మించకపోయినా ఈ ఊరికి వలస వచ్చి ఇక్కడే నివసించే ఉద్యోగుల సంఖ్య సుమారు పాతిక వేలకి పైనే. వీళ్లుగాక రోజు చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి 30 వేల మంది ఇక్కడకు వస్తుంటారు.

Richest_Village_Huaxi_4అయితే వలస వచ్చిన వాళ్ళు పనిచేయం ... వసతుల్ని అనుభవించడం వరకే. కానీ గ్రామంలోని పెట్టుబడిదారి వ్యవస్థలో భాగస్వాములు కాలేరు. ఎందుకంటే గ్రామంలోని పరిశ్రమలన్నీ కలిసి ఒక బహుళరంగ పారిశ్రామిక సమాఖ్య కింద నడుస్తాయి. స్టాక్ ఎక్సేంజ్ లో నమోదయిన ఈ సమాఖ్యలో హ్వాషి గ్రామస్తులు మాత్రమే షేర్ హోల్డర్లు. సమాఖ్యకు ఏటా వచ్చే ఆదాయంలో ఐదోవంతుని వాటాదారులంతా సమానంగా పంచుకుంటారు. గతేడాది కంపెనీ టర్నోవర్ సుమారు 43 వేల కోట్ల రూపాయలకు పెరిగినట్లు అంచనా..

అయితే ఈ గ్రామీణుల సిరిసంపదల వెనుక కష్టం చాలానే ఉంది. అలుపెరుగని వాళ్ల శ్రమే ఈ రోజున వాళ్లనీ ఈ స్థితిలో ఉంచింది. గ్రామీణులంతా ఇప్పటికీ వారంలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేయాల్సిందే. ఇక్కడ సంపాదించిన సొమ్మంతా మళ్ళీ అక్కడే పెట్టుబడి పెట్టాలి. కాదని గ్రామం వదిలి వెళ్తే ఇక్కడి సౌకర్యాలంటినీ కోల్పోతారని ప్రస్తుతం గ్రామాధికారి బాధ్యతలు నిర్వహిస్తున్న వు క్సియాన్ పేర్కొన్నాడు. ఈయన రెన్ బావో పుత్రుడే. ఈయనతో పాటు రెన్ బావో కొడుకులు మరో ముగ్గురు కూడా గ్రామాభివ్రుద్ధి కమిటీలో కీలకపాత్ర నిర్వహిస్తున్నారు.

నిరంతరం పనిలో మునిగి తేలే ఈ గ్రామీణుల్లో చాలామంది ఇప్పటి వరకు ఒక్కసారి కూడా దేశం వదిలి వెళ్ళలేదు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా Richest_Village_Huaxi_3ఉన్న వింతలన్నింటినీ కూడా ఇక్కడే నిర్మించాలనుకున్నారు గ్రామీణాధికారులు. ఆ ఫలితమే సిడ్నీ ఒపేరా హౌజ్, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, తియాన్మన్ రోస్ర్టెమ్, ఆర్క్ ఆఫ్ ట్రింఫ్, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ.... వంటివన్నీ గ్రామంలోనే నిర్మించారు. వ్యవసాయంలో అవంబించే వినూత్న పద్దతులు, కలిసికట్టుగా తయారు చేసే పారిశ్రామిక ఉత్పత్తులు, పర్యావరణపరంగా తీసుకునే జాగ్రత్తలు, సందర్శకుల్ని ఆకర్షించేందుకు నిర్మించిన వినోదాలు... వీటన్నింటి ఫలితంగా దక్కిన సిరిపందలు, ఆధునిక జీవన విధానం... ఇలా ఒకటా రెండా, హ్వాషి గ్రామీణుల శ్రమైక సౌందర్యాన్ని స్వయంగా చూసేందుకు ఆ గ్రామాన్ని ఏటా 20 లక్షల మంది దీన్ని సందర్శిస్తుంటారట. ప్రభుత్వాధికారులు కూడా సోషలిస్ట్ గ్రామ నమూనాగా దీన్నే ప్రామాణికంగా చెబుతున్నారు. అందుకే మరి... హ్వాషి ఏదో అల్లాటప్పా పల్లెటూరు కాదు. ఖరీధైన నగరాలను సైతం తలదన్నే అత్యంత సంపన్న గ్రామం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Not just bricks on the wall
Dr birendra dutt  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles