ఈ ప్రపంచం నిజంగా అద్భుతమైంది. ఊహకు అందనివి నిజాలై మనుషుల రూపంలో కనిపిస్తారు. కొంతమంది వ్యక్తులు తమ ప్రత్యేకతలతో నడిచే అద్భుతాలుగా ఉంటారు. ఒకరు విధిని జయిస్తే, మరొకరు తమ ప్రతిభతో ఆశ్చరపరుస్తారు. అరుదైన వ్యాధితో బాధపడే వారొకరైతే, భయంకర వ్యాధిని జయించిన వారు మరొకరు. కడుపులో గడ్డ ఒకనాటి పిండంగా అందరినీ ఆశ్చర్యపరిస్తే, కాళ్ళు లేకున్నా వేగంగా పరుగు తీసి దిగ్భ్రాంతి పరిచేది మరొకరు. ఓ చిన్నారి బాలుడు ఎంతో దూరం పరుగెత్తితే, మరో చిన్నారి ఏడేళ్ళేక సర్జరీ చేసేస్తాడు. ఓ వ్యక్తి తనెవరో మర్చిపోతే, మరో వ్యక్తికి గత జన్మలో తానెవరో గుర్తుకొచ్చింది. ఇలాంటి అద్భుతాలపై, అరుదైన వ్యక్తుల గురించి తెలుసుకుందాం.
గుర్తుకొస్తుంది...గతజన్మ
అమ్మా...నాన్న...అంటూ మాటలు వచ్చీ రాగానే ఓ రెండేళ్ళ చిన్న బాలుడు కామెరూన్ తన గత జన్మ విశేషాలు చెబుతుంటే, ఆ పిల్లాడు కథలు చెబుతున్నాడా, నిజాలు మాట్లాడుతున్నాడా అంటూ ఆశ్చర్యపోవడం తల్లిదండ్రు ల వంతైంది. వారు ఉండేది గ్లాస్‌గో (బ్రిటన్) నగరంలో. ఆ పిల్లాడు చెప్పే కథనాలకు సంబంధించిన ప్రాంతం ‘బారా’ ఓ చిన్న దీవి. అక్కడికి 220 కి.మీ దూరంలో ఉంది. ఆ దీవిలో తన గత జన్మ బాల్యం ఎలా గడిచిందో ఆ పిల్లాడు చెబుతుంటే తల్లిదండ్రులు బిత్తరపోయారు. తాను ఉండిన వైట్‌హౌస్ ఎలా ఉందో వివరించే వాడు. నలుపు, తెలుపురంగులో ఉండే కుక్కతో బీచ్‌లో ఎలా ఆడుకునేదీ వర్ణించే వాడు. ఓ కారు ప్రమాదంలో గత జన్మలోని తండ్రి షానె రాబర్ట్‌సన్ కారు ప్రమాదంలో ఎలా మరణించా డో చెప్పేవాడు. అలా మూడేళ్ళ పాటు తన గత జన్మ విశేషాలు చెబుతూనే ఉన్నాడు. దీంతో ఆ బాలుడి తల్లి నోర్మా భయపడిపోయి మానసిక వైద్యులను సంప్రదించింది. వారంతా ఆ కథలన్నీ కాకమ్మ కథలంటూ కొట్టిపారేశారు. ఆ పిల్లవాడు పట్టు వదలకుండా గతజన్మ జ్ఞాపకాలు చెబుతూ ఆ ప్రాంతానికి వెళ్దామంటూ ఒత్తిడి తీసుకువచ్చాడు. ఆ పిల్లవాడి గురించి తెలుసుకున్న ఇన్వెస్టిగేటివ్ సైకాలజిస్ట్ డాక్టర్ జిమ్ టకర్ తన వెంట బాలుడిని ‘బారా’కు తీసుకువెళ్ళాడు. అక్కడ ఆ ‘వైట్ హౌస్’ను గుర్తించారు. 1960-70 ప్రాంతాల్లో అక్కడ నివసించిన రాబర్ట్‌సన్ ఇంటిగా స్థానికులు తెలిపారు. ఆ కుటుంబానికి చెందిన వ్యక్తితో మాట్లాడితే, ఆ బాలుడు చెప్పిన వివరాల్లో కొన్ని తప్పుగా తేలాయి. కొన్ని మాత్రం నిమే అయ్యాయి. ఎవరికీ తెలియని కుటుంబరహస్యాలు నిజం కావడం విశేషం.
మరచిపోయాడు..ఈ జన్మ
లండన్‌లో 2005 డిసెంబర్ 4వ తేదీ వరకు కూడా డేవిడ్ ఓ సాధారణ వ్యక్తి. కుటుంబం, స్నేహితులు, మరెన్నో జ్ఞాపకాలు. ఆ రోజు సాయంత్రం ఆయన ఒక్కసారిగా తన గురించిన ‘సర్వస్వం’ ఒక్కసారిగా మరచిపోయాడు. ఆయనకు సంబంధించిన జ్ఞాపకాలన్నీ ఆయన మెదడులోనుంచి తుడిచిపెట్టుకుపోయాయి. అసలు ఆయనను ఆసుపత్రికి ఎవరు తీసుకువచ్చారో కూడా ఆయనకు తెలియదు. లండన్‌లోని కింగ్స్ కాలేజ్ ఆసుపత్రిలో ఆయనను ‘అన్‌నోన్ మేల్’గా చేర్చుకున్నారు. నాలుగు రోజుల తరువాత కుటుంబసభ్యులు డేవిడ్ వద్దకు చేరుకోగలిగినా, డేవిడ్ వారు ఎవరో గుర్తించలేకపోయాడు. తన తల్లిని సైతం ఓ అపరిచిత వ్యక్తిగా చూశాడు. ‘జ్ఞాపకాలు’ ఎప్పుడు తిరిగివస్తాయో డాక్టర్లు కూడా ఆ క్షణంలో చెప్పలేకపోయారు. ‘జ్ఞాపకాలు’ తిరిగి వచ్చేందుకు బాల్యంలో గడిపిన ఇంటి వద్దకు ఆయనను తీసుకెళ్ళారు. ఎందరెందరో స్నేహితులు వచ్చి పరామర్శించారు. తనకంటూ జ్ఞాపకాలు ఏవీ లేని డేవిడ్ ఇతరులు చెప్పే దాన్ని బట్టి వారితో తన సంబంధాలను కొనసాగించడం ప్రారంభించాడు. తల్లి వచ్చి నేను నీ తల్లిని అని చెబితే ఆమెను తల్లిగా భావిస్తూ అలా మెలగసాగాడు. స్నేహితులు వచ్చి మేము నీ స్నేహితులం అంటే వారితో స్నేహంగా ఉండసాగాడు. వారు చెప్పేది కరెక్టో కాదో తేల్చుకునే ‘జ్ఞాపక’ ఆధారం ఏదీ డేవిడ్‌కు లేదు. ‘జ్ఞాపకాల’ను తిరిగి తెచ్చుకునేందుకు చిన్ననాడు తాను చదివిన పాఠశాలకు వెళ్ళాడు. అయినా లాభం లేకపోయింది. పాత జ్ఞాపకాల తోడు లేకుండా కొత్త జీవితాన్ని ప్రారంభించాడు.
కడుపులో సోదరుడు...
బెంగాల్‌కు చెందిన సంజయ్ అనే రైతు నిండు గర్భిణిలా కన్పించేవాడు. కడుపులో గడ్డ ఉన్నట్లుగా ఉండేది. 1999 మే నెలలో ఓ రోజున శ్వాస ఆడక నాగపూర్‌లో వైద్యులను సంప్రదించాడు. మొదట కడుపులో పెద్ద గడ్డ ఉందని భావించి ఆపరేషన్ చేసిన వైద్యులు ఆ ‘అవశేషం’ చూసి దిగ్భ్రాంతి చెందారు. కడుపులోనుంచి ఆయన ‘సోదరుడి’ పిండ అవశేషా లను డాక్టర్లు వెలికితీశారు. సరిగా రూపం దాల్చని పిండం తల్లి గర్భంలో ఉన్నప్పుడే పొరపాటున సంజయ్ కడుపులోకి చేరిపోయి, ఎదుగుదల లేకుండా అలానే ఉండిపోయింది. డాక్టర్ మెహతా, ఆయన బృందం ఈ ఆపరేషన్ చేశారు. చివరి వరకు కూడా వారికి సంజయ్ కడుపులో ఉన్నది ఆయన సోదరుడి పిండ అవశేషమని తెలియదు. ఏదో పెద్ద కణితి అని దాన్ని వెలికి తీసి పరీక్షిస్తే అసలు నిజం తెలిసింది. ఆ పిండం అప్పటికి సగం వరకు ఎదిగింది. చేతులు, వేళ్ళు వచ్చాయి. గోళ్ళు కూడా పొడవుగా ఏర్పడ్డాయి. అది జీవంతో ఉండి సంజయ్ శరీరం నుంచి ఆహారాన్ని గ్రహించసాగింది. దాన్ని గనుక బయటకు తీయకుంటే అది ఏదో ఒకనాడు సంజయ్‌ను హతమార్చేదే. దీన్నే వైద్యపరిభాషలో ‘ఫిటెస్ ఇన్ ఫెటు’గా వ్యవహరిస్తారు. 500,000 ప్రసవాల్లో ఒకచోట ఇలాంటిది చోటు చేసుకోగలదని అంచనా. ప్రస్తుతం అధునాతన అల్ట్రాసౌండ్ పరీక్షలతో ఇలాంటి వాటిని ముందుగానే గుర్తించే వీలుంది.
అసాధారణ గణిత, భాషా సామర్థ్యాలు...
ఒక వ్యక్తికి ఒక అసాధరణ శక్తి ఉంటేనే ఎంతో గొప్ప మేధావిగా గుర్తిస్తాం. అలాంటిది ఇరవై పైగా అద్భుత శక్తి సామర్థ్యాలు ఉంటే ఏమని అంటాం? అలాంటి వ్యక్తి డేనియల్. 100 డెసిమల్ స్థానాల వరకు లెక్కలను ఆయన బుర్రలోనే చేసేయగలడు. ఒక భాషను వారం రోజుల్లో నేర్చుకోగలడు. ప్రతీ వ్యక్తిలో నిగూఢంగా గనుక ఇలాంటి శక్తిసామర్థ్యాలు ఉండి ఉంటే, వాటిని వెలికి తీసేందుకు డేనియల్ పై జరిగే పరీక్షలు ఉపకరిస్తాయనే ఉద్దేశంతో ఆయనపై శాస్తవ్రేత్తలు పరిశోధనలు జరిపారు. డేనియల్ స్ఫూర్తితో తీసిన రెయిన్ మ్యాన్ సినిమా ఆస్కార్ అవార్డులు పొందడం విశేషం. డేనియల్ 1979 జనవరి 31న జన్మించాడు. వృత్తిరీత్యా బ్రిటిష్ రచయిత. తన అతి చురుకుదనం లక్షణంపైనే ఓ నవల (బార్న్ ఆన్ ఎ బ్లూ డే) కూడా రాశాడు. యువతకు ఉపయుక్తమైన పుస్తకంగా అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ దాన్ని గుర్తించింది. 2006లో బెస్ట్ సెల్లింగ్ బుక్‌గా గుర్తింపు పొందింది. ఆయన రెండో పుస్తకం ‘ఎంబ్రాసింగ్ ది వైడ్ సై్క’ ఫ్రాన్స్‌లో బెస్ట్ సెల్లర్‌గా నమోదైంది. ఆయన పుస్తకాలు 20కి పైగా భాషల్లో ప్రచురితమయ్యాయి. డేనియల్ పుట్టి పెరిగింది ఇంగ్లాండ్‌లో. తొమ్మిది మంది సంతానంలో ఆయనే పెద్దవాడు. లండన్‌లో జరిగిన వరల్డ్ మెమరీ చాంపియన్‌షిప్ 1900, 2000లలో వరుసగా 12వ, 4వ స్థానాలను పొందాడు. గణితంలో, భాషలు నేర్చుకోవడంలో ఆయన నైపుణ్యం అపారం. ఒక సంఖ్య ఏ రకమైన (ప్రైమ్, కాంపోజిట్) సంఖ్యనో అప్రయత్నంగానే ఆయన చెప్పగలుగుతాడు. తన మెదడులో అంకెలు రకరకాల రంగులు, రూపాల్లో కనిపిస్తుంటాయని డేనియల్ అంటాడు. 298 అనే అంకె ఎంతో అసహ్యంగా కన్పింస్తుందని, 333 అనే సంఖ్య ఎంతో ఆకర్షణీయంగా ఉంటుందని చెబుతాడు. పలు టీవీ, రేడియో షోలలో ఆయన పాల్గొన్నాడు.
ఏడేళ్ళ వయస్సులోనే సర్జన్ ...
హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఆకృత్ జస్వాల్ 2000 ఏప్రిల్ 23న పుట్టాడు. తల్లిదండ్రులిద్దరూ వైద్యులు. ఏడేళ్ళ వయస్సులోనే ఆకృత్ క్యాన్సర్ రోగులకు సర్జరీలు చేయడం ప్రారంభించాడు. ఆయన ఐక్యూ ఐన్‌స్టీన్ ఐక్యూ కంటే ఎక్కువని భావిస్తారు. వైద్యకళాశాలకు వెళ్ళకుండానే వైద్యవిద్య నేర్చుకున్నాడు. పసితనంలోనే పాకే దశ లేకుండానే నడవడం నేర్చుకున్నాడు. 10 నెలల వయస్సులోనే మాట్లాడడం ఆరంభించాడు. ఐదేళ్ళ వయస్సు నాటికే షేక్‌స్పియర్ రచనలు చదవసాగాడు. ఆయన ఆసక్తిని గమనించి ఆరేళ్ళ వయస్సులో స్థానిక వైద్యులు వివిధ ఆపరేషన్లను చేసే సమయంలో చూసేందుకు ఆ పిల్లవాడిని అనుమతించారు. ఆకృత్ సంబంధిత అంశంపై సమాచారాన్ని సేకరించి దాన్ని అధ్యయనం చేసేవాడు. అలా ఎంతో విజ్ఞానం పొం దగలిగాడు. ఆ పిల్లవాని గురించి తెలుసుకున్న ఓ పేదకుటుంబం తమ కుమార్తెకు ఆపరేషన్ చేయాల్సిందిగా కోరింది. ఆ ఆపరేషన్‌ను ఆకృత్ దిగ్విజయంగా పూర్తి చేయ గలిగాడు. పంజాబ్ యూ నివర్సిటీ (చండీగఢ్) లో పిన్నవయస్సులోనే బిఎస్సీ లో చేరాడు. అప్లయిడ్ కెమిస్ట్రీలో మాస్టర్ డిగ్రీ చేశాడు. ఆయన ఐక్యూ 146గా గుర్తించారు.
|