"Loaded With Possibilities": Sidhu's Photo With Harbhajan కాంగ్రెస్ పార్టీలో చేరనున్న టీమిండియా మాజీ స్పిన్నర్

Navjot sidhu posts a photo with harbhajan singh hints at possibilities with bhajji

punjab congress, Navjot Sidhu, Harbhajan Singh, Political Entry, Congress, Shiromani Akalidal, Aam Admi Party, Punjab assembly election, Punjab, politics

Setting off speculations ahead of Punjab assembly election 2022, Punjab Congress chief Navjot Singh Sidhu posted a photo with cricketer Harbhajan Singh. "Picture loaded with possibilities.. with bhajji, the shining star," Sidhu captioned the photo which evidently is a recent photo of the duo from a recent meeting as they can be seen in their winterwears.

కాంగ్రెస్ పార్టీలో చేరనున్న టీమిండియా మాజీ స్పిన్నర్

Posted: 12/15/2021 08:10 PM IST
Navjot sidhu posts a photo with harbhajan singh hints at possibilities with bhajji

మాజీ క్రికెట‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ రాజకీయ అరంగేట్రం చేస్తారా? చేస్తే ఎప్పుడు, ఏ పార్టీ నుంచి చేస్తారు? ప్ర‌స్తుతం పంజాబ్ రాజకీయాలతో పాటు దేశ రాజ‌కీయాల్లో ఇదో హాట్ టాపిక్‌. మొన్న‌టికి మొన్న ఆయ‌న బీజేపీలో చేరిపోతున్నార‌ని వార్త‌లు గుప్పుమ‌న్నాయి. ఇదంతా పుకారే… అని ఆయ‌నే స్వ‌యంగా కొట్టిపారేశారు. అయితే తాజాగా… పంజాబ్ పీసీసీ అధ్య‌క్షుడు సిద్దూ ఓ ఫొటోను పోస్ట్ చేశారు. హ‌ర్భ‌జ‌న్, తానూ ఉన్న ఓ ఫొటోను ఆయ‌న పోస్ట్ చేశారు. పోస్ట్ చేయ‌డ‌మే కాకుండా… ”ఇలా అయ్యే అవ‌కాశం ఉంది” అని క్యాప్ష‌న్ కూడా పెట్టేశారు. దీంతో బ‌జ్జీ రాజ‌కీయ అరంగేట్రం విష‌యంలో మ‌ళ్లీ చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి.

పంజాబ్ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ కాంగ్రెస్‌, బీజేపీ క్రికెట‌ర్ల‌ను దువ్వే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యాయి. మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ బీజేపీలో చేర‌బోతున్నార‌ని వార్త‌లొచ్చాయి. అయితే వాటిపై యువ‌రాజ్ ఎలాంటి వ్యాఖ్య‌లూ చేయ‌లేదు. మ‌రోవైపు కాంగ్రెస్ హ‌ర్భ‌జ‌న్ సింగ్‌ను దువ్వే ప‌నిలో నిమ‌గ్న‌మైంది. ఈ విష‌యంలో పంజాబ్ పీసీసీ అధ్య‌క్షుడు న‌వ‌జ్యోత్ సింగ్ సిద్దూ చొర‌వ తీసుకుంటున్న‌ట్లు పేర్కొంటున్నారు. ఈ విష‌యంపై చ‌ర్చ‌లు కూడా కొన‌సాగుతున్నాయ‌ని తెలుస్తోంది. అన్నీ కుదిరితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌జ్జీని జ‌లంధ‌ర్ నుంచి కాంగ్రెస్ బ‌రిలో దింపే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. ఇలాంటి నేప‌థ్యంలో పంజాబ్ పీసీసీ అధ్య‌క్షుడు సిద్దూ మాజీ క్రికెట‌ర్ బ‌జ్జీతో ఉన్న ఫొటోను పోస్ట్ చేయ‌డం ప్రాధాన్యాన్ని సంత‌రించుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles