Kaushik Reddy overtakes Seniors in race for MLC post సినియర్లకు భంగపాటు.. మింగుడుపడని అధిష్టాన నిర్ణయం.?

New entrant padi kaushik reddy overtakes seniors in race for mlc post

Padi Kaushik Reddy, CM KCR, Padi Kaushik reddy nominated MLC, Governor quota, By-Elections, Huzurabad, Gutha Sukender Reddy, Kadiam Srihari, Madhusudhana Chary, Tummala Nageshwar Rao, Theegala Krishna Reddy, Huzurabad By-elections, Etela Rajender By-Elections, Etela Rajender, CM KCR, TRS, KTR, Gangula Kamalakar, Harish Rao, Telangana, Politics

TRS heavyweights like Gutha Sukender Reddy, Kadiam Srihari, Madhusudhana Chary, Tummala Nageshwar Rao and several other senior leaders were in the race to bag MLC post for the past several months. But the New Entrant Padi Kaushik Reddy is nominated for the post by the party under Governor's quota

సినియర్లకు భంగపాటు.. మింగుడుపడని అధిష్టాన నిర్ణయం.?

Posted: 08/03/2021 03:13 PM IST
New entrant padi kaushik reddy overtakes seniors in race for mlc post

హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామా చేసి రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసినప్పటి నుంచి రాష్ట్ర ప్రజలందరి దృష్టిలో పడిన నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న తరుణంలోనే ఆయన ఓ టీఆర్ఎస్ కార్యకర్తకు ఫోన్ చేసి.. ఈ సారి అధికార పార్టీ టికెట్ తనకేనని.. మీ మద్దతు కావాలని కోరుతూ చేసిన ఫోన్ కాల్ ఆడియో లీక్ కావడం.. ఆ వెనువెంటనే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం.. టీఆర్ఎస్ లో చేరడం.. ఆయనను ముఖ్యమంత్రి కేసీఆర్ సాదరంగా అహ్వానించడం అన్ని చకచకా జరిగిపోయాయి.

ఈ తరుణంలో ఆయనకే టీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ టికెట్ కూడా దక్కుతుందన్న వార్తల నేపథ్యంలో రాజకీయ విశ్లేషకుల అంచనాలకు అందకుండా సీఎం కేసీఆర్ కౌశిక్ రెడ్డిని ముందే అధికారానికి పరిచయం చేశారు. హుజారాబాద్ ఉప ఎన్నికల బరిలో నిలవడం కన్నా.. ఆయనకు రాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా ఎంపిక చేశారు. సీఎం కేసీఆర్ హుజురాబాద్ ఉపఎన్నికలకు ఎంతటి ప్రాథాన్యం ఇస్తున్నారో ఈ చర్యతో రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. టీఆర్ఎస్ పార్టీలో శాసనమండలి స్థానం కోసం ఎదురుచూస్తున్న పలువురు సీనియర్లకు దక్కని పీఠాన్ని 36ఏళ్ల పాడి కౌశిక్ రెడ్డికి దక్కడంతోనే ఇది నిరూపితమైంది.

టీఆర్ఎస్ పార్టీలోని సినియర్ నేతలు మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, మధుసుధనా చారి, తుమ్మల నాగేశ్వర రావు, తీగత కృష్ణారెడ్డి సహా పలువురు నేతలు ఇప్పటికే ఎమ్మెల్సీ పదవి కోసం ఎదురుచూస్తున్నారు. వీరంత పార్టీలోకి చేరి దాదాపుగా ఏళ్తు గడుస్తోంది. ఇక దాదాపుగా రెండు, మూడేళ్లుగా వీరు ఏ పదవులు లేకుండా పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్నారు. అయితే వీరిందరినీ కాదని కేవలం పది రోజుల ముందు (జులై 21న) పార్టీలోకి చేరిన పాడి కౌశిక్ రెడ్డి పేరును అనూహ్యంగా తెరపైకి తీసుకురావడంతో సీనియర్ నేతలకు ఇది నిజంగా మింగుడు పడని విషయమేనని విశ్లేషకులు బావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CM KCR  Padi Kaushik reddy  MLC  Governor quota  By-Elections  Huzurabad  Etela Rajender  Telangana  Politics  

Other Articles