Food delivery apps charging extra than usual ఫుడ్ డెలివరీ యాప్ లు.. బిల్లు చూస్తే గుండె గుబేలు..

Extra charges surge on customers by food delivery apps during lockdown

food delivery apps, zomato, swiggy, GST, Handling charges, Package charges, demand surge, delivery charge, Tip of delivery boys, charges double than usual. customers, lockdown surge, hotel rates, app charges

Food delivery apps charging extra than usual during Lockdown, customers charged with GST again by apps including Handling and packing charges along with delivery charges.

దడ పుట్టిస్తున్న ఫుడ్ డెలివరీ యాప్ లు.. బిల్లు చూస్తే గుండె గుబేలు..

Posted: 06/12/2021 02:54 PM IST
Extra charges surge on customers by food delivery apps during lockdown

నగర జీవనం చెప్పనలవి కాదు. పోట్ట కూటి కోసం పల్లెలు దాటి పట్టణాలకు వచ్చిన ఎందరెందరో జనం. వ్యాపారాలను విస్తరించుకుంటూ ఆయా రంగంలో పుంజుకోవాలని ఆశలతో కొందరు.. ఏదైనా చక్కని ఉపాది లభిస్తుందని ఇంకోందరు. అయితే తెలంగాణలో ఈ ఏడాది లాక్ డౌన్ అకస్మాత్తుగా విధించారు. ఇవాళ లాక్ డౌన్ పై ప్రకటన చేసిన ప్రభుత్వం మరసటి రోజు పది గంటల నుంచి లాక్ డౌన్ అని స్పష్టం చేసింది. దీంతో గ్రామాలకు వెళ్లాలని భావించిన వారు కూడా వెళ్లలేక ఇక్కడే ఉండిపోయారు. వారంలో లేదా పక్షంలో ఒక్క రోజైనా మాంసాహారం తినే అలవాటు వున్న యువత.. లేదా ఒక్క రోజైనా అరోగ్యం బాగోలేకో లేక మరో కారణంగానో హోటళ్ల నుంచి టిఫిన్ లేదా బోజనం లేదా బిర్యాని తెప్పించుకోవాలని భావించే యువకుల గుండె గుబేలు అవుతోంది.

దీంతో వారం రోజులకు ఒక్కసారైనా తెచ్చుకుని ఆరగింద్దామనుకుంటే పుడ్ డెలివరీ యాప్ లు ఎడా పెడా వాయిస్తున్న చార్జీలు.. దరిమిలా మొత్తం బిల్లు చూస్తే ఏకంగా అసలు ధరకు రెట్టింపు ధర అవుతోంది. అలా అని మానుకుని ఉండనూ లేరు. స్వయంగా హోటల్ కు వెళ్లి తెచ్చుకుందామా అనుకుంటే లాక్ డౌన్ అమల్లో వుంది. ఎక్కడ పడితే అక్కడ పోలీసులు చెక్ పాయింట్లు పెట్టి.. తనిఖీలు చేస్తున్నారు. దీంతో తప్పక అర్డర్ చేస్తున్నారు. అయితే ఇలాంటి వారి అవసరాలను అసరాగా చేసుకుని పుడ్ డెలివరీ యాప్ లు టాక్స్ లు, జీఎస్టీ, అదనపు చార్జీలు, డెలివరీ చార్జీల పేరుతో ఆకలిని తీర్చే అన్నదాతం అంటూనే అడ్డగొలుగా దోచేసుకుంటున్నారు. లాక్ డౌన్ వేళ ఎదో రుచికరంగా లాగి్దామనుకునే వారి జేబుల నుంచి ఈ యాప్ లు డబ్బును లాగేస్తున్నాయి.

హోటళ్లలో లభ్యమయ్యే ధరలకు అదనంగా ధరలు వేసిన తరువాత కూడా జీఎస్టీ అండ్ ఫ్యాకింగ్ చార్జీలు అంటూ ఒక వాయింపుతో డెలివరీ యాప్ లు కస్టమర్లను బాదేస్తున్నాయి. ఇక ఆ తరువాత సదరు ఆర్డర్ ను ఇంటి వరకు తీసుకువచ్చేందుకు డెలివరీ చార్జీలను కూడా మోపుతున్నారు. ఇక లాక్ డౌన్ వేళ ఈ వేళలో తమ డెలివరీ బాయిస్ అందరూ డెలివరీలతో పని ఒత్తిడికి గురవుతున్నారని, ఈ సమయంలో మీకు అర్డర్ కావాలంటే వారిపై అదనపు బారం పడుతుందని, అందుకుగాను మీకు రూపాయలు 25 నుంచి రూపాయలు 45 వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని హోటల్ ను ఎంపిక చేసుకోగానే ఒక సందేశం ఫోన్ కింద కనిపిస్తోంది. దీంతో ఇంతా చేశాక ఈ మాత్రం దానికోసం ఎందుకు ఆలస్యం అంటూ కస్టమర్లు డబ్బులు కట్టేస్తున్నారు.

నగరానికి చెందిన ఓ వ్య‌క్తికి హోటల్ కు వెళ్లి బిర్యానీ తినటం అలవాటు. హోటల్ కు వెళ్లి తింటే పన్నులతో కలపి బిల్లు రూ.265 చెల్లించేవాడు. పలు సందర్భాలలో ఇంటికి పార్సిల్ తీసుకున్నా బిల్లు మాత్రం రూ.265 మాత్రమే చెల్లించేవాడు. ఇక అతనికి హోటల్ యాజమాన్యం ఇచ్చే బిల్లులో జీఎస్టీ బిల్లులోనే కలిపి ఇచ్చింది. ఇక లాక్ డౌన్ లేని సమయంలో. బయటకు వెళ్లలేక, కనీసం పార్శిల్ తెచ్చుకోనూ లేక.. ఫుడ్ డెలివరీ యాప్ లను ఆశ్రయించగా.. తాను నిత్యం తినే అదే హోటల్ నుంచి అదే బిర్యానిని అర్డర్ చేసినా హోటల్ లో తాను తినే ధర కన్నా అధికంగా వుంది. సర్లే హోం డెలివరీ చేస్తున్నారు కదా... అందుకని ధర అధికంగా వుందని భావించాడు. అయితే బిర్యాని ధరను పక్కన బెడితే.. ఇక బిర్యానికి అదనంగా టాక్సులు, హ్యాండ్లింగ్, ప్యాకేజింగ్ చార్జీలు వసూలు చేశారు.

హోటల్ వారు ఇచ్చే పదార్థానికి హోటల్ వారికి ఒక పర్యాయం టాక్సులు చెల్లించి.. మరో మారు యాప్ ద్వారా తెప్పించుకుంటున్న నేపథ్యంలో మరోమారు యాప్ ద్వారా టాక్సులు చెల్లించడం ఏమీటో అతనికి బోధపడలేదు. ఇక ప్యాకేజింగ్ అండ్ హ్యాండ్లింగ్ చార్జీలు రూపేనా ఫుడ్ డెలివరీ యాప్ లు తమ నుంచి అదనంగా డబ్బును ఎందుకు తీసుకుంటున్నాయన్నది కూడా అర్థం కాలేదు. తాము చేసిన ఆర్డర్ ను యాప్ వారు హోటల్ కు పంపగానే.. హోటల్ వాళ్లు దానిని ప్యాక్ చేసి ఇస్తారు. మరి దీనికి అదనంగా ప్యాకేజింగ్ అండ్ హ్యాండ్లింగ్ చార్జీలు పేరుతో బాదడం ఎందుకనో వారికే తెలియాలి. ఒక సగటు కస్టమర్లు హోటల్ లో తిన్నా.. లేక పార్సిల్ చేసుకున్నా హోటల్ యాజమాన్యం మాత్రం ఒకే విధంగా డబ్బును తీసుకుంటోంది.

ఇక పలు హోటళ్లలో టేక్ అవే అదేనండీ పార్శిల్ తీసుకుంటే బిల్లుపై రాయితీలు కూడా ఇస్తుంటాయి. కానీ ఫుడ్ డెలివరీ యాప్ లు మాత్రం వాయించేస్తున్నాయి. ఇక అందుకు కూడా సరే అనుకునే క్రమంలో డెలివరీ చార్జీలు అదనంగా పడుతుంటాయి. ఇదిలావుండగా కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో అదనపు చార్జీలు వడ్డింపుకు కూడా ఫుడ్ డెలివరీ యాప్ లు రెడీ అయ్యాయి. దీంతో ఒక్క బిర్యాని సదరు వ్యక్తి ఏకంగా రెట్టింపు డబ్బును చెల్లించాల్సి వచ్చింది.  బిర్యాని ధరను రూ.405గా రేటు చూపించింది. అంతేకాదండోయ్..బిర్యానీ డెలివరీకి అద‌నంగా మరో రూ.22, అంతేకాదు.. ఇంకా ఇత‌ర‌ ఛార్జీల కింద రూ.40. మొత్తం బిల్లు రూ.467 క‌ట్టాల్సి వ‌చ్చింది. రెస్టారెంట్ (ప్యాకేజ్ చార్జీలు, జీఎస్టీలు, డెలివరీ చార్జీలు) మొత్తం అదనంగా మొత్తం రూ.202 చెల్లించుకున్నాడు.

ఇది బిర్యానికి వచ్చిన వాయింపు కాదు.. మీరు ఏ ఆహార పదార్థాన్ని ఫుడ్ డెలివరీ యాప్ లలో ఆర్ఢర్ చేసినా.. అదనపు మోత మాత్రం తప్పదు. ఇక ప్యాకేజింగ్‌ ఛార్జీలు, హ్యాండ్లింగ్ చార్జీలు, పన్నులు ఏ పదార్థం అర్డర్ చేసినా వడ్డీస్తుంటారు. లాక్ డౌన్ లో జేబుల్లో డబ్బులు లేక ప్రజలు నానా బాధలు పడుతుంటే.. ఈ యాప్ యాజమాన్యాలు మాత్రం వ‌సూళ్ల మీద వసూళ్లు చేసి వినియోగదారుల జేబులు ఖాళీ చేస్తున్నారు. అదనపు వసూళ్లకు సంబంధించి స్పష్టమైన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ప్ర‌భుత్వం రూపొందించ‌క‌పోవ‌డంతో హోట‌ళ్లు, రెస్టారెంట్లు ఇటువంటి దోపిడీకి పాల్ప‌డుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎవరిపైనైనా ఇలాంటి అదనపు చార్జీలు పడితే.. వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చు. బిల్లులు అధికంగా వేస్తే క‌స్ట‌మ‌ర్లు వెంట‌నే వినియోగదారుల మండలి లేక‌ తూనికలు కొలతలు, జిల్లా వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : food delivery apps  zomato  swiggy  GST  Handling charges  Package charges  demand surge  delivery charge  

Other Articles