Fake Rs 500 denomination banknotes increased 31% కొత్త 500 నోటు.. అసలుతో పోటీ పడుతున్న నకిలీ కరెన్సీ..!

Fake indian currency notes rose by 31 in 2020 21 rbi report

fake indian currency notes, fake notes, how to detect fake 500 note, fake notes india, fake currency notes, Indian currency, Currency in circulation, demonetisation, FY19, income velocity, denomination

The annual report by the Reserve Bank of India (RBI), showed that there was an increase of 31.3 per cent in counterfeit notes detected in the denomination of new Rs 500 notes as compared to the previous year.

కొత్త 500 నోటు.. అసలుతో పోటీ పడుతున్న నకిలీ కరెన్సీ..!

Posted: 06/05/2021 06:00 PM IST
Fake indian currency notes rose by 31 in 2020 21 rbi report

కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిందన్నట్లుంది కేంద్ర ప్రభుత్వం తీరు. చలామణీలో ఉన్న నకిలీ నోట్లను కట్టడి చేయడానికి యావత్ దేశ ప్రజలను నిద్రాహారాలు దూరం చేసి.. డ్యూటీలు, అఫీసులు, పనులు, వ్యాపారాలకు కూడా స్వస్తి పలికి ఏకంగా ఆరు నెలల పాటు నోటు కోసం అల్లాడిపోయేలా చేసింది. 2016 నవంబర్ 8కి ముందున్న పెద్ద నోట్లు రూ.500, రూ.1000ని రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రూ.500 నోటును తీసుకువచ్చింది. అంతటితో ఆగకుండా పెద్దనోటు అని రద్దు చేసిన రూ.1000 నోటు స్థానంలో రూ.2000 నోటును కూడా తీసుకువచ్చింది.

దీంతో బడాబాబులకు లబ్ది చేకూరిందే కానీ పేదలకు మాత్రం ప్రయోజనం లభించలేదు. ఎందుకంటే పేదలు వారి నిత్యావసరాల కోసం ప్రతీ రూపాయిని ఖర్చు పెడుతుంటారే తప్ప.. మిగుల్చుకునే వారి సంఖ్య అత్యంత తక్కువనే చెప్పాలి. ఇక ఈ నోట్లును ప్రవేశపెట్టిన నేపథ్యంలో దానిని కేవలం ప్రస్తుతానికి చెలామణిలోకి తెచ్చారని, త్వరలోనే దానిని రద్దు చేస్తారన్న వార్తలను కూడా సృష్టించారు. దీంతో ఈ నోటును తమ వద్ద భద్రపర్చుకోవడం కంటే ఖర్చు పెట్టడమే సముచితం అని బావించిన పేద, మధ్యతరగతి వర్గాలు ఎటూ తేలని డోలాయమాన పరిస్థితుల్లో దానిని భద్రపర్చుకోవడంలో అభద్రతతా భావాన్ని కనబర్చారు. దేశ ప్రజల్లో ఈ మీమాంస దాదాపు రెండేళ్ల వరకు కొనసాగింది. ఈ విషయమై పార్లమెంటులోనూ ఎంపీలు పలుమార్లు ప్రశ్నించారు.

ఇక కొత్త పెద్ద నోట్లను ప్రవేశ పెడుతున్న సమయంలో కేంద్రంలోని పెద్దలు త్వరలోనే తాము ప్రవేశ పెడుతున్న నోట్లకు నకిలీ నోట్లు రావని.. వీటిని పాకిస్తాన్ సహ ఏ దేశం కూడా ముద్రించలేదని ఘంటాపథంగా చెప్పారు. కానీ ప్రస్తుతం పరిస్థితిలో మార్పు వచ్చింది. మాట మాట్లాడితే గత 70 ఏళ్ల కాలంలో అనే కేంద్ర ప్రభుత్వ పెద్దలు.. గత 70 ఏళ్లలో ఎంత మేర నకిలీ నోట్లు చెలామణిలో వున్నాయో.. 2016 నవంబర్ 8 తరువాత వినియోగంలోకి వచ్చిన కొత్త నోట్లు ఎంత మేర నకిలీ నోట్లు వున్నాయో అర్థం చేసుకోవాల్సిన అవసరం వుంది. తాజాగా భారతీయ రిజర్వు బ్యాంకు వెల్లడించిన వివరాలు అందోళనకరంగా వుంది.

మన దేశంలో ఫేక్ కరెన్సీ విచ్చలవిడిగా చలామణి అవుతోంది. ఈ పరిస్థితిపై రిజర్వ్ బ్యాంకు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తన తాజా నివేదికలో ఆర్బీఐ కీలక విషయాలను వెల్లడించింది. మన వ్యవస్థలో దొంగనోట్లు పెరిగిపోతున్నాయని నివేదికలో ఆర్బీఐ పేర్కొంది. ముఖ్యంగా రూ. 500 డినామినేషన్ నోట్లు విపరీతంగా చలామణి అవుతున్నాయని తెలిపింది. రూ. 500 ఫేక్ కరెన్సీ ఏకంగా 31.4 శాతం మేర పెరిగిందని చెప్పింది. అయితే ఇతర డినామినేషన్ నోట్ల ఫేక్ కరెన్సీ మాత్రం తగ్గిందని తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 39,453 ఫేక్ రూ. 500 నోట్లను ఆర్బీఐ గుర్తించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian currency  Currency in circulation  demonetisation  FY19  income velocity  denomination  

Other Articles

 • Farmers protest celebrities twitter account suspended by union govt

  రైతు దీక్షలకు కనిపించకుండా చేస్తున్న కేంద్రం.?

  Jun 12 | కేంద్రంలోని బీజేపి ఒకప్పుడు సోషల్ మీడియాను విరివిగా వాడుకుని అందలాన్ని ఎక్కిందన్న విషయం తెలిసిందే. అప్పట్లో అధికారంలో వున్న యూపిఏ ప్రభుత్వంపై వ్యంగంగా పోస్టులు, వీడియోలు పెట్టి ప్రజలను అలోచింపజేసిన బీజేపి.. దేశంలోని మారుమూల... Read more

 • Extra charges surge on customers by food delivery apps during lockdown

  దడ పుట్టిస్తున్న ఫుడ్ డెలివరీ యాప్ లు.. బిల్లు చూస్తే గుండె గుబేలు..

  Jun 12 | నగర జీవనం చెప్పనలవి కాదు. పోట్ట కూటి కోసం పల్లెలు దాటి పట్టణాలకు వచ్చిన ఎందరెందరో జనం. వ్యాపారాలను విస్తరించుకుంటూ ఆయా రంగంలో పుంజుకోవాలని ఆశలతో కొందరు.. ఏదైనా చక్కని ఉపాది లభిస్తుందని ఇంకోందరు.... Read more

 • Telangana tdp chief l ramana all set to join trs

  కారు ప్రయాణానికి సిద్దమవుతున్న ఎల్ రమణ.?

  Jun 07 | తెలంగాణ తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగలనుందా.? తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన మరో కీలకమైన నాయకుడు కూడా టీఆర్ఎస్ గూటికి చేరువకానున్నాడా.? అంటే ఔనన్న సమాధానాలే వస్తున్నాయి. టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు... Read more

 • Critics on removal of harika as tourism brand ambassador

  శాఖలో సమన్వయ లోపం.. మహిళకు అన్యాయం

  Mar 09 | తెలంగాణలో ఓ మహిళకు మంత్రి పదవి లభించడానికి ఏకంగా అరేళ్ల సమయం పట్టిందని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సాక్షిగా వైఎస్ షర్మిల చేసిన తీవ్ర విమర్శలతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిదాడి చేయలేని స్థితిలోకి జారుకుంది.... Read more

 • Why are rs 7 9 counterfeit currency notes being brought to visakhapatnam

  ఏపీ పురపాలక ఎన్నికల్లో నకిలీ నోట్లు.?

  Mar 09 | ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాలకు, కార్పోరేషన్లకు జరుగుతున్న ఎన్నికలలో అభ్యర్థులు ప్రచార అంకానికి, రెండో విడత పంపీణీ అంకానికి కూడా ముగింపు పడిన నేపథ్యంలో ఇక అసలైన తుది అంకానికి మరికొన్ని గంట్లలో తెరలేవనుంది. ఈ... Read more

Today on Telugu Wishesh