Chiranjeevi turns down the ruling party proposal వైసీపీ రాజ్యసభ ఆఫర్ కు మెగాస్టార్ విముఖత

Ycp party pressurising megastar chiranjeevi to accept mp proposal

CM Jagan, AP CM YS Jagan, YS Jagan on Chiranjeevi, Chiranjeevi Rajyasabha, Megastar Chiranjeevi, Chiranjeevi, Rajya Sabha, YCP party, Congress, Pawan Kalyan, JanaSena, Nagendra Babu, Prajarajyam, Vijayawada, Andhra Pradesh, Politics

Andhra Pradesh CM YS JaganMohan Reddy is playing power games in the state to overcome the political rivals. As a part of this, the YCP party is offercing Rajya Sabha seat to Megastar Chiranjeevi and pressurising him from all corners to accept their offer.

మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ ఆఫర్.. సుముఖతకు వైసీపీ ఒత్తిడి.?

Posted: 02/19/2020 01:39 PM IST
Ycp party pressurising megastar chiranjeevi to accept mp proposal

రాష్ట్రంలో ఏకపక్ష మోజారిటీ సాధించినా.. విపక్షాల విమర్శలను అధికార వైసీపీ ప్రభుత్వం ఎదుర్కొంటూనే వుంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రాగానే రివర్స్ టెండరింగ్ తో ప్రారంభమైన వైసీపీ పాలన.. ఇసుక అక్రమాలు.. మూడు రాజధానులు, సమగ్ర రాష్ట్రాభివృద్దితో సాగుతొంది. ఈ తరుణంలో ఓ వైపు టీడీపీ నుంచి రాజకీయ విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం.. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ నుంచి కూడా రాజకీయ సవాళ్లు, విమర్శలు, అరోపణలను ఎదుర్కొంటోంది.

పవన్ కల్యాన్ జనసేన పార్టీ నుంచి ఎదురవుతున్న విమర్శలకు చెక్ పెట్టే విషయమై ఎక్కువగా దృష్టిసారించిన వైసీపీ.. ఈ విషయంలో ఒక్క దెబ్బకు మూడు పిట్టలు అన్న సూత్రాన్ని అనుసరించాలని భావిస్తోంది. పవన్ కల్యాణ్ కు చెక్ పెట్టడంతో పాటు.. కాపు కులస్థులకు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్న సంకేతాలను కూడా ఆయా సామాజికవర్గంలోకి పంపేందుకు సన్నధమవుతున్నారు. ఈ క్రమంలో తమకు అందివచ్చిన వ్యక్తి.. కోట్లాది మంది అభిమానుల శక్తి కలిగిన మెగాస్టార్ చిరంజీవి. ఆయనను తమ పార్టీలోకి అహ్వానించడం.. సముచిత స్థానం కల్పించడంతో మూడు ప్రయోజనాలను తమ ఖాతాలో వేసుకోవచ్చునని వైసీపీ ఉవ్విళ్లూరుతోంది.

పవన్ కల్యాణ్ విమర్శలు, అరోపణలకు ఆయన సోదరుడే పెద్ద చెక్ పెడతారన్నది తొలి ప్రయోజనం కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గానికి చెందిన చిరంజీవిని తాము అహ్వానిస్తే ఆ వర్గానికి తాము ప్రాధాన్యత కల్పించామన్న లబ్దిని కూడా రాష్ట్రంలో జరిగే పురపాలక, కార్పోరేషన్, పంచాయితీ ఎన్నికలలో దోహదపడుతుందని భావిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి..స్టార్ డమ్ కంటే ఎక్కువగా అభిమానుల బలం వుంది. కుల,మత,ప్రాంతాలకు అతీతంగా కదిలే ఆయన అభిమానగణాన్ని కూడా తమవైపుకు తప్పుకోవచ్చునని వైసీపీ భావిస్తోన్న మూడో ప్రయోజనం.

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన తరువాత నేరుగా అమరావతికి వెళ్లి జగన్ దంపతులను కుటుంబసమేతంగా కలసి వచ్చిన తెలుగు సినీపరిశ్రమ పెద్ద మెగాస్టార్ మాత్రమే. చంద్రబాబు సీఎం అయ్యుంటే.. సీనీ ప్రముఖులు ఆయన వద్ద క్యూ కట్టేవారని.. అదే జగన్ గెలిస్తే ఒక్కరూ రాలేదన్న విమర్శలు తెరపైకి వచ్చినా.. వైఎస్ జగన్ ను మర్యాద పూర్వకంగా కలసి తన 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి సినిమాను వీక్షించాలని కోరిమరివచ్చారు చిరంజీవి. దీంతో సినీ పరిశ్రమపై విమర్శలకు కూడా చెక్ పెట్టేశారు. అంతేకాదు ఇటీవల ఒక వేదికపై మాట్లాడిన చిరంజీవి.. తాను రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను వేర్వురుగా కలసిన సందర్భంలోనూ వారు తెలుగు సినీ పరిశ్రమ అభివృద్దికి తొడ్పడతామని తనకు హామి ఇచ్చారని కూడా చెప్పారు.  

ఈ క్రమంలో తమ రాజకీయ లబ్దితో పాటు చిరంజీవి లాంటి నేత తమ పార్టీలో వుంటే బాగుంటుందని పావులు కదుపుతోంది వైసీపీ. ఇందుకోసం ఆయనకు రాజ్యసభ సీటును కూడా ఆపర్ చేస్తోంది. అంతేకాదు కేంద్రంలోని బీజేపి ప్రభుత్వంలో తాము కలిసిన పక్షంలో ఏకంగా తమ పార్టీ నుంచి కేంద్రమంత్రి పదవిని కూడా ఇవ్వాలని.. అందుకు తొలి ప్రాధాన్యతగా చిరంజీవి పేరునే సిఫార్సు చేస్తామని కూడా ఆయన సన్నిహిత వర్గాలకు సమాచారం అందిస్తోంది వైసీపి. అయితే తమ ప్రతిపాదనకు చిరంజీవిని ఒప్పించాలని ఆయా వర్గాలపై ఒత్తడి కూడా తీసుకువస్తోందని సమాచారం.

ప్రజారాజ్యం పార్టీ అధినేతగా వున్న చిరంజీవిని కాంగ్రెస్.. తమలో కలుపుకుని.. పార్టీని కూడా విలీనం చేసుకుని పలు మంత్రి పదవులతో పాటు ఆయనకు ఇండిపెండెంట్ చార్జితో కలిగిన పర్యాటక శాఖకు కేంద్రమంత్రిగా చేసిన విషయం తెలిసిందే. ఇదే అస్త్రాన్ని మరోమారు వినియోగించి.. ముందుగా రాజ్యసభకు ఆ తరువాత కేంద్ర ప్రభుత్వంలో కలిసిన తరువాత కేంద్రమంత్రి పదవిని కూడా కేటాయిస్తామని హామిని ఇస్తున్నారు. తాము చేసిన ప్రతిపాదనకు చిరంజీవి అంగీకరించేలా చూడాలని తమకు, చిరంజీవికి వున్న అన్ని వర్గాల ద్వారా వైసీపీ ఒత్తిడి తీసుకువస్తోంది.

తొలిగా తమ పార్టీలో వున్న చిరంజీవి సామాజికవర్గానికి చెందిన పెద్దలతో ఈ మేరకు రాయభారం పంపిన పార్టీ.. విషయాన్ని కూడా తమదైన మీడియాతో ప్రశ్నింపజేసుకుని బహిర్గతం కూడా చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి బోత్సా సత్యనారాయణ.. చిరంజీవి తమ పార్టీలోకి వస్తే సాదరంగా అహ్వానిస్తామని, ఆయలాంటి ప్రముఖులకు తమ పార్టీ అధిష్టానం కచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తుందని కూడా చెప్పారు. ఓ వైపు చిరంజీవితో సన్నిహితంగా వుండే తమ పార్టీ నేతలతో పాటు చిరంజీవి సామాజికవర్గానికి చెందిన పెద్దల నుంచి కూడా ఒత్తడి తీసుకువస్తున్నారని తెలుస్తోంది.

ఈ విషయంలో తమ ప్రతిపాదనను చిరంజీవి అమోదించేలా అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్న అధికార పార్టీ ఓ వైపు సామాజిక పెద్దలు, మరోవైపు రాజకీయ పెద్దలను కూడా ఈ విషయంలో దించి.. చిరంజీవిపై ఒత్తిడి తీసుకువస్తోంది. అంతేకాదు ఇక వాణిజ్యపరంగా కూడా చిరంజీవిపై ఒత్తడిని తీసుకురావాలని అధికార పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసిందని సమాచారం. మా టీవీలో నాటి భాగస్వాములుగా వున్న సినీహీరో నాగార్జునతో పాటు, విజయవాడ వైసీపీ నేత పివీపీ సహా పలువురితో ఈ మేరకు చిరంజీవిపై ఒత్తిడిని తీసుకువస్తున్నట్లు సమాచారం. ఇటు తెలంగాణ ప్రభుత్వంలోని పలువురు పెద్దలతోనూ ఈ ప్రతిపాదనను చిరంజీవి పంపినట్లు తెలుస్తోంది.

అయితే వైసీపీ అన్ని విధాలుగా తీసుకువస్తున్న ఒత్తడిపై మెగాస్టార్ చిరంజీవి కూడా సున్నితంగానే తిరస్కరించారని ఆయన సన్నిహిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తనకు ఇంతటి గౌరవాన్ని అందించిన సినీకళామతల్లికి తాను రుణపడి వుంటానని, ఇకపై సినిమాలు తప్ప రాజకీయాల జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నానని చిరంజీవి వారికి తెలిపినట్లు సమాచారం. తన సహచర తమిళ అగ్రతారలైన రజనీకాంత్, కమల్ హాసన్ లకు రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వవద్దని సూచించిన తాను.. మళ్లీ రాజకీయాల్లోకి రానని తిరస్కరించారని తెలుస్తోంది.

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజభన జరిగిన తరువాత కేంద్రంలో బీజేపి ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా.. టీడీపీ, జనసేన పార్టీలో పొత్తు కొనసాగుతున్న తరుణంలోనే పావులు కదిపిన బీజేపి.. అప్పుడే బీజేపి పగ్గాలను అందుకోవాలని.. ఫలితంగా ఎంపీ పదవిని అందిస్తామని చెప్పినా.. ఆయన తిరస్కరించారని వార్తలు వచ్చాయి. ఇక తాజాగా వైసీపీ ప్రతిపాదనను కూడా మెగాస్టార్ తిరస్కరించారు. అధికారం కోసం అంగలార్చే నేతలు అనేకమంది వున్నా.. దాని కోసమే పార్టీలు మారినా.. పదవుల పందేహంలో ఓట్లను నోట్లకు కొన్నా.. చిరంజీవి మాత్రం తాను చిత్రసీమలోనే కోనసాగతూ అభిమానులకు అండగా వుండటమే ఇష్టమని స్పష్టం చేయడం ముదావహం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan  Chiranjeevi  Rajya Sabha  YCP party  Congress  Pawan Kalyan  JanaSena  Nagendra Babu  Andhra Pradesh  Politics  

Other Articles