RBI Scrapping Rs 2000 Notes & Releasing Rs 1000? కొత్త రూ.1000 నోటు.. ప్రచారం వెనుకన్నదెవరు..?

Rbi scrapping rs 2000 notes releasing rs 1000

Reserve Bank of India, 2000 Note in market, 2000 notes ban, 2000 notes news today, 2000 notes ban news today, rbi on 2000 rupee note, rbi news on 2000 rupee note, Latest News, Latest Business News, Latest India News, Viral newws, Viral message, Crime

A message which has spread like wild fire on social media and WhatsApp, states that the Reserve Bank of India is all set to discontinue the Rs 2000 currency note, but doubts araise there is conspiracy behind this viral message.

రూ.2000 నోటు రద్దు.. ప్రచారం వెనుకున్నదెవరు..?

Posted: 10/12/2019 01:44 PM IST
Rbi scrapping rs 2000 notes releasing rs 1000

కేంద్రంలోని ప్రదాని నరేంద్రమోడీ ప్రభుత్వం మరోమారు షాకింగ్ నిర్ణయం తీసుకోబోతోందా.? ప్రధాని నిర్ణయాల మేరకు భారతీయ రిజర్వు బ్యాంకు సైతం దేశంలోని బ్యాంకులకు అదేశాలను జారీ చేసిందా.? నవంబర్ 8 2016లో పెద్ద నోట్ల రద్దుతో సాహసోపేత నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ మళ్లీ ఇప్పుడు అలాంటి నిర్ణయమే తీసుకున్నారా? రూ.2,000 నోట్లపై నిషేధం విధించనున్నారా? ఇక రద్దు చేసిన అప్పటి పెద్ద నోటు రూ. 1000ని కూడా సరికొత్త ప్రింటింగ్, సరికొత్త డిజైన్ తో మళ్లీ చలామణిలోకి తీసుకువస్తున్నారా.? అన్నఅనుమానాలు కలుగుతున్నాయా.?

కేంద్రంలో బీజేపి నేతృత్వంలోని ఎన్టీయే ప్రభుత్వ హయాంలో నవంబర్ 8, 2016న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సాహసోపేత నిర్ణయంతో నోట్ట రద్తును చేపట్టారు. అయితే ఈ నోట్ల రద్దుకు ప్రధానంగా ఆయన నాలుగు కారణాలను వివరించారు. దేశంలో అవినీతిని రూపుమాపడం.. నల్ల కుబేరుల అక్రమ ధనాన్ని వెలికి తీయడం, ఉగ్రవాద సంస్థలకు అందుతున్న ఇండియన్ కర్సెన్సీని అడ్డుకోవడం.. లాంటివి అందులో ప్రధానంగా పేర్కోన్నారు.

అయితే తాజగా మరోమారు మోడీ ప్రభుత్వం రూ.2000 నోట్లను రద్దు చేస్తోందని, రద్దు చేసిన రూ.1000ని మళ్లీ కొత్తగా చలామణిలోకి తీసుకురాబోతున్నారన్న ప్రచారం సోషల్ మీడియా వేదికగా జోరందుకుంది. 2020 జనవరి నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది. ప్రజలు వారి వద్ద ఉన్న వారి వద్ద ఉన్న రూ.50,000 వరకు విలువైన రూ.2,000 నోట్లను 10 రోజులకు ఒకసారి బ్యాంకులకు వెళ్లి మార్చుకోవచ్చు. ఇక రూ.2,000 నోట్ల స్థానంలో కొత్తగా మళ్లీ రూ.1,000 నోట్లను చెలామణిలోకి తీసుకువస్తుందన్న ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది.

భారత్ లాంటి దేశంలో నోట్ల రద్దు నిర్ణయం నిజంగా సాహసమే. కానీ ఇలాంటి సాహసాన్ని కొందరు తప్పుడు ప్రచారంతో ప్రజలు అందోళన చెందుతున్నారు. 2016 నవంబర్ నోట్ల రద్దు గాయలను ఇంకా ప్రజలు మర్చిపోలేదు. అప్పట్లో నిద్రాహారాలు మాని రాత్రింబవళ్లు బ్యాంకుల ఎదుటు, ఏటీయం కేంద్రాల ఎదుట క్యూ లైన్లలో నిలబడి అలసి సోలసి రెండు వేల రూపాయలను విత్ డ్రా చేసుకున్న రోజులను మర్చిపోలేదు. మన డబ్బును మనం తీసుకునేందుకు ప్రభుత్వ పెత్తనమేంటని కూడా ప్రజల నుంచి ప్రశ్నలు వెల్లువెత్తాయి.

దీంతో తాజాగా మరోమారు అలాంటి చర్యలకే ప్రభుత్వం పూనుకుంటుందన్న వార్తల నేపథ్యంలో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇదేం ప్రభుత్వం.. అంటూ శాపనార్థాలు పెడతున్నారు. అన్నింటికీ తనది భరోసా అంటూ నిలబడ్డ ప్రధాని మోడీని కూడా తూలనాడుతున్నారు. మూడేళ్లు కూడా పూర్తికాకుండానే మళ్లి నోట్ల రద్దు చేపడతారా.? అంటూ ఆగ్రం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలను కీలుబోమ్మలను చేసి అడిస్తున్న ప్రభుత్వ పెద్దలు.. పాలకులు.. ప్రజలతో పాటు క్యూ లైన్లలో నిలబడి డబ్బును తీసుకుంటే వారికి కష్టనష్టాలేంటో తెలుస్తాయని ఫైర్ అవుతున్నారు.

దీంతో రంగంలోకి దిగిన పెద్ద నోట్ల రద్దు అంశంపై స్పందించింది. ‘‘మా వైపు నుంచి రూ.2,000 నోట్ల రద్దుకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ లేదు. మేం తెలియజేయాలనుకున్న ప్రతి అంశం వెబ్‌సైట్‌లో ఉంచుతాం. సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వార్తలు నమ్మవద్దు’’ అని ఆర్‌బీఐ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ సీజీఎం యోగేశ్ దయాల్ వివరణ ఇచ్చారు. ఇంతటితో తమ పూర్తి అయ్యిందని ఆర్బీఐ అధికారులు చేతులు దులుపేసుకున్నారు.

అయితే దేశ అర్థికపురోగతి మందగమనం దిశగా సాగుతున్న క్రమంలో.. దేశప్రజలు పూర్తిగా కలవరానికి గురైయ్యే ఫేక్ న్యూస్ ను ప్రచారంలోకి తీసుకువచ్చిన వారెవ్వరు.. అసలు ఈ తరహా పోస్టింగ్ ల వెనుకు ఉన్నదెవరు..? వారికి దీనితో ఒనగూరే లాభమేంటి అన్న దిశగా అటు ఆర్బీఐ అధికారులు కానీ, ఇటు పాలకులు కానీ కనీసం పోలీసులు కానీ దీనిపై చర్యలకు పూనుకున్న దాఖలాలు లేవు. ఇలానే వదిలేస్తే దేశీయ అర్థిక వ్యవస్థను దెబ్బతీసే మరో పోస్టింగ్ తో అగంతకులు నెట్టింట్లో సందడి చేసి ప్రజలను అందోళనకు గురిచేసే అవకాశాలు లేకపోలేదు.

ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో అత్యంత వేగంగా వైరల్ అవుతున్నాయి. కేవలం అకతాయిలే ఈ పనులను చేస్తున్నారంటే అది నమ్మశక్యం కాదు. దీని వెనుక ఎదో బలమైన ప్రయోజనం ఉందన్న అనుమానాలున్నాయి. కోందరు బిగ్ షాట్స్ పన్నిన వ్యూహంలా ఇది కనిపిస్తోందన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రజల వద్దనున్న రూ.2000 నోట్లను బ్యాంకులకు డిపాజిట్ చేయడంతో.. అక్కడి నుండి వాటిని తమ ఖజానాకు తరలించేందుకు బడాబాబులు పన్నిన ప్లాన్ లో భాగంగానే ప్రచారం జరిగిందా.? అన్న అనుమానాలు వున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RBI  Rs 2000 note  New Rs 1000 note  viral news  viral message  social media  Gossips  

Other Articles