KCR poaches yet another Cong MLA.! జంప్ జిలానీ: కారెక్కనున్న చిరుమర్తి లింగయ్య

Nakrekal mla chirumarthi lingaiah likely to join ruling trs

Another defection into TRS, TRS Operation Akarsh, Congress MLA to join TRS, congress mla Chitumarthi Lingaiah to join TRS, TRS, Congresss, Nakrekal, Chirumarthi Lingaiah, Komati Reddy Rajagopal Reddy, Nalgonda, Telangana, politics

Congress MLA from Nakrekal Chirumarthi Lingaiah may join TRS. According to the rumours doing rounds in the political circles, Lingaiah is all set to leave Congress soon.

జంప్ జిలానీ: కారెక్కనున్న చిరుమర్తి లింగయ్య

Posted: 03/08/2019 09:46 PM IST
Nakrekal mla chirumarthi lingaiah likely to join ruling trs

లోక్ సభ ఎన్నికల్లో పరువు నిలుపుకోవాలని ఆరాటపడుతున్న కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు... కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి టీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఈ షాక్ నుంచి కోలుకోకముందే కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. నకిరేకల్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య... టీఆర్ఎస్‌లో చేరడం ఖాయమైందని వార్తలు వినిపిస్తున్నాయి.

నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ కీలక నేతలైన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రధాన అనుచరుడైన చిరుమర్తి లింగయ్య...నిన్నటి నుంచి అజ్ణాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆయనతో పాటు ఆయన సిబ్బంది ఫోన్లు కూడా ఆఫ్ చేసి ఉన్నట్టు సమాచారం. టీఆర్ఎస్‌లో చేరాలని కొద్దిరోజుల క్రితమే నిర్ణయించుకున్న లింగయ్య... ఇందుకోసం జిల్లా మంత్రి జగదీష్ రెడ్డితో చర్చలు జరిపారని తెలుస్తోంది.

మరోవైపు లింగయ్య పార్టీ మారాలని నిర్ణయించుకోవడం బాధాకారమని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... ఆయన తమను ఈ రకంగా మోసం చేస్తాడని అనుకోలేదని అన్నారు. తమకు చెప్పకుండానే ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ముగ్గురు మాత్రమే విజయం సాధించగా... అందులో ఒకరైన చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకోవడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  Congresss  Nakrekal  Chirumarthi Lingaiah  Komati Reddy Rajagopal Reddy  Nalgonda  Telangana  politics  

Other Articles