Priyanka Gandhi to contest loksabha elections.? లోక్ సభ ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ.?

Priyanka gandhi to contest loksabha elections from raibareli

Priyanka Gandhi Vadra, Lok sabha Elections, Rai Bareli, General secretary, Uttar Pradesh, General secretary, General Elections, Rahul Gandhi, Uttar pradesh East, Congress, Rai Bereli MP seat, Lok Sabha Elections, Congress, Virbhadra Singh, gulam nabi azad, Haryana, politics

The Congress appointed Priyanka Gandhi the party’s general secretary for the Uttar Pradesh East region, in a move that is being seen as her official entry into active politics and party may make her contest for lok sabha elections.

రాయబరేలీ నుంచి లోక్ సభ ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ.?

Posted: 01/23/2019 07:45 PM IST
Priyanka gandhi to contest loksabha elections from raibareli

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయం రాజకీయ విశ్లేషకుల అంచనాలను మించిపోయింది. గత ఎన్నికల ముందు ఇలాంటి సంచలనాలకు తెరలేపిన బీజేపిని రానున్న లోక్ సభ ఎన్నికలలో ధీటుగా ఎదుర్కోనేందుకు అస్త్రశస్త్రాలను సిద్దం చేస్తుంది. తమ అమ్మలపోదిలోని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించనుంది. యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీని కీలక బాధ్యతలు అప్పగించి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురానున్నారు.

ఆమెకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర తూర్పు ప్రాంతానికి జనరల్ సెక్రటరీగా నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. 2019 ఫిబ్రవరి మొదటి వారంలో బాధ్యతలు తీసుకోనున్నారు. ఇప్పటి వరకు తల్లి సోనియా, అన్నయ్య రాహుల్ గాంధీ నియోజకవర్గాలు అయిన రాయబరేలి, అమేధి లోక్ సభ నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు, అభివృద్ధిని మాత్రమే పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇప్పుడు పార్టీ అధికార ప్రతినిధిగా రాబోతున్నారు.

ప్రియాంక గాంధీ మంచి వక్త. ప్రజల్లో మంచి ఇమేజ్ ఆమెకు ఉంది. నాయనమ్మ ఇందిరా గాంధీని పోలి ఉండటంతో సోనియా, రాహుల్ కంటే కూడా ఆమె ప్రజలకు చాలా దగ్గరయ్యారు. ఇంతకు ముందు చాలా సార్లు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలంటూ ఎంత మంది ఆహ్వానించిన సున్నితంగా తిరస్కరించారు. అన్నయ్య పూర్తిగా పార్టీ బాధ్యతలు స్వీకరించాక, రాహుల్ తోడుగా ఉండేందుకు ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారు. అయితే ప్రియాంక గాంధీని తన తల్లి నియోజవర్గమైన రాయ్ బరేలి నుంచి పార్లమెంట్ స్థానానికి పోటీకి దించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

సోనియాగాంధీ అనారోగ్యంగా పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం రాహుల్ ఒక్కరే పార్టీ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఎన్నికల వేళ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ రావడంపై పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రియాంక తన తల్లి, సోదరుడి సొంత నియోజకవర్గాలైన రాయ్‌బరేలి, అమేథి ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల ప్రచారాల్లో ఆమె పాల్గొన్నారు. చాలా కీలక బాధ్యతలను ప్రియాంక గాంధీకి అప్పగించారని, యూపీ తూర్పు ప్రాంతాన్నే కాకుండా ఇతర ప్రాంతాల్లోను ఆమె ప్రభావం కనిపించనుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఆశాభావం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles