gvl targets congress on ap special status ఏపీకి ప్రత్యేక హోదా ఎలా ఇస్తారు: జీవీఎల్

Gvl narasimha rao on andhra pradesh special status

GVL Narasimha Rao, BJP spokes person GVL, Rajya sabha member GVL, GVL Narasimha Rao targets Congress, GVL On Andhra Pradesh Special status, AP special status, congress, raghuram rajan, Andhra Pradesh, Politics

BJP spokes person GVL Narasimha Rao alleges congress conspiracy behind AP special status. The Rajya sabha member also states that Raghuram Rajan report suggested not to include states like AP in special status category.

జీవీఎల్ రంధ్రాన్వేషణ: హోదాకు కాంగ్రెస్ కొర్రి..

Posted: 11/26/2018 05:32 PM IST
Gvl narasimha rao on andhra pradesh special status

కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల తరువాత బీజేపి రంధ్రాన్వేషణ చేసి.. ఓ కొత్త విషయాన్ని ప్రజల ముందకు తీసుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం, అసలు ప్రత్యేకహోదా అంశాన్ని రాష్ట్ర పునర్విభజన బిల్లులో కూడా కాంగ్రెస్ పొందుపర్చకపోవడానికి మరో కారణం వుందని బీజేపీ అధికార ప్రతినిధి, పార్లమెంటు సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అరోపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హాదా రాకుండా అడ్డుపడిన కాంగ్రెస్ పార్టీయే కుట్ర చేసిందని ఆయన కొత్త విషయాన్ని తెరపైకి తీసుకువచ్చారు.

ఆ కారణమేటంటే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంపై 2013లో అప్పటి రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ నేతృత్వంలో ఓ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసిందన్నారు. కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఇవ్వడం ఆమోదనీయం కాదని రఘురాం రాజన్ సెప్టెంబర్ 23న నివేదిక ఇచ్చారని పేర్కొన్నారు. దీని ఆధారంగానే ప్రత్యేకహోదా డిమాండ్ ను నిర్వీర్యం చేయాలన్న కుట్రకు కాంగ్రెస్ తెరతీసిందన్నారు. అందుకనే ఈ అంశాన్ని వారు రాష్ట్ర పునర్విభజన బిల్లులో కూడా పెట్టలేదని పేర్కోన్నారు.

ఇక ఎన్నికల తరుణంలో మరోమారు ఆంధ్రులను మోసం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, సోనియా గాంధీ మరోసారి చేతులు కలుపుతున్నారని ఆరోపించారు. రఘురాం రాజన్ ద్వారా ప్రత్యేక హోదాకు శఠగోపం పెట్టించారనీ, ఆంధ్రులను మోసం చేస్తూ దొంగనాటకం ఆడుతున్నారని దుయ్యబట్టారు. అయితే అన్యాయానికి గురైన అంధ్రప్రదేశ్ కు న్యాయం చేయాలన్న ఉద్దేశ్యంతో కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం పునర్విభజన చట్టంలో లేకపోయినా రాష్ట్రానికి ప్యాకేజీ రూపంలో ఆర్థిక సాయం చేసిందనీ అన్నారు

ప్రత్యేక హోదా అంటే ఏమిటి? ఏయే ప్రయోజనాలు చేకూరుస్తారు? అనే విషయాలపై రాహుల్ గాంధీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంతవరకు బాగానే వున్నా.. జీవీఎల్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ వాసులు మండిపడతున్నారు. రాజకీయ లబ్ది కోసమే బీజేపి నాలుగున్నరేళ్ల పాలన తరువాత తమపై తప్పులేకుండా ఏదో నివేదికను అడ్డువుందన్న విషయాన్ని బీజేపీ తెరపైకి తీసుకువస్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కోంటున్నారు.

ఇన్నాళ్లు ఇదే విషయాన్ని బీజేపి ఎందుకు స్పష్టం చేయలేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక అటు ఉభయసభల్లోనూ మెజారిటీ వున్న బీజేపి ఏపీకి నిజంగా చిత్తశుధ్దితో న్యాయం చేయాలని భావిస్తే.. ప్రత్యేకహోదా ఇవ్వడం చిన్న విషయమని వారు భావిస్తున్నారు. చట్టల్లో ఏ అడ్డంకులు వున్నా తమకు చట్టసభల్లో వున్న బలంతో సవరణలు చేసి కూడా హోదాను ఇచ్చేవారని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఎలా ఇస్తారని ఆయన కాంగ్రెస్ ను ప్రశ్నించడం, ఇక హోదా వల్ల చేకూరే ప్రయోజనాలను చెప్పాలని రాహుల్ ను ప్రశ్నించడంలోనే ఆయనకు ఏపీ మీద బీజేపి పార్టీకీ, కేంద్రప్రభుత్వానికి వున్న చిత్తశుద్ది కనబడుతుందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GVL Narasimha Rao  BJP  AP special status  congress  raghuram rajan  Andhra Pradesh  Politics  

Other Articles