Had gali janardhan reddy fled to abroad దేశం విడిచి పారిపోయిన గాలి జనార్థన్ రెడ్డి.?

Had gali janardhan reddy fled to abroad suspects ccb

Janardhan Reddy, Mining Baron, abroad, enforcement directorate, vijay mallya, laltith modi, central crime branch, ccb, secret lockers, ali khan, perasonal assistant, bribery case, Ballerys mining baron, Karnataka Police, BJP former minister, crime

Central Crime Branch (CCB), which is right now searching to nab mining baraon, former minister, BJP leader Gali Janardhana Reddy, is suspecting that had he fled to abroad like bank defaulters.

దేశం విడిచి పారిపోయిన గాలి జనార్థన్ రెడ్డి.?

Posted: 11/08/2018 03:40 PM IST
Had gali janardhan reddy fled to abroad suspects ccb

దేశానికి చెందిన అర్థిక నేరగాళ్లు బాటలోనే మైనింగ్ బారన్ కూడా పయనించాడా.? అంటే అవునన్న అనుమానాలే కలుగుతున్నాయి. మద్యం వ్యాపార దిగ్గజం విజయ్ మాల్యా, నగల వ్యాపారి నిరవ్ మోదీల మాదిరిగానే కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ దిగ్గజం, బీజేపి నేత గాలి జనార్థన్ రెడ్డి కూడా వారినే ఫాలో అవుతూ.. అంచం ఎరచూపి అధికారిని లోంగదీసుకున్న కేసు నుంచి కాకుండా ఏకంగా పలు కేసుల్లో చిక్కుకోవడం ఇష్టం లేక  దేశం దాటి పారిపోయారా.? అన్న అనుమానాలు వ్యక్తం అవతున్నాయి.

విదేశాలకు నిధులను మళ్లించిన కేసులో ఓ సంస్థను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ జాబితా నుంచి తప్పించేందుకు.. ఈడీకి చెందిన ఓ అధికారితో రూపాయలు 18 కోట్ల రూపాయల మేర ఒప్పందాలు కుదుర్చుకుని.. వాటిలో తొలివాయిదాగా రూపాయలు కోటి ఇచ్చారన్న అభియోగాల నేపథ్యంలో అతనిపై కేసు నమోదైంది. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర నేర విభాగం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి అయనను అరెస్టు చేసేందుకు అన్వేషణ కోనసాగిస్తున్నాయి.

ఈడీ విభాగంలోని ఓ ఉన్నతాధికారిని లొంగదీసుకుని ఏకంగా కోటి రూపాయలు లంచం ఇచ్చారని అభియోగాలు నమోదయ్యాయి. దీంతో గాలి జనార్థన్ రెడ్డి కోసం అన్వేషణకు పోలీసులు రంగంలోకి దిగి అయన ఇంటిలో తనిఖీలు చేయగా, ఆయన ఇంట్లో గొడల మధ్య రహస్య లాకర్లు వున్నాయని కూడా అధికారులు గుర్తించి వాటిలో వేటిని దాచారన్న విషయమై కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే రెండు రోజులు గడుస్తున్నా గాలి జనార్థన్ రెడ్డి అచూకీ మాత్రం ఇప్పటికీ తెలియరాలేదు. దీంతో గాలి జనార్థన్ రెడ్డి కూడా అర్థిక నేరస్థుల మాదిరిగానే విదేశాలకు పారిపోయారా అన్న అనుమానాలు అటు అధికారులతో పాటు ఇటు కర్ణాటక, మరీ ముఖ్యంగా బళ్లారి ప్రాంత ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles