Jana Sena to capture Guntur West seat.? జనసేన ఖాతాలో గుంటూరు వెస్ట్..? అదే కారణం..

Jana sena to capture guntur west seat

Jana Sena, janasena, power star, pawan kalyan, JSP, JSP third alternative party, new political party, modugula venugopal reddy, TDP, Lella Appi Reddy, YSRCP, Corruption allegations, guntur west, jana sena guntur, andhra pradesh, politics

Jana Sena, A Third alternative Political party for the people of andhra pradesh is getting good response from all catagories of people in the state, as the power star pawan kalyan party is to contest direct election for the first time. Especially in guntur west seat jana sena is on winning streak.

జనసేన ఖాతాలో గుంటూరు వెస్ట్..? అదే కారణం..

Posted: 10/01/2018 07:54 PM IST
Jana sena to capture guntur west seat

రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయంగా వచ్చిన జనసేన పార్టీ.. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చాపకింద నీరులా ప్రచారం చేసుకుంటూ.. తమ ఎన్నికల మానిఫెస్టోను కూడా అన్ని వర్గాల ప్రజల్లోకి తీసుకువెళ్తుంది. ఈ క్రమంలో ఓ వైపు బలమైన పునాదులు వేసుకుంటూ పటిష్టంగా తయారవుతూనే.. మరోవైపు ఆ పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఎక్కడ పర్యటించినా.. అక్కడి సమస్యలను అవగతం చేసుకుంటూనే వున్నారు.

అదే సమయంలో ఆయన అక్కడి రాజకీయ పరిణామాలను కూడా అంచనా వేస్తూ.. తమ అభ్యర్థులుగా ఎవర్ని బరిలో దింపితే బాగుంటుందన్న విషయాలపై కూడా జనసేన రాజకీయ యాక్షన్ కమిటీతో కూడా చర్చలు జరుపుతూ ముందుకు సాగుతున్నారు. అయితే ఈ దశలో ఆయన ప్రచారం లేకున్నా.. జనసేన ఖాతాలోకి వెళ్లే ఖచ్చితమైన స్థానాలు రాష్ట్రవ్యాప్తంగా వున్నాయన్న టాక్ కూడా వస్తుంది. అయితే వాటిలో గుంటూరు వెస్ట్ స్థానం కూడా ఒకటని అక్కడి ప్రజానాడి స్పష్టం చేస్తుంది.

ఈ ప్రాంతం నుంచి అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గత ఎన్నికలలో గెలుపొందారు. నల్లేరుపై నడకగా రావాల్సిన విజయం చావు తప్పి కన్ను లొట్టపోయిందన్నట్లుగా గెలుపును చవిచూశారు. అది కూడా జనసేన మద్దతు పలకలిన తరువాత.. పవన్ ప్రచారం చేసిన క్రమంలో ఈ విజయం ఆయనను వరించింది.. లేదంటే ఏం జరిగేదో మనం ఊహించుకోవచ్చు.

అయితే ఇంతలా తనకు ప్రజా వ్యతిరేకత వుందని తెలుసుకుని ప్రజా సమస్యల పరిష్కరానికి పెద్దపీట వేసి.. తనపై వున్న వ్యతిరేకతను చల్లార్చుకోవాల్సిన మాజీ మంత్రివర్యులు.. ఇక మరోసారి గెలుపోటములు ఏవరు చూడవచ్చారని అనుకున్నారో ఏమో కానీ.. ఏకంగా అవినీతి అరోపణలకు కేంద్రబింధువుగా మారారు. అంతేకాదు తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని క్లబ్ లను నిర్వహిస్తూ సంపాదనకే అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని విమర్శలు కూడా వున్నాయి.

ఈ క్రమంలో ఆయనకు ఈ ధఫా టీడీపీ టిక్కెట్ దక్కడం కష్టమే అన్న వార్తలు వున్నాయి. ఒకవేళ పార్టీ టిక్కెట్ లభించినా.. ఆయన గెలుపు మాత్రం అంత సులువు కాదని గుంటూరు వెస్ట్ ప్రజలు చర్చించుకుంటూ.. పలు టీవీ షోలలో బహిరంగంగానే వ్యతిరేకతను వెల్లగక్కుతున్నారు. దీంతో ఈ సీటు టీడీపీ ఖాతా నుంచి జారిపోతుందన్న అంచనాలు వినబడుతున్నాయి. ఇదే సమయంలో ఈ స్థానం నుంచి బరిలో నిలుస్తారని వార్తలు వినిపిస్తున్న విపక్ష పార్టీ వైసీపీ నేత లెళ్ల అప్పిరెడ్డిది అదే పరిస్థితి.

ప్రస్తుతం గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి సమన్వయకర్తగా కొనసాగుతున్న నేళ్ల ఆప్పిరెడ్డిపై కూడా అవినీతి అరోపణలు వున్నాయన్న వార్తలు వినబడుతున్నాయి. దీంతో ఈ స్థానంలో పాగా వేసేందుకు తమ పార్టీ నుంచి అవినీతి మకిలీ లేని స్వచ్ఛమైన నేతను జనసేన బరిలో నిలిపితే అదే చాలునని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. దీంతో గుంటూరు పశ్చమంలో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారనున్నట్లు సమాచారం.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులు అధిక సంఖ్యలో వున్న ఈ స్థానంలో ఎన్నికల వేడి అభ్యర్థిని ఎవరన్నది తెలియనప్పటికీ ముమ్మర ప్రచారంతో జనసేన కార్యకర్తలు దూసుకెళ్తున్నారు. విపక్షాల అభ్యర్థులకు ధీటుగా తమ అభ్యర్థిని నిలిపిన పక్షంలో విజయాన్ని అందిస్తామని వారు పేర్కోంటున్నారు. పార్టీకి తొలి విజయాన్ని గుంటూరు పశ్చిమం నుంచే అందిస్తామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Jana Sena  pawan kalyan  JSP  TDP  YSRCP  Corruption  guntur west  andhra pradesh  politics  

Other Articles