Vangaveeti Group To Join Jana Sena? ఆత్మగౌరవ నినాదంతో జనసేనలోకి వంగవీటి రాధా..?

Vangaveeti radha group to join jana sena

Vangaveeti Radha to join janasena, vangaveeti radha janasena, vangaveeti radha pawan kalyan, vangaveeti radha, Vijayawada Central. Kapu Icon, Vangaveeti Ranga, Gautham Reddy, YSR Congress, TDP, JanaSena, Pawan Kalyan, Chandrababu, YS Jagan Mohan Reddy, Malladi Vishnu, PrajaRajyam, Andhra pradesh, Politics

Prominent Kapu leader of Vijayawada Vangaveeti Radhakrishna, son of popular leader late Vangaveeti Mohana Ranga, is most likely to join Jana Sena Party floated by power star Pawan Kalyan.

ఆత్మగౌరవ నినాదంతో జనసేనలోకి వంగవీటి రాధా..?

Posted: 09/18/2018 04:26 PM IST
Vangaveeti radha group to join jana sena

బెజవాడ వైసీపీలో అసమ్మతి సెగ రాసుకుంది. విజయవాడ సెంట్రల్ సీటును కాంగ్రెస్ నుంచి వలసవెళ్లిన వెసీపీ నేత మల్లాది విష్ణుకు కేటాయించేందుకు ఆ పార్టీ అధిష్టానం సంకేతాలను జారీ చేసిన నేపథ్యంలో ఇక ఆ పార్టీలో మనజాలలేనని భావిస్తున్న వైసీపీ నేత వంగవీటి రాధా వర్గీయులు త్వరలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు చెందిన పార్టీ జనసేన తీర్థం తీసుకోనున్నారా.? అంటే ప్రస్తుత పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి. త్వరలోనే ఆయన జనసేనలో చేరనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

విజయవాడ సెంట్రల్ సీటుపైనే ఆశలు పెట్టుకుని వేచిచూస్తున్న వంగవీటి రాధాను కాదని మల్లాధి విష్ణుకు బాద్యతలను అప్పగించిన తరుణంలో క్రితం రోజున ఆయన అనుచరులు, పార్టీ పదవులకు రాజీనామా చేశారు. విజయవాడలో జరిగిన పార్టీ సమావేశంలో ఈ మేరకు సంకేతాలు వెలువడిన క్రమంలో ఆ సమావేశం నుంచి రాధా మధ్యలోనే వెళ్లిపోగా, విషయం తెలుసుకున్న కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సోమవారం ఆయన నివాసానికి చేరుకుని హల్ చల్ చేశారు. పార్టీలో చేరినప్పటి నుంచి ఆ సీటు నుంచే బరిలోకి దిగాలని రాధా భావిస్తుంటే.. విష్ణుకు పగ్గాలు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు.

వైసీపీ అధినేత జగన్ తీరుపై రాధా వర్గీయులు మండిపడుతున్నారు. పార్టీని, నమ్ముకుని వస్తే నట్టేట ముంచుతారా అంటూ.. ఇదేనా నీతి, నిజాయితీ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో నిరసనలు, రాజీనామాలతో పార్టీ ఉనికిని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తే.. మీకే నష్టమని కూడా వంగవీటి రాధాకు వైసీపీ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. అయినా రాధా అనుచరులు వెనక్కు తగ్గడం లేదు. రాధా సోదరుడు, ఉయ్యూరు కౌన్సిల్, జిల్లా ఫ్లోర్ లీడర్ వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్ వైసీపీకి రాజీనామా చేశారు. మరికొందరు కూడా పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

దీంతో ఇక వైసీపీ అధిష్టానం కూడా అంతే పట్టుదలతో వ్యవహరించడం మొదలుపెట్టింది. సెంట్రల్ సీటు విషయంలో వైసీపీ, వంగవీటి కుటుంబాల మధ్య సయోధ్య కుదరడం లేదు. సెంట్రల్ సీటు విషయంలో ప్రతిపక్ష వైసీపీ అధిష్టానం వెనక్కి తగ్గడం లేదు. బెజవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయ కర్తగా పార్టీ బాధ్యతలను మల్లాది విష్ణుకు అప్పజెప్పడానికే సుముఖత వ్యక్తం చేస్తుంది. దీంతో వంగవీటి రాదా వర్గం వైసీపీకి షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకోనుంది.

ఇప్పటికే రంగారాధా మిత్రమండలికి చెందిన కార్యకర్తలను సమన్వయపర్చిన రాధా అనుచరులు వారితో రాధా భవిష్యత్తు నిర్ణయాన్ని చర్చించే పనిలో పడింది. ఈ క్రమంలో టీడీపీ కూడా ఆయనను పార్టీలోకి లాగేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినా.. సెంట్రల్ సీటుపై మాత్రం హామీ ఇచ్చేందుకు వెనకాడుతుంది. అయితే విజయవాడలో అత్యంత ప్రేక్షకాధరణ, కార్యకర్తల ఫాలోయింగ్ వున్న పవన్ కల్యాన్ పార్టీలో చేరాలని కొందరు అనుచరులు సూచిస్తున్నారని సమాచారం.

జనసేనలో చేరితే తమకు కలసి వస్తుందని, ఆ పార్టీ నుంచి సెంట్రల్ సీటు కూడా హామీ లభిస్తుందని కొందరు రాధా అనుచరులు ఆయనకు సూచిస్తున్నాట్లు సమాచారం. విజయవాడ సెంట్రల్ సీటు కోసం వేచిచూస్తున్న తనను కాదని ఇతరులకు సీటును కేటాయిస్తే.. తమ ఆత్మగౌరవం దెబ్బతినిందని అందుకనే పార్టీని వీడి వెళ్తున్నామన్న సంకేతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి.. తరువాత జనసేనలోకి చేరుదామన్న రాధా అనుచరులు భావిస్తున్నారని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles