PM Modi objectionable remarks not a good sign for citizens ప్రధాని మోదీ చమత్కారం వికటించింది..

Why pm modi always prefers objectionable remarks on opposition

PM MODI, prime minister, democratic country, India, modi controversial statements, modi objectionable statements, Man Mohan singh, Pak supari, Pakistan, Chai wala PM, budget sessions, Congress, BK Hariprasad, Rajya Sabha Chairman, M Venkaiah Naidu, Rajya Sabha deputy Chairman, PM Narendra Modi, controversial statements, objectionable comments, Harivansh Narayan Singh, expunge, dignity of RS, Politics

PM Modi's remarks in all aspects on the opposition sends objectionable signals to the citizens of India. Recently his remarks in Rajya Sabha were expunged by chairman M Venkaiah Naidu after they were found to be 'objectionable'.

వికటించిన ప్రధాని చమత్కారం.. రికార్డుల నుంచి తొలగిన వైనం..

Posted: 08/11/2018 02:33 PM IST
Why pm modi always prefers objectionable remarks on opposition

ప్రధాని నరేంద్రమోదీ ప్రజల ముందు ఎన్నో బహిరంగ సభల్లో తన పార్టీని గెలిపించుకునేందుకు ఎంతో చమత్కారంగా వ్యాఖ్యలు చేస్తూ.. తన మేనియాను కొనసాగించాలని నిత్యం ప్రయత్నాలు చేస్తుంటారు. గుజరాత్ ఎన్నికలలో తన పార్టీ ఓటమి అంచున వున్న క్రమంలో.. ఎలాగైనా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చేసిన ప్రయత్నంలో భాగంగా తనను హత్య చేయడానికి మాజీ ప్రధాని పాకిస్తాన్ చెందిన దౌత్యవేత్తలతో కుట్రపన్నారని కూడా అరోపించారు. ఇది జరిగి ఏడాది అయినా.. అధికారంలో వున్న కేంద్రం ఈ దిశగా ఎలాంటి విచారణ కూడా జరిపించలేదు.

అంతేకాదు ఈ ఏడాది జరిగిన రెండో విడత బడ్జెట్ సమావేశాలు పూర్తిగా అందోళనలు, నిరసనలతో గత రెండు దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా విఫలమయ్యాయని తెలిసిన తరువాత ఆయన ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ఒక చాయ్ వాలా దేశానికి ప్రధానికి కావడాన్ని విపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయని చౌకబారు వ్యాఖ్యలకు తెరతీసారు. మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి పార్లమెంటు సమావేశాలు వాయిదాల పర్వంతో కొనసాగిన క్రమంలో ఇలా బాధ్యతారాహిత్యంగా చేసిన వ్యాఖ్యలు పార్టీ నేతలకు నచ్చుతాయేమో కానీ ప్రజలు ఏమనుకుంటున్నారన్న విషయాలను మాత్రం పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం రాజకీయ విమర్శకుల నుంచి వ్యక్తం అవుతుంది.

ఈ వ్యాఖ్యలతోనే ప్రజల్లో బీజేపి పార్టీపై ప్రధాని నరేంద్రమోడీపై వ్యతిరేకత ఉత్పన్నమవుతున్న క్రమంలో దిద్దుబాటు చర్యలకు పూనుకోవాల్సిన పార్టీ.. అ దిశగా అడుగులు వేయకుండా సాక్ష్యాత్తు పార్లమెంటులో కూడా తన ప్రధాని మోడీ తన చమత్కారాన్ని ప్రదర్శించారు. అయితే అది కాస్తా వికటించింది. తాను చేసిన వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగిపోయాయి. ప్రధాని చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు రికార్డుల నుంచి వాటిని తొలగించారు. ప్రధాని వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది.

ఔనా.. ఎప్పుడు అంటున్నారు కదూ.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కోసం జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా బరిలో నిలిచి ప్రత్యర్థి హరిప్రసాద్ పై 20 ఓట్లతో నెగ్గిన జేడీ యు రాజ్యసభ సభ్యుడు హరివంశ్‌ నారాయణ్ సింగ్ గెలిచిన అనంతరం ఆయనను ప్రధాని అభినందిస్తూ.. తన చమత్కారాన్ని ప్రదర్శించారు. రాజ్యసభలోనూ తాము గెలిచామన్న ఆనందంలో ప్రధాని చేసిన చమత్కారపు వ్యాఖ్యలు ఇప్పుడు రికార్డుల నుంచే కనిపించకుండా పోయాయి. ఒక ప్రధాని చేసిన వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించాల్సి రావడం.. ప్రధానిగా ఆయన దేశానికి, దేశప్రజలకు ఏం సందేశమిస్తున్నారన్నది కూడా ఇప్పడు చర్చనీయాంశంగా మారుతుంది.

రాజ్యసభలో ప్రధాని మోదీ తనదైన శైలిలో ప్రసంగిస్తూ బిగ్ బి అమితాబ్, ధర్మేంద్ర నటించిన షోలే చిత్రంలోని విలన్ పాత్రధారి గబ్బర్ సింగ్ చెప్పిన సిర్ఫ్ దో హీ అద్మీ తే అన్న డైలాగ్ ను గుర్తు తెచ్చుకున్నారో ఏమో కానీ అదే తరహాలో తన చమత్కారాన్ని ప్రదర్శించారు. ‘‘దోనో తరఫ్ హరి థే. ఏక్ కే ఆగే బి.కే. థా! బి.కే హరీ కోయి నా బికే థా. యహా పే జో హరి కో బికే వో బి.కే నహీ థా!’’ అని పేర్కొన్నారు. దీనికి.. ‘‘ఇరు వైపులా హరి అన్న పేరు కలిగిన వ్యక్తులే ఉన్నారు. ఒకరి ఇంటి పేరు బి.కె. కానీ ఆయన అమ్ముడు (బికే) పోలేదు. ఇక్కడ అమ్ముడు పోయిన (బికే) హరి మరొకరు ఉన్నారు. కానీ ఆయన బి.కె. కాదు’’ అని చమత్కరించారు. అన్న అర్థంలో బికేను వాడాలనుకున్నా అది అమ్ముడుపోయిన అర్థం స్ఫురించడంతో వివాదాస్పదమైంది.

తాను అమ్ముడుపోయానని అంటారా? అంటూ ఓటమి పాలైన హరిప్రసాద్ ప్రధానమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ దేశ ఖ్యాతిని దిగజార్చారని, ఆయన వ్యాఖ్యలు సిగ్గు చేటని కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ అన్నారు. మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యకు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన వెంకయ్య మోదీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు. అంతేకాదు ప్రధాని మోదీ నోట్ల రద్దు సమయంలో ప్రజలను కూడా తన వ్యాఖ్యలతో ప్రలోభ పెట్టారని కూడా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

నోట్ల రద్దు సమయంలో పార్లమెంటుకు సరిగ్గా హజరు కాలేక నేరుగా సభలతో ప్రజల్లోకి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ.. నొట్ల రద్దు చేపట్టగానే దేశంలోని పేదల వద్దకు నల్లధనం వున్నవాళ్లు వచ్చి తమ అకౌంట్లలో డబ్బుల వేస్తారని, అందుకు అంగీకరించవద్దని చెప్పారు. ఇలా చెప్పిన ఆయనే 2017లో జరిగిన మరో సభలో మీ అకౌంట్లలో నల్లడబ్బు వేసిన వాళ్లకు డబ్బును తిరిగి ఇవ్వకండీ.. మీ అకౌంట్లో వున్నవి మీ డబ్బులే అంటూ ప్రజలను ప్రేరేపించారు. ప్రధాని హోదాలో ఇలాంటి వ్యాక్యలు చేయడం ఎంతవరకు సమంజసమని కూడా రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తూన్న భారత్ లో.. స్వయంగా దేశ ప్రధానిగా వున్న వ్యక్తే ఇలాంటి అభ్యంతకర వ్యాక్యలు.. దిగజారుడు వ్యాఖ్యలు చేస్తుంటే ప్రపంచంలో దేశం పరువు ఏమౌతుందన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. అంతేకాదు.. ప్రజల్లో ఒక రకమైన అందోళనను, వైషమ్యాలను వెదజల్లే విధంగా వ్యాఖ్యలు చేసి.. వాటి నుంచి సానుభూతిని పోందడం ఎంతవరకు సమంజసమన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

కాగా, 2013లో కూడా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేసిన వ్యాక్యలను రాజ్యసభ రికార్డల నుంచి తొలగించింది. అయితే కేవలం ప్రధానిగా వున్న మన్మోహన్ వ్యాఖ్యలను మాత్రమే కాకుండా.. అప్పటి రాజ్యసభ విపక్ష సభ్యుడు అరుణ్ జైట్టీ చేసిన అభ్యంతకర వ్యాఖ్యలను కూడా రాజ్యసభ స్పీకర్ హమీద్ అన్సారీ రికార్డుల నుంచి తొలగించారు. ఇలా ప్రధాని సహా విపక్ష నేతలు చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడమే గతంలో జరిగేది. కానీ కేవలం ప్రధాని వ్యాక్యలను మాత్రమే రికార్డుల నుంచి తొలిగించింది మాత్రం చాలా అరుదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Modi  Congress  Manmohan singh  Chai wala  Pak supari  BJP  Congress  Venkaiah Naidu  Rajya Sabha  Politics  

Other Articles