ministers hate politics, instead inquiring for the delay వావ్.! బీజేపి మంత్రులు ఎదురుదాడికి సలామ్..!!

Union ministers politics instead explaining the cause for the delay

union ministers vs rahul gandhi, Minister piyush goyal, minister smriti irani, minister rajyavardhan singh rathode, BJP vs Rahul Gandhi, Rahul Gandhi, Smriti Irani, Piyush Goyal, Narendra Modi, Alwar lynching, Mob lynching, Alwar mob lynching, Rajasthan lynching, social media, crime

Union Ministers and BJP leaders have hit out at Congress president Rahul Gandhi after the latter's attack on PM Narendra Modi over Alwar lynching incident.

వావ్.! బీజేపి మంత్రులు ఎదురుదాడికి సలామ్ చేయాల్సిందే..!!

Posted: 07/24/2018 03:03 PM IST
Union ministers politics instead explaining the cause for the delay

రాజస్థాన్ లోని అల్వార్ లో జరిగిన మూకదాడిపై ట్వీట్ చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్రమంత్రులు సోషల్ మీడియా వేదికగా తమదైన శైలిలో చేసిన మూకుమ్మడి దాడి ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు కేంద్రమంత్రులు రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. ఒకరు రాహుల్ గాంధీని ద్వేషాన్ని వెదజల్లే వ్యాపారిగా పేర్కోంటే మరోకరు రాబందు రాజకీయాలను చేస్తున్నారని.. ఇంకోకరు హింసాత్మక ఘటనల్లో రాజకీయ లబ్దిని వెతక్కండీ, ద్వేషపు విత్తనాలను చల్లకండీ అంటూ అమాత్యత్రయం ఆయనపై విరుచుకుపడింది.

గోవులను అక్రమంగా తరలిస్తున్నాడన్న అనుమానంతో రాజస్థాన్ లోని అల్వార్ లో అక్బర్ ఖాన్ అనే వ్యక్తిని ఒక మూక మూకుమ్మడి దాడి చేసి కొట్టి చంపింది. ఈ ఘటనపై స్పందించిన రాహుల్.. ఈ దాడులలో ఎక్కడో తప్పు జరిగింది.. బాధితుడ్ని అసుపత్రికి తీసుకెళ్లడంతోనూ కాలయాపన జరిగింది.. పోలీసుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్టగా నిలుస్తుంది.. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ నినాదాన్ని ఎత్తుకున్న కేంద్రం.. ఒక వర్గాన్ని ఎందుకు టార్గెట్ చేస్తూ దాడులతో మట్టుబెడుతుందని ట్వీట్ చేశారు. తీవ్ర గాయాలపాలైన బాధితుడిని ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు పోలీసులకు మూడు గంటలు పట్టిందని పేర్కొన్నారు. ఎందుకంటే మార్గమధ్యంలో వారు టీ తాగారని ఆరోపించారు. ఇది మోదీ ‘దుర్మార్గపు నవభారతం’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక్కడ మానవత్వం స్థానాన్ని ద్వేషం భర్తీ చేస్తోందని రాహుల్ ఆరోపించారు.

రాహుల్ ట్వీట్‌పై బీజేపీకి చెందిన కేంద్రమంత్రులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ట్విట్టర్ వేదికగా రాహుల్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలో నేరాలు జరిగినప్పుడల్లా రాహుల్ ఆనందంతో గంతులేయడం మానుకోవాలని సూచించారు. రాహుల్ ను ‘ద్వేష వ్యాపారి’గా అభివర్ణించారు. రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించేందుకు ఎప్పువు అవకాశం దొరికినా ముందుండే మరో కేంద్ర మంత్రి స్మృతీ.. రాహుల్ రాబందు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయన కుటుంబానికి అటువంటివి అలవాటేనని విమర్శించారు. ఇక మరో కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాధోడ్ హింసాత్మక ఘటనల్లో కూడా రాజకీయ లబ్దిని అశించకండీ, స్థానిక పోలీసులు కేసును విచారిస్తున్నారని బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుంది.. ఇకనైనా కొన్ని ఓట్ల కోసం సమాజంలో విషబీజాలను నాటకండీ అంటూ విమర్శఇంచారు. ఇక దీనికి తోడు బీజేపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో అయితే, రాహుల్‌పై ఏకంగా పది లైన్ల పద్యమే ట్వీట్ చేశారు.

అయితే కాంగ్రెస్ శ్రేణులు మాత్రం కేంద్రమంత్రులు, బీజేపి విమర్శనలపై మరో విధంగా స్పందిస్తున్నారు. యూపీఏ పదేళ్ల హయాంలో ఇలాంటి ఘటనలు ఇంత పెద్ద స్థాయిలో ఎప్పుడైనా జరిగాయా.? అని ప్రశ్నిస్తున్నారు. దేశప్రజలు దాదాపు 34 సంవత్పరాల తరువాత భారీ అధిక్యతను అందించిన ప్రధాని అక్షేపించి.. ఇలాంటి ఘటనలు పునారావృతం కాకూడదని విజ్ఞప్తి చేసినా కొనసాగడానికి కారణమేంటి.?
ఈ మూకలు జరిపే హింసాత్మక దాడుల్లో అనేక మంది ఇప్పటికే చనిపోయినా.. వీటిని ప్రేరేపిస్తున్నదెవరు.? ఈ దాడుల వెనుక వుండి ప్రాణాలు తీయాల్సిందిగా ఉసిగొల్పుతున్నదెవరు.? తెలుసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదా.? దాడులు జరిగిన సమయంలో మాత్రమే దర్యాప్తు పేరుతో హంగామా చేస్తున్నది ఎవరు.? ఆ తరువాత విచారణ ఎంతవరకు వచ్చిందన్న వివరాలపై వివరణ ఇవ్వాల్సింది ఎవరు.? మూక దాడులు గోసంరక్షణల పేరుతో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ గోసంరక్షణ సంస్థలను ఏ పార్టీ తమ అనుబంధంగా చెప్పుకుంటుంది.? అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఇక తమ నేతను ద్వేష వ్యాపారిగా, విద్వేషాలు నాటుతున్న వ్యక్తిగా పేర్కోంటున్న కేంద్రమంత్రులు.. ఆరు కిలోమీటర్ల దూరంలోని అస్పత్రికి మూకదాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని తీసుకెళ్లడానికి మూడు గంటల సమయం ఎందుకు పట్టిందో ఎవరూ విచారించకుండా, కనీసం వివరాలను సేకరించి.. ఫలానా కారణంగా ఆలస్యమైందని వివరణలు కూడా ఇచ్చుకోకుండా తమ అధినేత రాహుల్ గాంధీపై విరుచుకుపడుతున్న తీరు చూస్తుంటే.. రాహుల్ నే కాదు రాహుల్ ట్విట్టర్ ను చూసినా.. బీజేపి నేతలకు, కేంద్రమంత్రులకు ముచ్చమటలు పడుతున్నట్లు వుందని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. పార్లమెంటులో అవిశ్వాస తీర్మాణంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ ఎన్డీఏ అవినీతిని ఎండగట్టడం.. వారి విద్వేషాలను తగ్గించడానికి జాదూ కా జప్పీని ప్రధాని నరేంద్రమోడీకి ఇచ్చిన నాటి నుంచి వారు నిద్రకు దూరమైనట్లు కనిపిస్తున్నారని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక ప్రతీ అంశాన్ని రాజకీయంగా వాడుకునే స్వార్థం బీజేని నేతలకు తెలిసినంతగా కాంగ్రెస్ నాయకులకు తెలియదని కొందరు నెట్  జనులు కూడా విమర్శిస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ గ్యాంగ్ రేప్ అంశాన్ని ఢిల్లీ ఎన్నికలలో రాజకీయంగా వాడుకున్నది ప్రధాని అన్న విషయాన్ని మీరు మర్చిపోయారా.? అంటూ కూడా కొందరు నెట్ జనులు కేంద్రమంత్రులను తూర్పారబట్టారు. ఇక కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ చెప్పినట్లుగా.. దాడులకు పాల్పడిన గోసంరక్షకులు నిర్దోషులుగా బయటకు రాగానే బీజేపి నేతలు వెళ్లి వారి మెడలో పూలమాలలు వేసి సత్కరిస్తూ గ్రామాల్లోకి స్వాగతించడంతోనే బాధితులకు న్యాయం జరుగుతుందని కొందరు నెట్ జనులు దయ్యబట్టారు.

దేశంలో అధికారపక్షంగా కొనసాగుతున్న ప్రధాని.. తనను హత్య చేయడానికి కాంగ్రెస్ కుట్ర పన్నిందని ఎన్నికల్లో అబద్దాలను వల్లెవేయచ్చు.. దాదాపుగా రెండు దశాబ్దాల తరువాత పార్లమెంటు బడ్జట్ సమావేశాలు పూర్తిగా తుడిచిపెట్టకుపోయిన సందర్భంగా ఛాయ్ వాలా ప్రధానిగా కొనాసాగం ఇష్టం లేదని పేర్కోనవచ్చు.. కానీ ప్రతిపక్షం మాత్రం దేశంలో జరిగే అన్యాయాలను, ప్రజా వ్యతిరేక విధానాలను, హింస్మాత్మక ఘటనలను ప్రశ్నించడం తప్పు.. అన్నట్లుగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ఇంకోందరు నెట్ జనులు సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul gandhi  smriti irani  piyush goyal  rajyavardhan singh rathode  alwar lynching  pm modi  crime  

Other Articles