rss behind bjp decision to break-up with pdp in jandk ఆరెస్సెస్ నేతల సూచనతో తెగిన మైత్రిబంధం.?

Rss behind bjp decision to break up with pdp in jandk

governor's rule in JandK, Governor's Rule, President Kovind, PDP-BJP alliance, PM Modi, amit shah, RSS, RSS meet, BJP, hindu voters, jammu and kashmir, Mehbooba Mufti, Governor, NN Vohra, resignation, BJP president Amit Shah, Ram Madhav, politics

Is RSS Leaders advice in safeguarding hindu votes in jammu and kashmir, the reason behind the break-up of the alliance in the state.?

ఆరెస్సెస్ నేతల సూచనతో తెగిన మైత్రిబంధం.?

Posted: 06/20/2018 01:06 PM IST
Rss behind bjp decision to break up with pdp in jandk

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తమ ప్రభుత్వం వుండాలని.. అందుకు రాజకీ పైఎత్తులు కూడా వేస్తూ.. రాజకీయ విశ్లేషకులకు, ప్రత్యర్థి పార్టీలకు అందకుండా వ్యూహప్రతివ్యూహాలను రచిస్తున్న బీజేపి.. జమ్ముకశ్మీర్ లోని తమ కూటమి ప్రభుత్వాన్ని ఎందుకు చేజార్చుకుంది.? ఇది కూడా రాజకీయ ఎత్తుగడలో భాగమేనా.? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తమ అధికారంలో లేని రాష్ట్రాల్లో పట్టును సాధించేందుకు అహర్నిషలు పాటుపడుతున్న బీజేపి.. అందుకు అనుగూణంగా పావులను కదుపుతుందన్న విషయం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో నిరూపితమైంది.

అయితే అక్కడ దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో ప్రజాస్వామ్యం పరఢవిల్లిందని కూడా ప్రతిపక్షాలు వ్యాఖ్యానించాయి. అలాంటి పరిస్థితుల నుంచి అధికారం వున్న రాష్ట్రం నుంచి బంధాన్ని తెంచుకునేందుకు బీజేపి సాహసించిందంటే.. దానికి వెనుక బలమైన వ్యూహాలు వున్నాయన్న సంకేతాలు అందుతున్నాయి. మెహబూబా ముఫ్తీ సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలగడం వెనక కూడా బీజేపి అనుబంధ సంస్థ అరెస్సెన్ ప్రమేయమే కారణమా.? వారు చెప్పిందే బీజేపి అదిష్టానం అచరించి.. ఈ నిర్ణయానికి వచ్చిందా.? అధికారాన్ని తృణప్రాయంలా వదులుకునేందుకు అరెస్సెస్ యే కారణమా.? అన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి.

పీడీపీతో పొత్తు వల్ల జమ్ముకశ్మీర్‌లోని హిందువుల్లో బీజేపీ పట్టు కోల్పోతోందని, మున్ముందు ఇది బీజేపీకి ఎదురుదెబ్బ కాగలదని ఆరెస్సెస్ భావించింది. ఈ విషయాలను బీజేపీ అధిష్ఠానానికి చెప్పడం వల్లే సంకీర్ణ ప్రభుత్వంతో బీజేపీ తెగదెంపులు చేసుకున్నట్టు తెలుస్తోంది. వారం రోజుల క్రితం హరియాణాలోని సూరజ్‌కుండ్‌లో బీజేపీ, ఆరెస్సెస్ నేతలు సమావేశమయ్యారు. మూడు రోజులపాటు జరిగిన ఈ సమావేశాల్లో జమ్ముకశ్మీర్‌లోని పరిస్థితులపై చర్చ జరిగింది. వచ్చే ఎన్నికల్లో పీడీపీతో కలిసి వెళ్తే బీజేపీ తీవ్రంగా దెబ్బతింటుందని, గతంలో వచ్చినన్ని సీట్లు కూడా రావని నేతలు అభిప్రాయపడ్డారు.

ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా నష్ట నివారణ చర్యలు చేపట్టాలని నిర్ణయించిన అరెస్సెస్.. పీడీపీతో కటీఫ్ చెప్పినట్టు తెలుస్తోంది. కాశ్మీరు లోయలో భదత్రా పరిస్థితులు మెరుగుపరచడంలో పీడీపీ విఫలమైందని అరోపిస్తున్న బీజేపి.. మరి మూడేళ్లల్లో రావణకాష్టంలా నిత్యం రగిలిన సందర్బాలలో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా.. తాజాగా 2019 ఎన్నికలకు ముందు ఈ నిర్ణయం తీసుకోవడంలో రాజకీయ ఎత్తుగడలు వున్నాయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇదే అంశాన్ని సార్వత్రిక ఎన్నికలతో పాటు జమ్మూఎన్నికలలో హిందూ ఓట్లను కాపాడుకునేందుకు కూడా అస్త్రంలా పనిచేస్తుందని భావించిన బీజేపి మైత్రిబంధాన్ని తెంచుకుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పీడీపీతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన దరిమిలా.. ఉపముఖ్యమంత్రిగా బీజేపి నేత, ఇక మంత్రులుగా కూడా బీజేపి ఎమ్మెల్యేలు వ్యవహరించిన పక్షంలో వారికి కూడా బాధ్యత వుంటుందన్న విషయాన్ని బీజేపి మర్చిపోయిందా.? అన్న విమర్శలు వస్తున్నాయి. ఇక పెరిగిపోతున్న ఉగ్రవాదం, భద్రతా వైఫల్య కారణాలను ఎత్తిచూపి.. తమ చేతులకు ఎలాంటి మట్టి అంటకుండా.. మొత్తం నేరాన్ని పీడిపీపై తోసేయడంపై బీజేపి రాజకీయ ఎత్తుగడ వేసిందని.. ఈ ఎత్తుగడలో పిడీపీ విఫలమైందని కూడా విమర్శలు వస్తున్నాయి. ఇక గవర్నర్ పాలన ద్వారా రాష్ట్రంపై పూర్తి పట్టు సాధించవచ్చనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. పాలనపై పూర్తి అధికారం ఉంటే రాష్ట్రంలో చెలరేగిపోతున్న ఉగ్రవాదులు, వేర్పాటువాదుల పీచమణచవచ్చని భావిస్తోంది. ఈ కారణంగానే పీడీపీ నుంచి బీజేపీ బయటకు వచ్చినట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Modi  amit shah  jammu and kashmir  Mehbooba Mufti  Governor  NN Vohra  BJP president Amit Shah  politics  

Other Articles