janasena to become strengthen.. former mla to join party శ్రీకాకుళంలో జనసేన బలోపేతం.. పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే..?

Janasena to become strengthen former mla to join party

pawan kalyan, janasena, gangavaram, ichchapuram former mla, ichchapuram, agarwala naresh kumar, lallu, former mla, porata yatra, bus yatra, andhra pradesh, politics

Jana Sena chief pawan kalyan who is in uttarandhra porata yatra to meet the people to know their problems is to get a strong hold person from the region who is an former mla from ichchapuram agarwal naresh kumar alias lallu.

శ్రీకాకుళంలో జనసేన బలోపేతం.. పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే..?

Posted: 05/22/2018 02:51 PM IST
Janasena to become strengthen former mla to join party

ఉత్తరాంధ్ర పోరాట యాత్రంలో మూడో రోజు బిజిబిజీగా గడుపుతుతన్న జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఇచ్చాపురంలోని మూప ప్రాంతంలో ఉద్యోగులతో భేటీ అయ్యి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. అయితే పవన్ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్న క్రమంలో ఆయనకు వస్తున్న ఆదరణను, సమస్యల పరిష్కారం కోసం ఆయన తప్పకుండా కృషి చేస్తానని చెబుతున్న విధానం, తాను ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చాను తప్ప.. డబ్బు దోచుకోవడం కోసమో, దాచుకోవడం కోసమో మాత్రం కాదని ఆయన గంటాపథంగా చెబుతున్న తీరుతో ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది.

తనకు పేరు, ప్రఖ్యాతులతో పాటు డబ్బును కూడా సినీపరిశ్రమ కల్పించిందని, అయితే వాటి కోసం కాకుండా కేవలం ప్రజలకు జవాబుదారి వున్న ప్రభుత్వాన్ని అందించాలన్న దిశగా, సమస్యలను పరిష్కరించే ప్రభుత్వాన్ని అందించాలన్న ధ్యేయంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెబుతున్న మాటలతో ప్రజలు కూడా తమ సమస్యలు తీరితే చాటు అన్నట్లుగా అలోచన చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇచ్చాపురం మాజీ ఎమ్మెల్యే అగర్వాలా నరేష్ కుమార్ అలియాస్ లల్లూ కూడా జనసేనాని కృతనిశ్చయానికి ముగ్దుడయ్యాడు.

దీంతో ఆయన త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం. ఈ సందర్భంగా కొందరు నేతలు లల్లూ విషయాన్ని పవన్ వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. మరోవైపు లల్లూ అనుచరులు, పవన్ సన్నిహితుల మధ్య చర్చలు జరిగినట్టు కూడా చెబుతున్నారు. పవన్ నుంచి సానుకూల స్పందన వచ్చిందని కూడా అంటున్నారు. వచ్చే నెలలో జనసేనలో లల్లూ చేరే అవకాశం ఉందని సమాచారం. ఈ అంశంపై ఇటు పవన్ కానీ, అటు లల్లూ కానీ ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles