Telangana government should review metro rail charges

metro rail charges review, metro charges should be reviewed, metro rail charges review, high metro rail charges, metro rail common man, metro rail taxi rates, metro rail auto charges, Prime Minister Narendra Modi, PM modi, hyderabad metro rail, metro train Shedule, metro rail services, metro rail charges, pm modi metro rail, miyapur, kukatpally, metro rail project, telangana

telangana government should review metro rail charges and make it affordable to travel for every common hyderabadi not just it professionals and bigwigs.

మెట్రో.. సమయమే అదా.. ధర మాత్రం ఓలా.. ఓలామ్మా..!

Posted: 11/28/2017 01:30 PM IST
Telangana government should review metro rail charges

హైదరాబాద్ నగరవాసులు గతకొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న కలల రైలు కదులుతుంది. భాగ్యనగరవాసులు భాగ్యమంతా పోసి నిర్మించిన ఈ స్వప్నం సాకరమవుతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 వేల 830 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో.. ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యం పద్దతిలో నిర్మితమైన ఈ కలల రైలు.. దేశంలోనే అతిపెద్ద మెట్రోగా కూడా కీర్తినందుకుంది. హైదరాబాద్ మెట్రో నాగోల్- అమీర్ పేట్ మధ్యనున్న 17 కిలోమీటర్లు.. మియాపూర్-అమీర్ పేట మధ్యనున్న 13 కిలోమీటర్ల మేర సేవలను అందిస్తూ పట్టాలెక్కనుంది.

మియాపూర్ – అమీర్ పేట (13 కిలోమీటర్లు)

ఈ రూట్ లో ప్రతి 15 నిమిషాలకు ఒక సర్వీస్ ఉంటుంది. అంటే గంటకు నాలుగు రైళ్లు తిరుగుతాయి. అప్ అండ్ డౌన్ 10 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. 13కిలోమీటర్లలో 10 స్టేషన్లు ఉన్నాయి. ప్రతి స్టేషన్ లో 30సెకన్లు మాత్రమే రైలు ఆగుతుంది. అంటే మియాపూర్ నుంచి అమీర్ పేట్ కు కేవలం 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఛార్జీ రూ.40. సిటీ బస్సులో అయితే కనీసం 50 నిమిషాల టైం పడుతుంది. బండిపై వెళ్లినా కనీసం 40 నిమిషాల టైం. అదే మెట్రోలో అయితే మియాపూర్ లో బయలుదేరిన 20నిమిషాల్లోనే అమీర్ పేట్ లో ఉండొచ్చు. ప్రయాణికుల రద్దీ, డిమాండ్ ను బట్టి సర్వీసులు పెంచుతారు.

నాగోలు – అమీర్ పేట్ ( 17 కిలోమీటర్లు )

ఈ రూట్ లోనూ ప్రతి 15 నిమిషాలకు ఒక రైలు తిప్పనున్నారు. 17కిలోమీటర్ల దూరంలో 14రైల్వే స్టేషన్లు ఉన్నాయి. జర్నీ టైం 25 నిమిషాలు. ఈ మార్గంలో బస్సులో వెళ్లాలంటే కనీసం గంటన్నర సమయం. అదే బండిపై వెళ్లినా గంట సమయం పడుతుంది. మెట్రోలో అయితే జస్ట్ 25 నిమిషాల్లో అమీర్ పేట్ లో బయలుదేరి నాగోల్ లో ఉండొచ్చు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటే 10 నిమిషాలకు కూడా ఓ సర్వీస్ నడపనున్నట్లు మెట్రో తెలిపింది. ప్రారంభం రోజు మాత్రం 15 నిమిషాలుగా టైం ఫిక్స్ చేసుకుంది.

ధర మాత్రం ఓలమ్మా అనిపిస్తుంది...

మెట్రో రైలు చార్జీలు మాత్రం ప్రారంభంలోనే ఓలమ్మా అనిపిస్తున్నాయి. అంటే ఏకంగా రోడ్డు మార్గంలో వెళ్లే టాక్సీ సరీసులతో పోటీ పడేవిధంగా వున్నాయి. ఐదు మంది కూర్చునే వెసలుబాటుతో వెళ్లే ఓలా, ఉబర్ టాక్సీలు 13 కిలోమీటర్ల దూరానికి రమారమి వసూలు చేసే మొత్తాన్నే మెట్రో రైలు కూడా వసూలు చేస్తుంది. ఐదుగురు కలసి వెళ్లాలంటే మెట్రో కన్న టాక్సీయే మిన్న అన్నట్లుగా ధరలు బెంబేలెత్తిస్తున్నాయి.

మియాపూర్ నుంచి అమీర్ పేట వరకు వెళ్లాలంటే మెట్రో రైలులో ఒక్కక్కరికి నలభై రూపాయల చార్జీ వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో బల్కంపేట కు వెళ్లాల్సిన ఐదుగురు సభ్యులు గల కుటుంబం మెట్రోను అశ్రయిస్తుందా..? లేక టాక్సీలా అంటే.. ఖచ్చితంగా టాక్సీలనే. గమ్యస్థానం వరకు చేర్చడంతో పాటు రమారమి చార్జీ అంతే అవుతుంది. అయితే ఇక్కడ కొంత సమయం మాత్రం.. ట్రాఫిక్ కారణంగా వృధా అవుతుంది.

టైం ఈజ్ మనీ అన్న కానెప్టులో అలోచించి ధరలను నిర్ణయించామని అధికారులు చెప్పుకునే అవకాశమూ వుంది. ఇలా చెప్పే క్రమంలో మెట్రో రైలు అసలు ఉద్దేశ్యానికి మాత్రం విఘాతం కలుగుతుందా...? అన్న అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. హైదరాబాద్ మహానగర ప్రగతిలో తాను బాగమనుకుని భావించే సగటు భాగ్యనగరవాసి కూడా  గర్వపడేలా చేయాలన్న వాదనలు ఉత్పన్నమవుతున్నాయి.

హైదారాబాద్ ప్రగతిని మరో మెట్టుకు చేర్చామని చెప్పుకోగలుగుతున్న అధికారులు.. చారెడు దూరానికి బారెడు ధర నిర్ణయించడంతో సగటు హైదరాబాదీకి విమానయానం మాదిరిగానే మెట్రో ప్రయాణం కూడా అందని ద్రాక్షగానే మిగులుతుందా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మెట్రో రైలు అధికారులతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా మెట్రో రైలు చార్జీలపై పున:సమీక్షించాలని పలువురు విన్నవించుకుంటున్నారు.

ఈ మోట్రో చార్జీలో ఈ లక్ష్యాలు నెరవేరేనా..?

* హైదరాబాద్ నగరం గ్రీన్ సిటీగా ఎలా మారుస్తారు..?
* 13 కి.మీలు వెళ్లివచ్చేసరికి రూ.80 చెల్లింపు.. మరి లీటరు పెట్రోల్ పోసుకుని వెళ్లే బైకర్లు మెట్రోను అశ్రయిస్తారా.?
* హైదరాబాద్ హమారా.. అనే సగటు హైదరాబాదీకి కాలుష్య రహిత నగర స్వప్నం సాకారమయ్యేనా..?
* ఈ ధరలతో హైదారబాద్ నగర ట్రాఫిక్ కు కళ్లేం పడేనా..?
* 13 కీ.మీలకే రూ.40 ధరల పలికితే.. నిత్యం మియాపూర్ నుంచి నాగోల్ వెళ్లి వచ్చే ప్రయాణికులకు జేబులు గుల్ల
* హైదారాబాద్ ప్రగతిని మరో మెట్టుకు చేర్చిన మెట్రలో సేవలు సంపన్నులకేనా..?
* ఐటీ ఉద్యోగులు.. సంపన్నుల మెట్రో సేవల కోసం ప్రతీ హైదరాబాదీ జేబుల నుంచి డబ్బులా..?
* సగటు భాగ్యనగరవాసీ చూసి మురిసిపోవడం తప్ప.. ప్రయాణించే వెసలుబాటేదీ..?
* ఎంఎంటీఎస్ రైలులో లింగంపల్లి నుంచి నాంపల్లి, సికింద్రాబాద్ కు వెళ్లినా చార్జీ రూ.10 మాత్రమే.
* మినిమమ్ చార్జితో గమ్యస్థానాలను చేర్చుతూ నగరవాసికి అకర్షించిన ఎంఎంటీఎస్ హిట్.. మరి మెట్రో..?

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Modi  metro rail  charges  review  ts government  ktr  kcr  metro rail officials  hyderabad metro rail  

Other Articles