YSRCP mla gurunath reddy to join TDP.? టీడీపి గూటికి చేరువవుతున్న గురునాథరెడ్డి..?

Ysrcp mla gurunath reddy to join tdp

YSRCP, mla gurunath reddy, TDP, Ananthapur, jagan mohan reddy, chandrababu, paritala sunitha, jc diwakar reddy, Andhra Pradesh, political news, AP Politics, latest political news

YSRCP mla gurunath reddy to join TDP.? Its the question araised now in Andhra Pradesh latest politics, why is he forced to join ruling party.?

టీడీపి గూటికి చేరువవుతున్న గురునాథరెడ్డి..?

Posted: 09/28/2017 02:31 PM IST
Ysrcp mla gurunath reddy to join tdp

నంద్యాల, కాకినాడు ఉప ఎన్నికలలో ప్రజాతీర్పు తమకే అనుకూలంగా వుందని బాహాటంగానే చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ.. అదే పూర్తి స్థాయిలో నిజమని నమ్మించేందుకు కూడా కొత్త ప్రణాళికలను రచిస్తోంది. నంద్యాల, కాకినాడల్లో ఏం జరిగిందో.. స్థానిక ఓటర్లతో పాటు యావత్ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినా.. అధికార పార్టీ మాత్రం మేకపోతు గాంభీర్యం వీడటం లేదు. పదే పదే ఓ విషయాన్ని చెప్పి.. అదే నిజమని భావింపజేసేలా అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించే చంద్రబాబు టీడీపీ చాణక్య నీతి రాష్ట్ర ప్రజలకు తెలిసిందే.

అయినా సరే.. తామే నీతి, న్యాయం, ధర్మం ఆచరించే పార్టీగా, అన్నహాజారే వారసులమని చెప్పుకుంటూ తమ కార్యకర్తల చేత విపరీత ప్రచారం చేయించి.. రాజకీయాలపై అవగాహన లేని వారిని నమ్మించే ప్రయత్నం చేసి.. అవతల వారి తప్పుల్ని మాత్రమే లెక్కించే టీడీపి.. తప్పులెన్నువాడు తమ తప్పులెరుగడు అన్ని సంగతి మాత్రం మర్చిపోయింది. అంతేకాదు ప్రజలను కూడా మర్చిపోయేలా చేసింది. ఇందుకోసం ఎప్పటికప్పుడు తన పార్టీలోని రిసర్చ్ బృందంతో కొత్త కొత్త వ్యూహాలను రచింపజేస్తుంది.

ఇక కాకినాడ, నంద్యాలలో గెలిచిన పైకి విజయగర్వం కనిపించేలా చేస్తున్న టీడీపీ.. ఇక మరోమారు అపరేషన్ అకర్ష్ కు పదనుపెట్టాలని ప్లాన్ చేస్తుంది. తమ పార్టీకీ ప్రజాదరణ వుందని విశ్వసించి పత్రిపక్ష నేతలు తమ పార్టీలో చేరుతున్నారని నమ్మించేందుకు వ్యూహాలను రచించింది. అయితే ప్రతిఫక్షానికి చెందిన నేతలు ఇందుకు సిద్దంగా లేకపోయినా.. కేసుల్లో చిక్కుకున్న నేతలను, వివాదాలు, అరోపణలు వున్న నేతలను తమ గూటికి తెచ్చుకోవాలని ప్లాన్ చేసింది.

ఈ కోవలో అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డిని టీడీపీ టార్గెట్ చేసినట్లు సమాచారం. గుర్నాథరెడ్డి... చేరికకు పరిటాల సునీత కీలకపాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఈయన రాకపై ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వైపు నుంచి కూడా అభ్యంతరం లేదంటున్నారు. గుర్నాథ రెడ్డి సోదరుడు నారాయణ రెడ్డి గతంలో అనంతపురం ఎమ్మెల్యేగా పనిచేశారు.. వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవించి ఉన్న రోజుల్లో అత్యంత ఆత్మీయ మిత్రునిగా ఉండేవారాయన., దశాబ్దాలుగా కాంగ్రెస్‌తో కొనసాగిన బంధాన్ని.. వైఎస్‌ మరణంతో తెంచుకుని.. వైసీపీలో చేరారు నారాయణరెడ్డి, గుర్నాథరెడ్డి సోదరులు.

మిస్సమ్మ బంగ్లా కోసమే గుర్నాథరెడ్డి పసుపు కండువా కప్పుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది... కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న సమయంలో.. గుర్నాథరెడ్డి కుటుంబం బీఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ పేరుతో అనంతపురంలో 200 కోట్ల విలువైన మిస్సమ్మ బంగళా స్థలాన్ని కొనుగోలు పేరుతో ఆక్రమించుకుందనే ఆరోపణలున్నాయి. ప్రతిపక్షాలు దీనిపై గతంలో తీవ్రస్థాయిలో మండిపడ్డాయి కూడా.. చివరికి సీన్ కోర్టుకు చేరింది.. గుర్నాథరెడ్డి భూముల ఆక్రమణ వ్యవహారాన్ని ప్రస్తుత అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. దీంతో సీఎం చంద్రబాబు ఆ వ్యవహారాన్ని సీఐడీకి అప్పగించారు. దర్యాప్తు చేసిన సీఐడీ అధికారులు ఇది అక్రమమని తేల్చారు... దీనిపై న్యాయస్థానం గుర్నాథరెడ్డితోపాటు మరికొందరికి అరెస్టు వారెంట్లు కూడా జారీ చేసింది.

ఈ కేసు నుంచి తప్పించుకునేందుకే గుర్నాథరెడ్డి పార్టీ మారుతున్నారనే అనుమానాలు అందరిలో ఉన్నాయి. దోషి అని తేలిన వ్యక్తిని పార్టీ మారుతున్నారని వెనుకేసుకోస్తే... ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలని అనంతపురం టీడీపీ నేతల్లో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అరెస్టు వారెంట్లు కూడా జారీ చేసిన గుర్నాథరెడ్డి టీడీపీలో చేరితే... టీడీపీ నైతికత కూడా కచ్చితంగా ప్రశ్నించాల్సిన అంశమే. మరోవైపు మొన్నటి నంద్యాల ఉప ఎన్నికల వేళ టీడీపీ విజయంలో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కీలక పాత్ర పోషించారు. అలాంటి ప్రభాకర్‌ చౌదరిని పరిగణలోకి తీసుకోకుండా.. గుర్నాథరెడ్డిని పార్టీలో ఎలా చేర్చుకుంటారనే దానిపై కూడా చర్చ సాగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YSRCP  mla gurunath reddy  TDP  Ananthapur  Andhra Pradesh  political news  AP Politics  

Other Articles