Chiranjeevi’s entry into TDP in News Now | టీడీపీలోకి చిరు.. ఏమో చెప్పలేం!

Chiranjeevi party defection news

Konidela Chiranjeevi, Telugu Desam Party, rajya Sabha Seat, Chiranjeevi TDP or BJP, Chiranjeevi YSR Congress Party

Tollywood actor and Rajya Sabha Member from Congress Konidela Chiranjeevi’s term will end in March2018. AP Minister Minister Ganta Srinivas Rao lobbying for Chiranjeevi’s entry into TDP.

గంటా దౌత్యం.. టీడీపీలోకి చిరు?

Posted: 09/13/2017 04:47 PM IST
Chiranjeevi party defection news

టాలీవుడ్ అగ్రనటుడు, రాజ్యసభ సభ్యుడు కొణిదెల చిరంజీవి గురించి ఇప్పుడు మరో వార్త చక్కర్లు కొడుతోంది. అయితే అది కొత్త వార్తేం కాకపోయినా మరోసారి గట్టి కారణం చూపిస్తూనే.. ఆయన పార్టీ మారబోతున్నారంటూ చెబుతున్నారు. త్వరలో ఆయన పసుపు కండువా కప్పుకోబోతున్నారన్నది దాని సారాంశం.

వైసీపీ అధినేత జగన్ కాపు నేతలపై కాంసంట్రేషన్ చేసిన క్రమంలో చిరంజీవిని కూడా లాగాలని భావిస్తున్నాడని వార్తలు వినిపించాయి. ఇందుకోసం రాజ్యసభ సభ్యత్వంను చిరుకు ఆఫర్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు టీడీపీ కూడా సేమ్ ప్రతిపాదనతో చిరును తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ అందుకు ఒప్పుకోకపోతే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తాను కోరుకున్న సీటు నుంచి పోటీ చేసేందుకు చిరుకు ఛాన్స్ ఇచ్చేందుకు కూడా చంద్రబాబు నాయుడు సుముఖతంగా ఉన్నట్లు తెలుస్తోంది.

చిరుకు సన్నిహితుడు..  ప్రస్తుత మంత్రి గంటా శ్రీనివాస రావు ఈ వ్యవహారంలో చర్చిస్తున్నాడని, సిల్వర్ స్క్రీన్ మెగాస్టార్ ను కన్విన్స్ చేసేందుకు కామినేని(బీజేపీ) కూడా ప్రయత్నిస్తున్నాడని చెబుతున్నారు. వీరిద్దరు పీఆర్పీలో ఉండగానే చిరుతో చనువుగా ఉండేవారు. అయితే గతంలో ఇలాంటి వార్తలే వచ్చినప్పుడు చిరు ఖండించారు. 2018 మార్చిలో ఆయన రాజ్యసభ సభ్యత్వం ముగియనుంది. ఏపీ నుంచి కాంగ్రెస్ కు రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించే అవకాశం లేకపోవటంతో..  పరిస్థితుల దృష్ట్యా  చిరు పార్టీ మారే వార్తలపై ఇప్పుడే ఏం చెప్పలేమంటున్నారు విశ్లేషకులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles