TDP leaders demand action against prashant kishor వైసీపీ ఎన్నికల వ్యూహకర్త పీకేపై పోలీసు కేసు..?

Bareilly teenage girls set ablaze police suspect role of stalker

prashant kishor, political stategist, online posts, social media, ravi kiran, ysrcp, police case, varla ramaiah, ap government, tdp, chandrababu, ys jagan, jagan mohan reddy, crime

Andhra Pradesh government is thinking to file a case against Political Strategist Prashant Kishor, for his online posts, who is presently working for YS Jagan

వైసీపీ ఎన్నికల వ్యూహకర్త పీకేపై పోలీసు కేసు..?

Posted: 08/12/2017 11:25 AM IST
Bareilly teenage girls set ablaze police suspect role of stalker

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే పై పోలీసు కేసు దాఖలు చేసేందుకు అధికార టీడీపీ సిద్దమయ్యిందా..? అంటే అవుననే సమాధానాలే వినిసిస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ 2019 ఎన్నికల కోసం వైసీపీ అధ్యక్షుడు జగన్ పార్టీ వైసీపీతో కలసి పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చిన నంద్యాల ఉప ఎన్నికలలో ఇప్పటికే అధికార పార్టీకి షాకుల మీద షాకులు తగుతున్నాయి. ఓ వైపు ఎన్నికల కమీషన్ జనవరి ఎన్నికల జాబితా ప్రకారమే ఎన్నికల నిర్వహిస్తామని షాక్ ఇవ్వగా, మరోవైపు కార్యకర్తలు లేక అద్దెకు తెప్పించుకోవాల్సిన పరిస్థితి అధికార తెలుగుదేశం పార్టీకి ఉత్పన్నమైంది.

ఈ నేపథ్యంలో అసలు జగన్ కు ఇంత సీనుందా అని అనుకుంటున్న అధికార పార్టీ నేతలకు ప్రతిపక్ష నేత నిద్రను కూడా కరువు చేస్తున్నాడు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చని అధికార పార్టీ అధినేతను ఏం చేయాలని నడిరోడ్డ మీద కాల్చి వేయాలని ఘాటు వ్యాఖ్యలతో ప్రజల్లోకి చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని బలంగా తీసుకెళ్తున్నారు. ఈ తరుణంలో ఇంత బలంగా జగన్ స్ట్రాటెజీ మారడానికి కారణమేంటీ అన్న అన్వేషణలో పడిన అధికార పార్టీ.. జగన్ వెనుకనున్న ఎన్నికల వ్యూహకర్తి ప్రశాంత్ కిషోర్ అని తెలుసుకుంది. ఇక ఆయనకు వ్యతిరేకంగా అడుగుల వేస్తే తప్ప జగన్ సైలెంట్ కాడని భావిస్తుంది.

ఇదే క్రమంలో పీకే బృందం సామాజిక మీడియాలో వేల నకిలీ ఖాతాలను తెరిచి సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా పోస్టింగులు పెడుతోందని ఇప్పటికే కొన్ని ఆధారాలను సేకరించిన టీడీపీ వాటిని బయటపెట్టింది. ఆ వ్యవహారం క్రమంగా వేడెక్కుతోంది. ఈ నేరానికి ప్రశాంత్‌ కిశోర్‌పై సైబర్‌ చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల వ్యూహకర్తపై పోలీస్‌ కేసు దాఖలుకు టీడీపీ యోచిస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల సమయంలో ప్రశాంత్‌ కిషోర్‌పై ఏడు కేసులు నమోదయ్యాయని, ఇందులో ఒకటి సైబర్‌ కేసని తెలిపారు. ఆ కేసుల వివరాలు తెప్పించడానికి ప్రయత్నిస్తున్నామని వర్లా రామయ్య తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prashant kishor  political stategist  online posts  social media  ysrcp  police case  crime  

Other Articles