KCR and Team Failed to Spent Development Funds

Oppositions leaders better than trs govt

TRS MLAs, Telangana Opposition MLAs, Telangana Oppositions Leaders, Telangana Constituencies Development Funds, KCR Constituencies Development Funds, Janareddy Better Than KCR

Telangana Opposition MLAs expend allocated funds tangibly compared to TRS. Including KCR KTR so many failed to spent funds properly.

నియోజక వర్గాల నిధులను ఏం చేశారసలు?

Posted: 07/03/2017 02:57 PM IST
Oppositions leaders better than trs govt

తెలంగాణలో అభివృద్ధి సంగతి పక్కనపెడితే ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్రుగా ఉన్న విషయం మొన్నే చెప్పుకున్నాం. ముఖ్యంగా నియోజకవర్గాల అభివృద్ధి విషయంలో వాళ్లు వెలగబెడుతున్న వ్యవహారాలు ఒక్కోక్కటిగా బయటకు వస్తుండటంతో వాళ్లపై రిపోర్టులు తెప్పించేసుకున్నాడు గులాబీ బాస్. ఓ జాతీయ మీడియా వాటిని సీక్రెట్ గా తెప్పించేసుకుని ప్రచురించటంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

మొత్తం 119 ఎమ్మెల్యేలలో కేవలం 15 మంది మాత్రమే తమకు కేటాయించిన నిధులను సవ్వంగా వినియోగిస్తున్నారని దాని సారాంశం. నిజానికి కేటాయింపుల్లో కనీసం 60 నుంచి 70 శాతం ఖచ్ఛితంగా నియోజక వర్గాల అభివృద్ధి పథకం(సీడీపీ) కింద ఖర్చు చేస్తేనే అది లెక్కల్లోకి వస్తుంది. కానీ, ఇక్కడ అది మచ్చుకైనా జరగటం లేదు. 65 మంది ఎమ్మెల్యేలు 50 నుంచి 75 శాతం, 37 మంది 25-50 శాతం మాత్రమే వినియోగిస్తున్నారు.

ఇక నివేదిక ప్రకారం చూసుకుంటే.. సీఎ కేసీఆర్ తన ఎమ్మెల్యే నిధుల్లో 50 శాతం కంటే తక్కువగానే ఖర్చు చేయగా, తనయుడు, ఐటీ మంత్రి కేటీఆర్ 25 శాతం కంటే తక్కువగా ఖర్చు చేశాడు. ప్రతిపక్ష నేత జానా రెడ్డి, టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి, బీజేపీ కిషన్ రెడ్డి లక్ష్మణ్ లు, చివరకు అసలు అభివృద్ధే చేయటం లేదని స్వయంగా కేటీఆర్ విమర్శలు గుప్పించిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీలు కూడా 75 శాతం కంటే ఎక్కువే ఖర్చు పెడుతున్నారు.

టీఆర్ఎస్ తరపున అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ఒక్కడే 75 శాతం పైగా నిధులను ఖర్చుపెట్టినట్లు ఉంది. 25 శాతం కంటే తక్కువ చేసిన వాళ్లలో కేటీఆర్ తోపాటు కొండా సురేఖ, దాస్యం వినయ భాస్కర్, మరియు గణేష్ లు ముగ్గురు టీఆర్ ఎస్ కు చెందిన వారే కావటం గమనార్హం. 2015-16 కు గానూ ఒక్కో ఎమ్మెల్యేకు 1.50 కోట్లు నిధులను కేటాయించగా, 2016-17 కు 3 కోట్లు, ఇక ఈ యేడాదిలో ఇప్పటిదాకా ఫస్ట్ ఇన్ స్టాల్ మెంట్ కింద 75 లక్షలు సీడీపీ కింద కేటాయించారు.

ఇలా అభివృద్ధి విషయంలో ప్రతిపక్ష నేతలే ముందంజలో ఉండటం ఒకరకంగా టీఆర్ ఎస్ కు ఇబ్బందికరమైన విషయమే. అయితే అధికార పక్షం నేతల వ్యవహరం(తనతోసహా)తో పెద్ద ఎత్తున్న నిధులు ఇలా మిగిలిపోతుండటంతో రంగంలోకి దిగిన కేసీఆర్ ఎంపీ నిధులకైతే ఎలా రియంబర్స్ మెంట్ విధానాన్ని అనుసరిస్తారో అలాంటి మార్గదర్శకాలను అవలంభించేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. తద్వారా వచ్చే విమర్శలకు చెక్ పెట్టొచ్చనేది టీ సీఎం ప్లాన్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Opposition Leaders  Development Funds  

Other Articles