పవన్ విషయంలో ప్లాన్ సి అన్వేషణలో చంద్రబాబు.! NTR's Team Denies 2019 Poll Plans

Chandrababu in preperation of plan c towards janasena pawan kalyan

Chandrababu Naidu, NTR, Pawan Kalyan, Tarak, Andhra Pradesh, Special status, BJP, TDP, Narendra Modi, JanaSena, politics

TDP chieff and AP CM chandrababu naidu is in preperation of plan c implenting towards janasena chief pawan kalyan as NTR team denies his 2019 plans.

పవన్ కల్యాన్.. ప్లాన్ సి మేధోమధనంలో చంద్రబాబు.!

Posted: 04/12/2017 04:57 PM IST
Chandrababu in preperation of plan c towards janasena pawan kalyan

నవ్యాంధ్ర ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేరుsÁa వినగానే చాణక్య రాజనీతిని గుర్తుకువస్తుందని పలువురు రాజకీయ విశ్లేషకులు చమత్కరిస్తుంటారు. ఆయనకు నేటి తరం రాజకీయాలపై విపరీమైన గురి వుండటమే ఇందుకు కారణమని కూడా చెబుతుంటారు. మరో రెండేళ్ల సమయం వుండగానే.. ఇప్పటి నుంచే రానున్న 2019 ఎన్నికల విషయమై ఆయన పావులు కదపడమే ఇందుకు తార్కణంగా చెప్పుకోవచ్చు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ కూడా అందులో భాగమనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

అయితే ఇంతగా ముందుచూపు వున్న చంద్రబాబు.. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాన్ విషయంలోనూ ముందస్తు ఎత్తులు, పై ఎత్తులు వేసివుంటారా..? అంటే తప్పకుండా ఇప్పటికే వాటికోసం పథక రచన చేశారన్న వార్తలు వినబడుతున్నాయి. పవన్ కల్యాన్ తో ఎన్నికల పోత్తు జత్తకట్టకుండా.. అవసరమైన నేపథ్యంలో ఎన్నికల తరువాత పోత్తుతో ముందుకెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారని వార్తలు వినబడుతున్నాయి. అయితే ప్రస్తుతం మిత్రపక్షంగా వున్న జనసేనతో ఎందుకని పోత్తుతో ఎన్నికలకు వెళ్లకూడదన్న విషయంలో చంద్రబాబుకు దూరదృష్టి చాలానే వుందట.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం రాష్ట్రంలోని విపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెళ్లకుండా.. దానిని జనసేన అధినేత పవన్ కల్యాన్ కూడా చీల్చుకోవడం మంచిదని చంద్రబాబు భావిస్తున్నారుని టీడీపీ వర్గాల టాక్. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకులంగా వుండే ఓట్ల సంఖ్య గతంలో మాదిరిగానే టీడీపీ కన్నా ఐదారు లక్షలు తక్కువ వుంటుందని అంచనా వేస్తున్నారు. అయితే యాంటీ ఇంకంబెన్సీ ద్వారా వచ్చే ప్రభుత్వ ఓటు అతనికి కలిస్తే మొదటికే మోసం వస్తుందని భావిస్తున్నారు.

పవన్ జనసేన కూడా ప్రజల ఓట్లను చీల్చడంతో పాటు.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును కూడా సాధ్యమైనంత వరకు తమ ఖాతాలో వేసుకుంటే.. రానున్న ఎన్నికలలో తిరిగి తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారట. అందుకనే పవన్ తో అవసరమైతే ఎన్నికల తరువాత పోత్తును పెట్టుకునేందుకు చంద్రబాబు అసక్తి చూపుతున్నారని సమాచారం. ఇక మరో విషయం ఏంటంటే.. తమ అభ్యర్థులు బలంగా వున్న చోట కాకుండా.. వైసీపీ నేతలు బలంగా వున్న చోట మాత్రమే జనసేన తమ బలమైన అభ్యర్థులను నిలబెట్టేందుకు కూడా చంద్రబాబు ఇప్పటి నుంచి ప్రణాళికలను సిద్దం చేస్తున్నారని బొగట్టా.

ఇక చంద్రబాబు ప్లాన్ బి ఏంటంటే.. నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా రావాలని, కావాలని, అది పోరాటంతోనే సాధ్యమని ఏపీ ఎంపీలు హోదా విషయంలో ఏం చేస్తున్నారని నిగ్గదీసి అడిగుతున్న పవన్.. ఇప్పుడు తమ మిత్రపక్షమే కానీ భవిష్యత్తులో కూడా మైత్రి కొనసాగిస్తారన్న నమ్మకం లేదని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే బీజేపితో సంబంధాలను తెంచుకుంటున్నాని చెప్పిన పవన్ భవిష్యత్తులో తమను కూడా దోషిగా చేయవచ్చునని, ఏపీకి హోదా రాకపోవడానికి కారణం టీడీపీ వైఖరని కూడా చెప్పవచ్చునని దీంతో ఆయనకు చెక్ పెట్టాలని కూడా టీడీపీ భావిస్తుందని సమాచారం.

దీంతో పవన్ జనసేనను ఢీ కొనేందుకు చంద్రబాబు.. 2009 ఎన్నికలలో టీడీపీ తరపున స్టార్ క్యాంపెయినర్ గా మారిన జూనియర్ ఎన్టీయార్ ను మళ్లీ తెరమీదకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు మొదలెట్టేశారట. ఇప్పటికే తన బావమరిది హరికృష్ణతో అ అంశంపై చర్చంచారని కూడా వార్తలు వినబడుతున్నాయి. టీడీపీ పార్టీలో తన కుమారుడు లోకేష్ కు ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చిన చంద్రబాబు.. ఆనను ఎమ్మెల్సీగా ప్రకటించడం, ఆయనను గెలిపించడం.. ఆ తరువాత తాజా మంత్రివర్గ విస్తరణలో అయనను మంత్రిగా చేయడం అన్ని జరిగిపోయాయి.

ఇక త్వరలో నారా లోకేష్ ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమించడం.. తాను జాతీయ రాజకీయాలపై వెళ్లడమా..? లేక పార్టీ సలహాదారుగా కొనసాగడమా చేలాలన్న యోచనలో వున్నారట చంద్రబాబు. కాగా, టీడీపీ పార్టీ తరపున 2009లో ప్రచారం చేసి ప్రమాదానికి గురై.. ఆ తరువాత అసుపత్రి బెడ్ పై నుంచి కూడా టీడీపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చిన తారక్ ను చంద్రబాబా పూర్తిగా విస్మరించారట. ఇక ఆ మధ్య మహానాడు హాజరు విషయంలోనూ చంద్రబాబు తమను అవమానించడానికే అహ్వానపత్రం పంపించలేదని కూడా హరికృష్ణ అప్పట్లో నేరుగా మీడియా ముఖంగానే చెప్పారు.

జండాలు పట్టేది తాము, గొంతెత్తి అరిచేది తాము.. కానీ అందలం మీద మూర్చునేది మాత్రం చంద్రబాబు ఆయన కుమారుడేనా..? అని ఇప్పటికే హరికృష్ణ మండిపడుతున్నారట. పార్టీలో పదవులు పంపకంలోనూ.. ప్రభుత్వంలో శాసన మండలి సభ్యుల విషయంలోనూ తారక్, హరికృష్ణలను మర్చిపోయినా.. వారు మాత్రం తమకు ఎదురైన పరాభవాన్ని మర్చిపోలేదని, అందుకనే తాము రానున్న ఎన్నికలకు దూరంగా వుండాలని భావిస్తున్నట్లు ఎన్టీయార్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

దీంతో జనసేనాని పవన్ కల్యాన్ ను ఎదుర్కొనేందుకు చంద్రబాబు ప్లాన్ బి విఫలం కావడంతో.. ఆయన ప్లాన్ సి కోసం వేచిచూస్తున్నారట. ప్లాన్ సి ఎట్టిపరిస్థితుల్లోనూ విఫలం కాకుండా చక్కని వ్యూహంతో చేయాలని కూడా మేధోమధన బృందానికి ఇప్పటికే అదేశాలు ఇచ్చేశారట. అయితే ప్లాన్ సి లో భాగంగా గల్లా జయదేవ్ ద్వారా ప్రిన్స్ మహేష్ బాబును తన పార్టీలోకి తీసుకుని ప్రచారం చేయించాలన్న యోచనలో చంద్రబాబు వున్నారని కూడా వార్తలు వినబడుతున్నాయి. మరి చంద్రబాబు ప్లాన్ సి ఎలా వుంటుందో..? వర్క అవుట్ అవుతుందా..? లేక ప్లాన్ బి మాదిరిగానే బెడిసికోడుతుందా..? అన్నది వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu Naidu  NTR  Pawan Kalyan  Tarak  Andhra Pradesh  Special status  BJP  TDP  Narendra Modi  JanaSena  politics  

Other Articles