నమోను వదిలేసారు, వ్యూహాన్ని మార్చారు..? ఎందుకు.? namo mantra loses strength in 5 states elections..?

Pm modi mocks rahul gandhi leaves namo mantra

Uttar Pradesh elections, UP polls, UP poll results, Narendra Modi, Rahul Gandhi, PM Modi, BJP, SP, SP-Congress alliance, Akhilesh Yadav, BSP, Mayawati, coconut comments, twitter trolling, rahul gandhi online jokes, rahul twitter

It appeared that Prime Minister Narendra Modi was in a light mood in poll-bound UP as, besides leaving his namo mantra and development sutra he mocks only on rahul gandhi.

నమోను వదిలేసారు, వ్యూహాన్ని మార్చారు..? ఎందుకు.?

Posted: 03/02/2017 05:36 PM IST
Pm modi mocks rahul gandhi leaves namo mantra

ఐదు రాష్ట్రాల ఎన్నికలలో విజయం అన్ని పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ముఖ్యంగా జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ మధ్య ఈ ఎన్నికలు బలాబలాలకు వేధికగా నిలువనున్నాయి. పదేళ్ల యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ సాధించిన అభివృద్దిని, సంక్షేమాన్ని పక్కనబెడితే.. అవినీతిని, అక్రమాలను.. ప్రజావ్యతిరేక విధానాలను తూర్పారబడుతూ అధికారంలోకి వచ్చిన బీజేపి.. ఇక పనిలో పనిగా కాంగ్రెస్ యువనేతను టార్గెట్ గా చేసుకుని విమర్శలను సంధించింది.

కాంగ్రెస్ పార్టీ పగ్గాలను రాహుల్ అందుకుంటున్న సమయంలో ఆయనపై విమర్శల జడివానను కురిపించడంతో పగ్గాలను అందుకోకుండా తాత్కాలికంగా అడ్డుకోగలిగింది. దీంతో పాటు రాహుల్ బంగారు చెంచా నోట్లో పెట్టుకుని పుట్టిన పిల్లాడని, ఇంకా అతను పిల్లాడిలానే వ్యవహరిస్తుంటారని విమర్శలను సంధించడంతో పాటు అటు పార్టీ అనుబంధ సంఘాలతో విపరీతంగా ప్రచారం చేయింది. ఫలితంగా తమ ప్రణాళికలు, వ్యూహాలు సత్ఫలితాలను ఇచ్చాయి. దీంతో రమారమి ముఫ్పై ఏళ్ల తరువాత కేంద్రంలో ఓ పార్టీ మూడింట రెండోంతులకు పైగా మోజారిటీని సాధించి అధికారంలోకి రాగలింది.

దీంతో దీర్ఘకాలిక సెలవుపై వెళ్లివచ్చిన తరువాత తాను కొంత పరిణితి చెందిన నేతలా రాహుల్ వ్యవహరించారు. ప్రధాని ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకోగలిగారు. భూసంస్కరణ చట్టంలో మార్పులను అడ్డుకోగలిగారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పథకాన్ని కూడా త్వరగా అమలు చేయాలన్న మాజీ సైనికులకు ఆయన అండగా నిలిచారు. హర్యానాకు చెందిన మాజీ సైనికోద్యోగి ఆత్మహత్య నేపథ్యంలో రెండు పర్యాయాలు అరెస్టు కూడా అయ్యారు. ఇక ఐదు రాష్ట్రాల ఎన్నికలలో పార్టీని గెలుపును తన భుజస్కందాలపై వేసుకున్న రాహుల్ ఏడాది ముందుగానే ఉత్తర్ ప్రదేశ్ లో కిసాన్ యాత్రను చేపట్టారు.

ఆయితే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలలో దేశ ప్రజలతో పాటు విదేశాలు కూడా అసక్తిగా గమనిస్తున్న రాష్ట్రం మాత్రం అత్యంత పెద్దది.. అత్యధిక స్థానాలు వున్న ఉత్తర్ ప్రదేశ్. గత సార్వత్రిక ఎన్నికలలో బీజేపికి ఏకపక్షంగా స్తానాలను అందించిన ఆ రాష్ట్రం ఇప్పుడు కూడా బీజేపిపైన కానీ, లేక ప్రధాని పైన కానీ అలాంటి అదరణనే కనబరుస్తుందా..? లేదా..? అన్నది ఆసక్తి కరమైన అంశంగా మారింది. మరీ ముఖ్యంగా ప్రధాని పాత పెద్ద నోట్ల రద్దు చేసిన తరువాత వస్తున్న ఈ ఎన్నికలు నోట్ల రద్దుపై రెఫరెండగా మారుతున్నాయా..? లేక ప్రధాని నేతృత్వంలోని ప్రభుత్వానికి రెఫరెండంగా మారుతాయా..? అన్నదే ప్రశ్న.

ఈ నేపథ్యంతో గత సార్వత్రిక ఎన్నికలలో తాము అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడి అకౌంట్లో పదిహేను లక్షల రూపాలయలను వేస్తామన్న ప్రచారంతో పాటు అనేక పథాకాలు తీసుకువస్తాం. దేశ ప్రజలు తల ఎత్తుకుని జీవించేలా చేస్తాం.. అంటూ ప్రతీ ఓటరును కదిలించే విధంగా బీజేపి ప్రచారం చేసింది. అయితే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మూడేళ్లు గడుస్తున్న నేపథ్యంలో అదే ఆదరణ ప్రజలు మోడీ సర్కారుపై చూపుతున్నారా..? అన్నది ఈ ఎన్నికల నేపథ్యంలో తేలిపోనుంది.

దీంతో ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపి.. ప్రధాని నరేంద్రమోడీ.. అందివచ్చిన ప్రతి అంశాన్ని ప్రచారస్త్రాంగా మార్చుకుంటుంది. అటు రాహుల్తో పాటు ఇటు అఖిలేష్ యాదవ్ ను కూడా టార్గెట్ చేస్తు.. ఆ పోత్తుపై అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసింది. ములాయం సింగ్ యాదవ్ ను హత్యచేయాలని యత్నించిన పార్టీతో అఖిలేష్ జతకడతారా..? అంటూ నిలదీసింది. ఈ పోత్తుతో పాటు యూపీలోని పార్టీలన్నీ కసబ్ పార్టీలని ప్రచారం చేసింది. ఇక ప్రధాని అయితే దేశంలో జరిగిన ప్రతీ రైలు ప్రమాదం వెనుక ఉగ్రవాదుల కోణం వుందని మరో కొత్త అంశాని తెరమీదకు తీసుకువచ్చారు. అయితే ఇవన్నీ కేవలం ఓటమిన జీర్ణించుకోలేక దిగజారుడు ప్రచారం చేస్తున్నారని కూడా తూర్పారబడుతున్నారు ప్రత్యర్థి పార్టీల నేతలు.

ఇక తాజాగా రాహుల్ చేసిన కోబ్బరి జ్యూస్ అంశాన్ని కూడా అదోదే పెద్ద అంతర్జాతీయ సమస్య అన్నట్లుగా ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించడం.. ఆయనలోని ఓటమి భయాన్ని తెలియజేస్తుందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. రాహుల్ జ్యూస్ అన్నా.. ఆయన వ్యాఖ్యల వెనుక ఉద్దేశ్యం మాత్రం అందరికీ అర్థమవుతుందని.. మణిపూర్ లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తారా..? లేదా..? అన్నది అసలు సమస్య అని ప్రశ్నిస్తున్నారు. దానిపై హామీలను ఇవ్వకుండా రాహుల్ పై విమర్శలుతో కాలం వెల్లబుచ్చడం బీజేపి నేతలతో పాటు ప్రధానిక కూడా అలవాటేనని ఎద్దేవా చేశారు.

గతంతో సహారా డైరిలో ప్రధాని నరేంద్రమోడీ పేరు వుండటంపై ప్రస్తావించిన రాహుల్.. తాను నోరు విప్పితే భూకంపం వస్తుందని వ్యాఖ్యానించడాన్ని.. భూకంపం రాదని తేలిపోయిందంటూ.. పక్కదారి పట్టించారని నేతలు విమర్శిస్తున్నారు. దీంతో రాహుల్ తనను ఎంత కావాలంటే అంతగా విమర్శించుకోండి కానీ సహారా నుంచి ముడుపులు తీసుకుని మీరు అవినీతికి పాల్పడ్డారా..? లేదా..? అన్న విషయంలో మాత్రం క్లారిటీగా చెప్పండీ అంటూ అడిగిన ప్రశ్నకు మాత్రం ఇప్పటి వరకు సమాధానం రాలేదని కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారు.

యావత్ ప్రపంచంలోని అవినీతిని వెలుగులోకి తీసుకువచ్చిన పనామా పేపర్ల వ్యవహరంలో కేంద్ర ఎందుకు జాప్యం చేస్తుందని, ఈ కేసులో తమ ప్రభుత్వానికి మద్దతునిస్తున్న అనేక మంది వ్యాపారవేత్తలు, ప్రముఖులు వుండటం చేత వారిని ఏమీ చేయలేని కాలయాపన చేస్తుందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. పనామా పేపర్ల వ్యవహారంలో ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరిపిస్తామన్న కేంద్రం.. ఎందుకు చర్యలు తీసుకోవడంలో నాన్చుడు దోరణి అవలంభిస్తుందని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని తమకు తాము ప్రకటించుకున్న పార్టీ అవినీతిలో తమవారు కూరుకుపోయారని తెలితే మాత్రం దానిని నాన్చుతున్నారని, లేదా పక్కదారి పట్టిస్తున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles