తెలంగాణకు కొత్త గవర్నర్ ఈయనేనా? | D.H. Shankaramurthy tipped to be Telangana Governor.

New governor for telangana soon

Telangana Governor, ESL Narasimhan, D.H. Shankaramurthy telangana new governor, Shankaramurthy KCR, Narasimhan Telangana, Narasimhan KCR, Narasimhan Shankaramurthy, Shankaramurthy in telangana governor race

Governor ESL Narasimhan may relieve soon from Telangana.Karnataka BJP senior leader D.H. Shankaramurthy replace.

తెలంగాణకు కొత్త గవర్నర్ రాబోతున్నాడా ??

Posted: 01/03/2017 10:27 AM IST
New governor for telangana soon

తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడిన వేళ, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయం నుంచే గవర్నర్ గా సేవలు అందిస్తున్న ఈ.ఎస్.ఎల్. నరసింహన్ కు త్వరలో ఉద్వాసన పలకబోతున్నారా? అంటే అవుననే సంకేతాలు బలంగానే వినిపిస్తున్నాయి. అయితే అది పూర్తి స్థాయిలోనా? లేక కేవలం తెలంగాణకు మాత్రమేనా అన్న విషయంపై మాత్రం స్పష్టం లేదు. ఆ స్థానంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, కర్ణాటక విధాన పరిషత్ సభాపతిగా సేవలందిస్తున్న డీ హెచ్ శంకరమూర్తి తెలంగాణ గవర్నర్‌ గా నియమితం కానున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా నరసింహన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో శంకరమూర్తి నియామకానికి మోదీ పచ్చజెండా ఊపినట్టు సమాచారం. గత వారంలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాలు శంకరమూర్తితో చర్చించి, ఆయన అభిప్రాయాన్ని తెలుసుకున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. శంకరమూర్తి నియామకంపై ఈ విషయంలో అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడకపోయినా, మరో రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు కూడా జారీ అవుతాయని అంచనా. 

కాగా, ఐదుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికైన శంకరమూర్తి ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని ఈ మధ్యే నిర్ణయించుకున్నారు. తెలుగు రాష్ట్రాలైన కన్నడ, తెలుగు రాష్ట్రాల్లో దేనికైనా గవర్నర్ బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్ధమని ప్రకటించారు కూడా. మంత్రిగా, ఫ్లానింగ్ బోర్డు డిప్యూటీ చైర్మన్ గా, మండలిలో ప్రతిపక్ష నేతగా ఆయన విధులు నిర్వహించారు. ఇంతకు ముందు తమిళనాడు గవర్నర్ గా అవకాశం వచ్చినప్పటికీ, కావేరి వివాదం, పైగా జయ విజ్నప్తితో కేంద్రం ఆ పని చేయలేదు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ESL Narasimhan  Telangana Governor  BJP  DH Shankaramurthy  

Other Articles