డ్రాగన్ కు భారత్ అంటే భయం పట్టుకుందా..? Learn lessons from China-Trump spat: Chinese media tells India

Learn lessons from china trump spat chinese media tells india

chinese official media, global times, warning to india, donald trump, china, america, India, global times, PM Modi, warning

India today got a load of advice from China as its state-run media, referring to India as a ‘spoilt kid’, asked it to take a cue from China’s handling of US President-elect Donald Trump’s questioning of the ‘One-China’ policy.

డ్రాగన్ కు భారత్ అంటే భయం పట్టుకుందా..?

Posted: 12/23/2016 12:56 PM IST
Learn lessons from china trump spat chinese media tells india

భారత దేశాన్ని చూస్తే ప్రపంచ దేశాలు సైతం ఔరా.. అంటుంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని కీర్తిస్తుంటారు. అలాంటి భారత్ శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రపంచ అగ్రరాజ్యాలతో పోటీపడుతూ ముందుకు దూసుకెళ్తూ.. తన సత్తాను చాటుకుంటుంది. ఇక ఇన్నాళ్లు చైనా అంటే కొంత సంయమనంతో వ్యవహరించిన భారత్ ఇప్పుడు చైనా నిషేదాజ్ఞలు విధించిన మంగోలియాకు కూడా అర్థికసాయాన్ని ప్రకటించింది. దీంతో భారత్ వేస్తున్న అడుగులు.. ముందస్తు వ్యూహం అర్థంకాని చైనా భారత్ పై అక్కస్సును వెళ్లగక్కింది.

‘మాతో పెట్టుకోవాలంటే.. అగ్రరాజ్యంగా బాసిల్లుతున్న అమెరికాకే వణుకు వస్తుందని.. అలాంటి భారత దేశానికి తాము ఎలాగైనా నెగ్గుకురాగలమని విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుందో’’నని చైనా విస్మయం వ్యక్తం చేసింది. అమెరికా వంటి దేశాలే తమ వద్దకు రావాలంటే ఒకటికి రెండుసార్లు అలోచిస్తున్న నేపథ్యంలో భారత్ మాత్రం తమకు వ్యతిరేకంగా అడుగులు వేస్తుందని అక్రోశాన్ని బయటపెట్టింది. తన అధికార ప్రతిక గ్లోబల్ టైమ్స్ లో భారత్ ను ఏడుస్తున్న చిన్నపిల్లాడితో సరిపోల్చింది.

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనే కిరీటం చూసుకుని ఒక్కోసారి భారతదేశం చెడిపోయిన పిల్లాడిలా ప్రవర్తిస్తుందని, గొప్ప దేశంగా రూపొందే అవకాశం ఉన్నా.. ఆ దేశానికి దూరదృష్టి కొరవడిందని తన కథనంలో పేర్కొంది. ఈ సందర్భంగా తైవాన్ విషయంలో ట్రంప్-చైనాల మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలని కూడా సూచించింది. తైవాన్ అద్యక్షుడికి ట్రంప్ ఫోన్ చేయడంపై చైనా నిరసన వ్యక్తం చేయడం, ఆయన వన్-చైనా విధానాన్ని ప్రశ్నించడం లాంటి చర్యలన్నింటినీ కూడా ఆ కథనంలో ప్రస్తావించారు.

ఇక వివాదాస్పదమైన దక్షిణ చైనా సముద్రంలో ప్రవేశించిన అమెరికన్ అండర్ వాటర్ డ్రోన్‌ను చైనా స్వాధీనం చేసుకుందని పేర్కోంది. అయితే చైనాకు భారత్ అంటే భయం పట్టుకుందా..? అమెరికా ఇండియాతో దోస్తీ చేసి చైనాపై ప్రతీకారం తీర్చుకొనుందా అన్న అనుమానాలే చైనా మీడియాలో ఇలాంటి కథనాలకు కారణమవుతున్నాయని పలువరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇన్నాళ్లలో ఎప్పుడు చైనా భారత్ పై ఇలాంటి కథనాలను ప్రచురించలేదు. కానీ ప్రస్తుతం మాతో పెట్టుకోవద్దు అంటూ కథనాన్ని రాయడం కూడా చర్చనీయాంశంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : china  america  India  global times  donald trump  PM Modi  warning  

Other Articles