మల్కన్ గిరి ఏజెన్సీ బాలుడి లేఖపై ప్రధాని స్పందించేనా..? Malkangiri boy appeals to PM Modi to save life

Tribal boy writes to pm as encephalitis toll mounts to 73 in malkangiri

Umesh Madhi, Japanese Encephalitis, PM Modi, Malkangiri district, Odisha, drug mafia, Anie Ribu Joshi, Thrissur, Kerala, drugs, alcohol, gorakshak samities, bjp, rss, dalits

Will PM Modi responds to 10-year-old odisha tribal boy’s letter, who wrote a letter appealing for help after Japanese Encephalitis claimed the lives of 73 in Odisha,

గిరిజన బాలుడి లేఖపై ప్రధాని స్పందించేనా..?

Posted: 11/02/2016 01:53 PM IST
Tribal boy writes to pm as encephalitis toll mounts to 73 in malkangiri

తమ ప్రాణాలకు ముప్పు పొంచివుందని, తమను రక్షించాలని కోరుతూ గిరిజన బాలుడు రాసిన లేఖపై ప్రధాని నరేంద్రమోదీకి స్పందిస్తారా..? లేదా..? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇప్పటికే పలువరు చిన్నారులు నుంచి వచ్చిన లేఖలను అయన అందుకున్నారు. వారు పేర్కోన్న సమస్యలను ఆయన పరిష్కరించేందుకు అదికారులకు అదేశాలు కూడా ఇచ్చారు. ముంబై బాలిక అనారోగ్యం నుంచి పలు చిన్నారుల అర్థనాధాలపై ప్రధాని సానుకూలంగా స్పందించారు.

ఈ నేపథ్యంలో ఒడిశా గిరిజన బాలుడు రాసిన లేఖపై ఆయనెలా స్పందిస్తారు...? ముందుగా చర్యలు తీసుకున్న తరువాత ఈ విషయాన్ని మీడియాకు వెల్లడిస్తారా..? లేక అసలు పట్టించుకోరా..? అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతం ఆయన దాయధి పాకిస్తాన్ ప్రేరేపిస్తున్న సీమాంతర ఉగ్రవాదం.. కాల్పుల ఉల్లంఘన అంశంలో, ఉగ్రవాదులకు పాకిస్థాన్ స్వర్గధామంలా మారిందని ఈ విషయంలో మ ప్రభుత్వం అనసరించాల్సిన వ్యూహాలపై చర్చించే పనిలో నిమగ్నమై వున్నారు.

ఈ తరుణంలో ఒడిశాకు చెందిన గిరిజన బాలుడు ఉమేష్ మాది ప్రధానికి లేఖ రాయడంతో దానిని ప్రధాని పట్టించుకుంటారా..? లేక విస్మరిస్తారా..? అన్నది కూడా ప్రాముఖ్యతను సంతరించుకుంది.  బీజేపి పార్టీ గిరిజనుల సంక్షేమాన్ని విస్మరిస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. ఇక మరోవైపు బీజేపి అనుబంధంగా వున్న గో రక్షణ సమితీ సభ్యులు స్వయంగా ప్రధాని నొంత రాష్ట్రం గుజారత్ లోనే గిరిజనులపై దాడులకు పాల్పడ్డారు. వారు గో మాంసాన్ని తరలిస్తున్నారన్న అరోపణలపై ఇనుపరాడ్లతో కొట్టి గాయపర్చారని, ఇలాంటి ఘటనలు ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలలో నమోదు కూడా అయ్యాయి.

దీంతో హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని లాల్ బహదూర్ స్టేడియంలో నిర్వహించిన ఓ పార్టీ కార్యక్రమంలో ప్రసంగిస్తూ గిరిజనులు కూడా మనుషులేనని, వారిపై దాడులకు పాల్పడితే సహించేది లేదన్న సందేశాన్ని కూడా ఇచ్చారు. ఈ క్రమంలో ఒడిశాలోని మల్కన్ గిరి ప్రాంతానికి చెందిన ఉమేష్‌ మాది అనే పదేళ్ల బాలుడు ప్రధానికి లేఖ రాయడం.. దానిపై ఆయనెలా స్పందిస్తారన్న విషయం ప్రాధాన్యతను చోటుచేసుకుంది.

తమ ప్రాంతంలో మెదడువాపు వ్యాధి విజృంభించి పిల్లలు చనిపోతున్నారనీ, సహాయం చేయాలని ఉమేష్ మాది తన లేఖలో ప్రధానిని అర్థించాడు. మల్కన్‌గిరి జిల్లాలో ఇప్పటికి 505 గ్రామాల్లో 73 మంది పిల్లలు మెదడువాపు వ్యాధి సోకి చనిపోయారు. అధికారులు మాత్రం ఆ సంఖ్య 27 మాత్రమేననీ, మిగతా పిల్లలు వివిధ ఇతర కారణాలతో చనిపోయారని బుకాయిస్తున్నారు. ‘మీరు ప్రపంచం అంతా తిరుగుతున్నారు. ఇక్కడ పిల్లలు ఎలా చస్తున్నారో చూడటానికైనా మా ఊరికి రాలేరా? మీరే మా చివరి ఆశ’ అని మోదీని ఉద్దేశించి ఉమేష్‌ లేఖలో పేర్కొన్నాడు.

ప్రధాని ప్రపంచమంతా తిరుగుతున్నారని బాలుడు రాసినందుకు ఆయనెలా స్పందిస్తారన్నది..? చర్చనీయాంశంగా మారింది. ఇదే తరహాలో దేశం నుంచి డ్రగ్స్ మాఫియాను తరిమికోట్టండని కేరళ రాష్ట్రానిక చెందిన పదో తరగతి బాలిక అనీ రిబూ జోషీ ప్రధానికి రాసిన లేఖపై ఇప్పటివరకు స్పందన కరువైంది. పదిహేనేళ్ల చిన్నారి ఏకంగా అంగ్లంలో చకచక మాట్లాడుతూ.. ప్రధానికి దేశం నుంచి పోగ, మద్యం, తంబాకు సహా డ్రగ్స్ మాఫియాను తరమికోట్టాలని సవాల్ విసిరితూ ఒక వీడియోను కూడా పంపింది. మరి అమెకు ఎలాంటి సమాధానం లభించిందో ఇప్పటి వరకు కేరళవాసులకే తెలియదు.

రుబీ జోషి ఎదురైన అనుభవమే ఉమేష్ మాదికి ఎదురవ్వనుందా..? లేక ఈ పదేళ్ల చిన్నారి రాసిన లేఖను కూడా ప్రధాని పట్టించుకుంటారా..? అన్నది ప్రాముఖ్యతను సంతరించుకుంది. రుబీ జోషి వీడియో వినతిలో కొంత ఇబ్బందిక, దేశ ఆదాయవనురుకు సంబంధించిన అంశాలు వుండగా, ఉమేష్ మాది రాసీన లేఖలో అరోగ్యానికి సంబంధించిన అంశం ముడిపడి వుంది. దీంతో తప్పక ప్రధాని పట్టించుకుంటారన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయ. అయితే ఒడిశాలో ఇప్పట్లో ఎన్నికలు లేనందున వాటి గురించి ఆయన పెద్దగా పట్టించుకోరని.. పైపెచ్చు అక్కడున్నది బీజేపి ప్రభుత్వం కూడా కానందున అయన విస్మరిస్తారన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. మరి ఈ క్రమంలో ఉమేష్ మాది లేఖపై స్పందన వుంటుందా..? ఎలా వుంటుంది..? అన్న విషయాలు వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Umesh Madhi  Japanese Encephalitis  PM Modi  Malkangiri district  Odisha  

Other Articles