అభిమానులను నిరాశపరుస్తున్న పవన్ కల్యాన్ నిర్ణయం.? Pawan Kalyan fans depressed by his decision..?

Pawan kalyan fans depressed by his decision

pawan kalyan, fans, pawan kalyan telangana fans, janasena ap politics, Telangan fans, vote enrollment, west godavari, pawan kalyan voter enrollment, pawan kalyan janasena, pawan kalyan west godavari, pawan kalyan andhra pradesh, pawan kalyan to shift from hyderabad, pawan kalyan to shift to eluru

Jana Sena president Pawan Kalyan depressed his telangana fans by his decision to play active role in andhr pradesh politics leaving behind telangana, where he has strong party cadre and fans

అభిమానులను నిరాశపరుస్తున్న పవన్ కల్యాన్ నిర్ణయం.?

Posted: 11/01/2016 12:46 PM IST
Pawan kalyan fans depressed by his decision

జనసేన అధినేత.. సినీనటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తీసుకున్న సంచలన నిర్ణయంపై ఆయన అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారా..? అంటే అవుననే సంకేతాలే వస్తున్నాయి. ప్రస్తుత రాజకీయ నేతలకు భిన్నంగా ఆలోచించడంతో ఆయన రాజకీయ పునరాగమనమే సంచలనంగా మారిన తరుణంలో అంధ్రప్రదేశ్ అభిమానులకు మాత్రం దీపావళి మిఠాయిలు పంచిన పవన్.. తమకు మాత్రం పండగ రోజున నిరాశ పర్చారని అయన పార్టీ కార్యకర్తలు, అభిమానులే నిరాశకు గురవుతున్నారు.

తన ఓటు హక్కును పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరుకు మార్చుకుని, అక్కడే తనకు అనుకూలంగా వుంటే ఓ ఇంటిని కూడా చూడాలని పవన్ తనకు కలిసేందుకు వచ్చిన పశ్చిమగోదావరి కార్యకర్తలతో కోరడంతో తెలంగాణ ప్రాంత అభిమానులు ఒకింత అసంతృప్తికి గురవుతున్నారు. ఇక తమ ప్రాంతానికి పవన్ రారా..? తమ ప్రాంతంలో జనసేన విస్తరించదా..? జనసేన కార్యకర్తలుగా, పవన్ అభిమానులుగా తామిన్నాళ్లు చేసిన సేవలు ఆయన గుర్తించరా..? ఇక మా పరిస్థితి ఆగమ్యగోచరమేనా..? అని వారు ప్రశ్నిస్తున్నారు.

గత రెండున్నరేళ్ల క్రితం పార్టీని స్థాపించిన సమయంలో రాష్ట్ర విభజనతో తెలంగాణలోని సీమాంద్ర ప్రజల హక్కుల పరిరక్షణకు, ఆడపడచుల కోసం పార్టీని స్థాపిస్తున్నాను.. కానీ ఓట్ల కోసమే నోట్ల కోసం కాదని తేల్చిచెప్పిన పవన్, అటు తెలంగాణలోని అభిమానులకు అప్పడు కూడా నిరాశపర్చాడు. తెలంగాణలోని సీమాంధ్ర ప్రజాభిమానాన్ని వదిలి, నవ్యాంధ్రకు పరిమితం కావడంతో పవర్ స్టార్, జనసేనాని అభిమానులు నిరాశకు గురవుతున్నారు. తెలంగాణలో పవర్ స్టార్ కు బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. మరోలా చెప్పాలంటే పవన్ ను దేవుడిగా అరాధించేవారు కూడా తెలంగాణలో అధికంగానే వున్నారనడం అతిశయోక్తి కాదేమో. అలాంటి అభిమానులను ఆయన తాజగా నిర్ణయం నిరాశకు గురిచేసింది.

తెలంగాణలో కూడా జనసేన పార్టీని విస్తరించాలని, బలోపేతం చేయాలని.. ఈ దిశగా జాతీయ పార్టీగా అవిర్భవించే దిశగా పవన్ అడుగులు వేస్తారని ఇన్నాళ్లు భావించిన తన అభిమానులు..? పవన్ ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కావడం జీర్ణంచుకోలేకపోతున్నారు. అయితే ఈ విషయంలో స్వయంగా పార్టీ అధినేత పవన్ అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు తన రాజకీయ భవిష్యత్ ప్రణాళికను వివరించే విషయమై కూడా ఓక సందేశాన్ని పంపుతారని వార్తలు అందుతున్నాయి. అయితే తెలంగాన ప్రాంత అభిమానులకు పవన్ పవర్ ను ఎలా అందిస్తారో వేచిచూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  ap politics  Telangan fans  vote enrollment  

Other Articles