ములాయంకి అఖిలేష్ గోతులు తీస్తున్నాడా? | UP CM Akhilesh Yadav hint for new party

Up cm akhilesh yadav ready for own party

Clash in Family UP CM Akhilesh Yadav, Akhilesh Yadav New Party, Pragathi Sheel Samajwadi Party, Akhilesh Yadav New Party Rumour, Akhilesh Yadav Vikas Parivarthan Rally

Clash in Family UP CM Akhilesh Yadav hint for new party.

అఖిలేష్ యాదవ్ షాకింగ్ డెసిషన్?

Posted: 10/22/2016 02:00 PM IST
Up cm akhilesh yadav ready for own party

యాదవ కుటుంబంలో రగులుతున్న చిచ్చు యూపీ రాజకీయాలను సమూలంగా మార్చేయటమే కాదు, ఓట్లను చీల్చే దిశగా అడుగులు పడుతున్నాయి. పైగా అవి అఖిలేష్ వి అవుతుండటం విశేషం. బాబాయ్ పై ప్రేమతో తండ్రితో తనను నిర్లక్ష్యం చేస్తుండటం తట్టుకోలేకపోతున్న యువ సీఎం కొత్త పార్టీ దిశగా అడుగులు వేయబోతున్నాడని సహచరులు ఉప్పందిస్తున్నారు. పార్టీ పగ్గాలు లాగేసుకున్న బాబాయ్ శివపాల్ మీటింగ్ కు అఖిలేష్ గైర్జాహరు కావటం ఈ విషయాన్ని ధృవపరుస్తోంది.

ఈ పరిణామాలన్నింటిని గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు ఎస్పీలో చీలిక తప్పదనే అంటున్నారు. దీనికి కొన్ని పరిస్థితులను కూడా జత చేస్తున్నారు. మొన్నటివరకు ఉమ్మడి కుటుంబంగా ఉన్న యాదవ్ ఫ్యామిలీ నుంచి విడిపోయిన అఖిలేశ్.. ఇటీవలే సీఎం అధికారిక నివాసానికి మకాం మార్చాడు. నవంబర్ 5న పార్టీ రజతోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతుండగానే పార్టీ పెద్దలతో చెప్పకుండా ‘వికాస్ రథయాత్ర’ చేపట్టాలని అఖిలేష్ నిర్ణయించాడు. ఇవన్నీ పార్టీలో చీలిక తప్పదనే సంకేతాలను బలపరుస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యనేతలంతా హాజరరైన సమావేశానికి కూడా గైర్హాజరయ్యాడు. ఈ పరిస్థితులు చాలవా అఖిలేష్ సొంత కుంపటిని తేల్చేయడానికి అని వారంటున్నారు.

భేటీని ఎగ్గొటి మరీ తన నివాసంలో వర్గీయులతో మీటింగ్ పెట్టి నవంబర్ 3నుంచి జరగనున్న ‘వికాస్ రథయాత్ర’ గురించి డిస్కష్ చేయటం కొసమెరుపు. అయితే వచ్చే ఎన్నికల్లో ఎస్పీ గెలిస్తే అఖిలేశే సీఎం అవుతాడని శివపాల్ తాజాగా కూడా చెప్పటం హైలెట్. సార్వత్రిక ఎన్నికల తర్వాత అంతటి ప్రాముఖ్యత ఉన్న యూపీ ఎన్నికల విషయంలో అఖిలేష్ పర్సనల్ రివెంజ్ తో తండ్రి పార్టీని మెల్లిగా దెబ్బకొట్టి, సొంత పార్టీతో వచ్చే ఎన్నికలకు వెళ్లబోతున్నాడన్నది మాత్రం మరికొద్దిరోజుల్లో బయటపడే అవకాశాలు ఉన్నాయి. ‘జాతీయ సమాజ్‌వాదీ పార్టీ’ లేదా ‘ప్రగతిశీల్ సమాజ్‌వాద్ పార్టీ’ పేరుతో మోటార్ సైకిల్ గుర్తుతో ప్రజల్లోకి వెళ్లేలా వ్యూహాలు రచిస్తున్నట్లు అంతరంగికుల ద్వారా తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : UP CM Akhilesh Yadav  New Party Rumour  Pragathi Sheel Samajwadi Party  

Other Articles