ముద్రగడ కోసం మాస్టర్ ఫ్లాన్ | Manjunath Committee active before Mudragada Padayatra

Manjunath committee active before mudragada padayatra

Manjunath Committee, Manjunath Committee districts tour, Mudragada Padayatra, Manjunath Committee on Kapu reservation, Kapu Reservation in AP, Kapu Leader Mudragada

Manjunath Committee active before Mudragada Padayatra threat.

ముద్రగడ పాదయాత్ర ఇంతలో ఏమైంది?

Posted: 09/20/2016 03:34 PM IST
Manjunath committee active before mudragada padayatra

సజావుగా సాగుతున్న పాలనలో తమ కులాన్ని బీసీల్లో చేర్చాలంటూ ఒక్కసారిగా ఉద్యమాన్ని లేపి రాజకీయ కలకలం రేపాడు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకే తాము ఈ డిమాండ్ చేస్తున్నామంటూ రెండు సార్లు ఆమరణ దీక్షకు దిగి ఆపై ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేశారు. త్వరలో ఏపీకి చెందిన కాపు ప్రముఖులనంతా కలుపుకుని ఉగ్ర స్థాయిలో ఉద్యమాన్ని లేవనెత్తేందుకు యత్నిస్తున్నాడని సంకేతాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఏం చేయబోతున్నాడు. అడ్డుకట్ట వేసేందుకు ఫ్లాన్ ఎంను అమలు చేస్తున్నాడా?

తుని ఘటన, ఆపై ముద్రగడ తొలిదపా ఉద్యమం తర్వాత చంద్రబాబు జస్టిస్‌ మంజునాథ్‌ నేతృత్వంలో ఓ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. పేరుకు మాత్రమే ఉన్న కమిటీ ఇన్నాళ్లు చలనం లేకుండా ఉండిపోయింది. అయితే పద్మనాభం పాదయాత్ర చే్స్తారన్న ఇంటలిజెన్స్ వార్తల నేపథ్యంలో, కమిటీని హడావుడిగా రంగంలోకి దింపటం ఆసక్తికరంగా మారింది. గత రెండు ఉద్యమాల కన్నా ఈసారి జరగబోయే డ్యామేజ్ పెద్ద ఎత్తున్న ఉందని భావించిన చంద్రబాబు హడావుడిగా మంజునాథ కమిటినీ జిల్లా పర్యటనలకు పంపినట్లు తెలుస్తోంది.

దాసరి , చిరు, పల్లంరాజు, అంబటి వాళ్లంతా ఈసారి ‘సీరియస్’ గా ముద్రగడకు మద్దతిస్తున్నారు. మరీ ముఖ్యంగా పాదయాత్ర పవర్ తెలిసిన చంద్రబాబు దానిని అడ్డుకోలేకపోయినప్పటికీ, దాని తీవ్రతను తగ్గించే పనిలో పడ్డాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో టీడీపీ కీలక నేతలతో కాపు నేతలను దువ్వే ప్రయత్నం కూడా చేస్తున్నాడని తెలుస్తోంది. ఇంకోవైపు విద్య కోసం విదేశాలకు వెళ్లే కాపు విద్యార్థులకు సాయం అందించడటం ద్వారా అసంతృప్తిని తగ్గించే పనిలో పడ్డట్లు కూడా వార్తలు అందుతున్నాయి.  

ప్రస్తుతం తిరుపతిలో మంజునాథ కమిటీ తన పర్యటనను కొనసాగిస్తోంది. జనాభాపరంగా బీసీల ఆర్థిక స్థితిగతులు తదితర అంశాలను పరిశీలించ మూడు నెలలకో, ఆర్నెల్లకో, ఏడాదికో ఇలా నివేదిక ఇస్తూ పోతుంది. ఈ మధ్యలో ఒకవేళ ముద్రగడ ఉద్యమం లేవనెత్తినా కమిటీ తన పని చేస్కుంటూ పోతుందని ప్రభుత్వం చెప్పొచ్చు. మరీ ముదిరితే రాజకీయచేయాలనే ముద్రగడ చూస్తున్నాడని తిప్పి కొట్టోచ్చు. దీంతో ఆయన కాపు ఉద్యమాన్ని ఎంత మేరకు ఎదుర్కొనగలిగే అవకాశం ఉంటే అంతవరకు ఎదుర్కొనేలా ఫ్లాన్ తో మంజునాథ కమిటీని రంగంలోకి దించాడని అర్థమౌతోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mudragada  Kapu reservation  Manjunatha Committee  District Tours  

Other Articles