ప్రశ్నిస్తే వ్యక్తిగత గన్ మెన్ లను తీసేయటమే | kcr removed leaders security personnel who criticize his ruling

Kcr removed leaders security personnel who criticize his ruling

kcr on opponent leaders moment, leaders security personnel remoned, personnel KCR, KCR eyed on opponent security personnel, Ponnala revanth and sabitha

kcr remove oppenent leaders security personnel who criticize his ruling.

నోరు జారితే పీకిపడేయడమే!

Posted: 08/25/2016 05:42 PM IST
Kcr removed leaders security personnel who criticize his ruling

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గార్కి నచ్చని విషయం ఏదన్నా ఉంది అంటే అది రాజకీయంగా ఆయన్ని విమర్శించడమే. ప్రస్తుతం ప్రతిపక్ష నేతలందరి మీద ఓ కన్నేసి ఉంచాలని ఇంటలిజెన్స్ అధికారులకు ఆయన సూచించారనే ఓ టాక్ కూడా ఉంది. ఒకవేళ పొరపాటున నోరు జారి లీడర్ల నోటి వెంట కేసీఆర్ ను తులనాడుతూ ఏదన్నా పదం వచ్చిందంటే చాలూ వారిని ముప్పుతిప్పలు పెట్టేదాకా ఆయన ఊరుకోరని పరిశీలకులు చెబుతూనే ఉంటారు.  

మచ్చుకు ఉదాహరణలు చూద్దాం. పొన్నాల లక్ష్మయ్య గతంలో పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో కేసీఆర్ పాలన పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన ఈయనగారికి తొందరగానే పంచ్ ఇచ్చారు టీ సీఎం. ఆయన వ్యక్తిగత గన్ మెన్లను విధుల నుంచి తొలగించి గట్టి దెబ్బే కొట్టారు. ఇక టీడీపీ నేత రేవంత్ రెడ్డి వ్యవహారం గమనిస్తే... ఓటుకు నోటు లో బుక్ అయి బయటికి వచ్చాక కూడా కేసీఆర్ పై ఆయన దారుణమైన కామెంట్లు చేశాడో మనకు తెలిసిందే. దాని ఫలితం  ఆయన వ్యక్తిగత సిబ్బంది ఊస్టింగ్ కూడా జరిగిపోయింది.

ఇక ఇప్పుడు మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి వంతు అయ్యింది. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డబుల్ బెడ్ రూం పథకంపైనా, రుణ మాఫీపైనా ఆమె ప్రెస్ మీట్లు పెట్టి మరీ తెలంగాణపై విరుచుకుపడింది. మరి ఆయన ఊరుకుంటారా? కట్ చేస్తే ఆమె పర్సనల్ గన్ మెన్ ను వెంటనే విధుల నుంచి తిరిగొచ్చేయని ఆదేశాలు జారీ అయ్యాయి. వాస్తవానికి ఆమె గన్ మెన్ కు విధుల నుంచి రిలీవ్ కావాల్సిందిగా ఎప్పుడో ఉత్తర్వులు అందాయి. కానీ, ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోవటంతో ఇన్నాళ్లూ కంటిన్యూ అవుతూ వస్తున్నాడు. కానీ, ఆమె గురి కేసీఆర్ వైపు మళ్లటంతోనే ఇలా నిర్ణయం తీసుకున్నారని ఇట్టే అర్థమైపోతుంది. అంటే కేసీఆర్ ను ప్రశ్నిస్తే పీకేయడం అనే పాలసీ ఇప్పుడు నడుస్తోందన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  opponent leaders  security personnel  remove  

Other Articles