నయానో భయానో, ఆశచూపో అసలు తెరవెనుక ఏం భాగోతాలు జరిగాయో తెలీదు కానీ మొత్తానికి ఫిరాయింపులతో తెలంగాణలో టీడీపీని ఖాళీ చేసి పడేసింది అధికార పక్షం. వీరిలో కొందరు బలవంతంగా చేరారనే టాక్ కూడా ఆ మధ్య వినిపించింది. అయితే పవర్ ఎంజాయ్ చేద్దామనుకున్న ఆ ఎమ్మెల్యేలకు ఇప్పుడు పార్టీలో పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోతుందట. ముఖ్యమైన స్థానాలకు చెందిన వారికి కనీసం సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదని వాపోతున్నారు. ఈ క్రమంలో ఓ ఇద్దరు తిరిగి టీడీపీ గూటికే చేరతారనే వార్తలు వినిపిస్తాయి.
ఓటుకు నోటులో సంబంధం ఉందని ఆరోపణలు వినిపించిన నగరానికి చెందిన ఎమ్మెల్యే తిరిగి సైకిల్ ఎక్కబోతున్నాడని పలువురు అంటున్నారు. అసలు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరినప్పుడే అంతా షాకయ్యారు. చంద్రబాబుకు చాలా దగ్గరి వ్యక్తిగా పేరొందిన ఆయన కారెక్కడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. తాను అధికార పార్టీలో చేరాల్సి వెనుక బ్లాక్ మెయిలింగ్ పరిస్థితులు నెలకొనటంపై చంద్రబాబుకు వివరించిన తరువాత పార్టీ మారారన్న వాదనా ఒకటుంది. అయితే తాజాగా ఆయన కుడి భుజంగా వ్యవహరించే నేత తిరిగి టీడీపీలో చేరటం, ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా దాదాపు ఆయన చేరికనే కన్ఫర్మ్ చేస్తున్నాయి.
ఇక మరో మరి నేత విషయానికొస్తే... గత సాధారణ ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన సదరు యంగ్ ఎమ్మెల్యే ఊరిస్తూ ఊరిస్తూ టీఆర్ఎస్ లోకి చేరారు. అధికార పార్టీలోకి వెళితేనే తన కష్టాలు తీరతాయని భావించిన ఆయన కాస్త అయిష్టంగానే గులాబి కండువా కప్పుకున్నారు. అయితే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. అధికారంలో ఉండి కూడా ఆయనకు అవమానాలే ఎదురయ్యాయి. ఓ భారీ భవన నిర్మాణంలో వివాదాల్లోకి ఎక్కారు. ప్రభుత్వంలో ఉండి కూడా తన పని చేయించుకోలేకపోయాడు. దీంతో మనస్థాపం చెందిన ఆయన తిరిగి సొంత పార్టీకే చేరాలని డిసైడ్ అయ్యాడంట. అయితే తెదేపా నుంచి వెళ్లిన ఈ ఇద్దరేనా లేక ఇంకా ఎవరైనా ఉన్నారా? అన్నది తెలియాల్సి ఉంది.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more