chandrababu naidu beats jayalalithaa in a wealthy CM list

Amid keeping state in number one chandrababu is number one

Chandrababu Naidu, assets, billionaire, election affidavit, Jayalalithaa, pema khandu, ADR report, chandrababu assets, chandrababu wealthy cm, chandrababu richest cm, Andhra pradesh

A report by the Association for Democratic Reforms (ADR) & National Election Watch (NEW) shows that Andhra pradesh Chief minister Chandra babu in the richest CM of India.

ఏపీ సంగతి దేవుడెరుగు.. బాబు మాత్రం నెంబర్ వన్..!

Posted: 08/11/2016 11:29 AM IST
Amid keeping state in number one chandrababu is number one

దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ను నెంబర్ వన్ స్థానంలో నిలబెడతానంటూ దానిని ప్రచారస్త్రంగా చేసుకుని ఎన్నికలలో విజయాన్ని సాధించిన తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలపే విషయం తెలియదు కానీ.. ఆయన మాత్రం నెంబర్ వన్ స్థానంలోనే నిలిచారు. అదేంటి అలా వ్యంగంగా అంటున్నారు అనుకునేరు..? నిజమే మరి. రాజధాని లేని రాష్ట్రాన్ని చేసి తమకు యూపీఏ ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ అన్యాయం చేసిందని నిత్యం విరుచుకుపడే చంద్రబాబు.. అస్తులు విలువలు లెక్కిస్తే నెంబర్ వన్ అని స్పష్టమవుతుంది.

రాజధాని లేని రాష్ట్రానికి మీరే విరాళాలు ఇవ్వండీ అంటూ రాష్ట్ర ప్రజల వద్దకు వెళ్లి జోలే పట్టిన ప్రభుత్వానికి ప్రజలు ఇతోధికంగానే సాయం చేశారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన రాష్ట్ర ఉద్యోగుల సంఘం సమావేశంలోనూ.. పలువరు కార్మికులు నిలువుదోపిడి ఇచ్చారు. అయితే అందరి నుంచి విరాళాలు వసూలు చేశారు కానీ.. నిజంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు కానీ, ఆయన తనయుడు నారా లోకేష్ కానీ, లేదా నారా వారి సంస్థల నుంచి కానీ ఎంత మేరకు విరాళాలు వచ్చాయన్నది ఇప్పటికీ మిస్టరీనే.

తానే మొత్తం, తానే సర్వం, తనతోనే నిజాయితీ పుట్టింది.. తాను లేకుంటే నీతే లేదన్నట్లు.. తాను చెప్పేదే వేదం, తాను చేసేదే ధర్మం అన్నట్లుగా వ్యవహరించే బాబు.. అడపా దడపా తన అస్తుల వివరాలను ప్రకటించి.. తాను కేవలం ఒక సామాన్యుడినని.. అయితే అస్తులు కూడా అంతగా లేవని ప్రకటించే చంద్రబాబు అస్తుల చిట్టా మాత్రం పెద్దగానే వుంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు గత సాధారణ ఎన్నికలకు ముందు అభ్యర్థులు అందచేసిన అఫిడవిట్‌లను అధ్యయనం చేసి నివేదిక రూపొందించాయి.

చంచ్రబాబు ప్రకటించే అస్తుల వివరాలు అప్పడప్పుడు తగ్గుతుంటాయి కూడా. అయితే వాస్తవానికి మాత్రం ఆయన ఆస్తుల వివరాలు లెక్కకు మించి పెరుగుతాయన్నది జగమెరిగిన సత్యం. ఏడీఆర్ సంస్థ రూపోందించిన నివేదిక ప్రకారం చంద్రబాబు అస్తుల విలువలో ఏకంగా దేశంలోనే నెంబర్ వన్ సీఎంగా నిలిచారు. ఆయన అస్తుల విలువ 177 కోట్ల రూపాయలు. అత్యధిక ఆస్తులు కలిగిన సీఎంల జాబితాలో తొలి స్థానంలో, దేశంలోని అన్ని రాష్ట్రాల మంత్రులతో పోల్చితే.. నాలుగో స్థానంలో నిలిచారు. ఈ విషయంలో ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కూడా దాటేశారు. అమె మూడవ స్తానంలో నిలువగా, అరుణాచల్ ప్రదేశ్ ముక్యమంత్రి ఫెమా ఖండూ ద్వితీయ స్థానంలో నిలిచారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నెంబర్ వన్ ముఖ్యమంత్రి అయ్యారు.. కానీ రాష్ట్రాన్ని ఎప్పుడు నెంబర్ వన్ చేస్తారన్న ప్రశ్నలు ప్రజల నుండి వ్యక్తం అవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu Naidu  assets  billionaire  election affidavit  Jayalalithaa  pema khandu  ADR report  

Other Articles